TS-TET 2024: టెట్ అప్లికేష‌న్ల‌ గడువు పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం.. ఆఖ‌రి తేదీ ఎప్పుడంటే..!

tet exams
టెట్ పరీక్షకు దరఖాస్తు గడువు పెంపు

TS-TET 2024 Application last date: టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు మరో 10 రోజులు పొడిగించారు. తెలంగాణ ప్ర‌భుత్వం డిఎస్సి నిర్వ‌హించ‌డానికి ముందే టెట్ నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా విద్యాశాఖ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ మేర‌కు ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష నోటిఫికేష‌న్ 2024 మార్చి 14 న‌ విడుద‌ల చేసి మార్చి 27 వ తేదీ నుంచి ఏప్రిల్ 10 వ‌ర‌కూ దర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క‌టించ‌గా తాజాగా ఆ అప్లికేష‌న్ల గ‌డువు పెంచింది.

టెట్ నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ రాష్ట ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన కొద్దిసేప‌టికే విద్యాశాఖ టెట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. కాగా ఈ ప‌రీక్ష‌లు మే 20 నుంచి జూన్ 3 వ తేదీ వ‌ర‌కూ ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు విద్యాశాఖ వెల్లడించింది. డీఎస్సీ ప‌రీక్ష కంటే ముందుగా టెట్ నిర్వ‌హించుట‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ఈ మేర‌కు దర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ తేదీ ఏప్రిల్ 10గా నిర్దేశించారు. అయితే నిరుద్యోగ అభ్య‌ర్థుల కొర‌కు ఈ గడువును మ‌రో 10 రోజుల వ‌ర‌కూ పెంచనున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

TS-TET 2024 దర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఏప్రిల్ 20 వ‌ర‌కూ ఉంటుంద‌ని, అదేవిధంగా ఎడిట్ చేసుకునే వారికి కూడా ఆప్ష‌న్ అందుబాదుటులో ఉంటుందని విద్య‌ా శాఖ తెలిపింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు ఆన‌లైన్ ద్వారా అప్ల‌య్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్ల‌య్ చేసుకోవడానికి https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అభ్య‌ర్ధి పూర్తి వివ‌రాల‌తో దర‌ఖాస్తుల‌ను నింపి స‌మ‌ర్పించాలి. అయితే తెలంగాణ టెట్‌కు సంబంధించి గ‌తేడాదితో చూసుకుంటే ఈ‌సారి త‌క్కువ దర‌ఖాస్తులు వ‌చ్చిన్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో మొత్తం వ‌చ్చిన అప్లికేష‌న్లు 3.79 ల‌క్ష‌లు ఉండ‌గా ఇప్పుడు 1.90 ల‌క్ష‌ల దర‌ఖాస్తులు మాత్రమే వ‌చ్చాయి. ఇప్పుడు మ‌ళ్లీ 20 వ‌ర‌కూ గ‌డువు పెంచ‌డంతో మ‌రికొన్ని దర‌ఖాస్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Previous articleపూర్ణం బూరెలు రెసిపీ: ఈ సులువైన చిట్కాలతో మీ కుటుంబ సభ్యుల మెప్పు పొందండి
Next articleశ్రీ క్రోధి నామ సంవ‌త్స‌ర ఉగాది రాశి ఫలాలు: మీ జాతకం ఎలా ఉందో చూడండి