RPF Jobs: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు మరో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. మొత్తం 4,660 ఉద్యోగాలను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 14 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ (RPF)లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ మొదలైంది. ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్సించింది.
ఆర్పీఎఫ్ జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు ఇవే
4,660 పోస్టులలో 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 425 ఎస్పై ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పదో తరగతి, ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 2024 జూలై 1 నాటికి 18 – 28 ఏళ్ల వయస్సు ఉండాలి. ఎస్సై అభ్యర్థలకు 20-28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. విభిన్న వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసి అభ్యర్థులకు రూ. 250. ఇతరులకు రూ. 500.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ తదితర పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వేతనం: ఎస్సై ఉద్యోగాలకు రూ. 35,400, కానిస్టేబుల్ ఉద్యోగాలకు రూ. 21,700 ప్లస్ భత్యాలు ఉంటాయి.
పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రాలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్టు రీజియన్ల వారీగా ఖాళీల సంఖ్య, ఇతరత్రా వివరాలను ఇంకా తెలపాల్సి ఉంది.