Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. అక్టోబరు 9 సోమవారం నుంచి అక్టోబరు 15 ఆదివారం వరకు వార ఫలాలు ఇక్కడ చూడండి.
మేష రాశి
శని పదకొండో ఇంట వక్రగమనంలో ఉన్నందున మీకు కొంత విశ్రాంతి అవసరం. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ వారం మీ ఆర్థిక సమస్యలన్నీ గట్టెక్కుతాయి. నూతన వస్తు, వస్త్ర కొనుగోలుకు మొగ్గు చూపుతారు. మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కార్యాలయంలో సవాళ్లు ఎదుర్కొంటారు. సహోద్యోగులు, సీనియర్ల సహకారం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి నిర్లక్ష్యం వీడాలి.
వృషభ రాశి
ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా మాత్రం ఒత్తిడి ఎదుర్కొంటారు. గురు రాహువుల వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతంది. ఆత్మీయులకు ఆర్థిక సహకారం చేయాల్సి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని కూడా గమనించుకోండి. మీ మంచితనం కారణంగా ఇతరులను ఆకర్షిస్తారు. శని పదో ఇంట్లో ఉండడం మీ కెరీర్‌కు కలిసి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు చదువులను నిర్లక్ష్యం చేయరాదు.
మిథున రాశి
మిథున రాశి జాతకులకు ఈవారం ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. సమతుల్య ఆహారం భుజించాలని సూచన. పెట్టుబడులు ఆచితూచి పెట్టండి. లేదా అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. తొమ్మిదో ఇంట శని ఉండడం వల్ల మీరు పని చేసే చోట గుర్తింపు పొందుతారు. వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పెండింగ్ పాఠాలను పూర్తి చేయాలి.
కర్కాటక రాశి
ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పనికి రాదు. పోషకాహారం మాత్రమే స్వీకరించాలి. మీ రాశి చక్రంలో శని ఎనిమిదో ఇంట ఉడడం వల్ల మీరు ఇతరులకు ఆర్థిక సాయం చేయాల్సి రావొచ్చు. కానీ అలా చేస్తే మీ భవిష్యత్తుకు ముప్పుంటుందని గ్రహించండి. పని చేసే చోట సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అయితే బుధుడు మూడో ఇంట ఉండడం వల్ల మీకు కొన్ని సానుకూల ఫలితాలు లభిస్తాయి.
సింహ రాశి
సింహ రాశి జాతకులకు ఆరోగ్యం మెరగవుతుంది. అనారోగ్యాలు నయమవుతాయి. డబ్బు పొదుపు చేయడం ప్రారంభించాలి. లేదంటే సమీప భవిష్యత్తులో ఇబ్బందులు పడుతారు. కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. వ్యాపారులకు ఈవారం అనుకూలంగా. విదేశాలతో సంబంధం ఉన్న వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. బుధుడి ఆశీస్సుల కారణంగా మీకు విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి
ఒంటరితనం, కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మీ వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటారు. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. గురు, రాహువుల వల్ల ఆర్థికంగా లాభపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పని చేసే చోట వాతావరణం బాగుంటుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు సాధిస్తారు. విద్యార్థులు చదవులో పట్టు విడవరాదు.
తులా రాశి
ఈవారం మీ ఆరోగ్యం మెరుగవుతంది. ధ్యానం, యోగా, వ్యాయామాల ప్రాముఖ్యత గుర్తిస్తారు. ఆర్థిక సమస్యలన్నీ కడదేరుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. పని చేసే చోట శ్రమ తగ్గుతుంది. అదనపు నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. బుధుడి ఆశీర్వాదంతో మీరు ఉన్నత విద్యాభ్యాసం కూడా చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కష్టపడాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు సూత్రాలు పాటించాలి. పని చేసే చోట మీ సహోద్యోగుల నుంచి కొన్ని చిక్కులు ఎదురవుతాయి. భవిష్యత్తుపై ఆశావహ ధోరణితో కష్టించాలి. విద్యార్థులు తాము చేసిన కృషి కారణంగా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
ఆరోగ్యంపై నిర్లక్ష్యం వీడండి. వ్యసనాలను త్యజించని పక్షంలో మీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వండి. గురు బలం వల్ల మీకు అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మీ వ్యక్తిత్వానికి తగని వ్యక్తులతో మీకు విభేదాలు రావొచ్చు. పని చేసే చోట మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు పట్టువిడవకుండా తమ ప్రయత్నాలు కొనసాగించాలి.
మకర రాశి
మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. రావలసిన నిధులు సమయానికి అందవు. అప్పులు చేయాల్సి వస్తుంది. కెరీర్ మాత్రం బాగుంటుంది. విదేశీ విద్యాభ్యాసం చేయాలనుకున్న వారి కల నెరవేరుతుంది. విద్యార్థులు పట్టువిడవకుండా తమ ప్రయత్నాలు చేయాలని సూచన.
కుంభ రాశి
కుంభ రాశి జాతకుల ఆరోగ్యం మెరుగవుతుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేయడానికి అధికంగా ఖర్చు చేస్తారు. పని చేసే చోట మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మీరు చేస్తున్న పని పట్ల మీకు నమ్మకం ఉండాలి. విద్యార్థులు పెండింగ్ అభ్యాసాలు పూర్తి చేయాలి.
మీన రాశి
అక్టోబరు 9 నుంచి 15వ తేదీ వరకు మీన రాశి వార ఫలాలు ఎలా ఉన్నాయంటే.. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచన. మీ ఆరోగ్యం మెరుగపడుతుంది. డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు. గౌరవ మర్యాదలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో స్థాన చలనం ఉండవచ్చు. శ్రమించే విద్యార్థులు చదవుల్లో రాణిస్తారు.