ఉగాది రాశి ఫలాలు క్రోధి నామ నూతన తెలుగు సంవత్సరంలో ఏయే రాశుల వారికి ఎలా ఉన్నాయి? ఎవరి జాతకం ఎలా ఉంటుంది? ఆదాయ, వ్యయాలు ఎంత? వంటివి ఇక్కడ తెలుసుకోండి.
1.మేష రాశి: (అశ్విని , భరణి, కృత్తిక 1)
ఆదాయం – 8, వ్యయం – 14, రాజపూజ్యం – 4, అవమానం – 3
ఏప్రిల్ 30 నుంచి ఈ రాశి వారికి లాభస్థానంలో శని, వ్యయంలో రాహువు, ధన స్ఘానంలో గురువు సంచారం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు అంచనాలకు మించి అభివృద్ది చెందుతాయి. రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అపార్థాలు తలెత్తవచ్చు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 30 తర్వాత తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.
2. వృషభ రాశి: (కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
ఆదాయం – 2 , వ్యయం – 8 , రాజపూజ్యం – 7, అవమానం – 3
ఈ రాశి వారికి ఏప్రిల్ 30 తర్వాత నుంచి గురువు సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. లాభస్థానంలో రాహువు, వృషభ రాశిలో గురువు, దశమ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడు సంచారం చేస్తున్నందు వల్ల అనేక విధాలుగా శుభ యోగాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విశేషంగా పెరుగుతాయి. సంతాన యోగం ఉంటుంది.అనుకోని విధంగా సంపద పెరుగుతుంది. కొన్ని కష్టనష్టాలు, అధిక వ్యయం కూడా ఉండొచ్చు.ప్రేమ వ్యవహారాల్లొ అనుకూలతలు పెరుగుతాయి.
3. మిథున రాశి: (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం – 5 , వ్యయం – 5, రాజపూజ్యం – 3, అవమానం – 6
ఈ రాశి వారికి సంవత్సరమంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ 30 తర్వాత గురువు లాభస్తానం నుంచి వ్యయ స్థానానికి మారడం వల్ల కాస్త ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యపారాలు లాభాదాయకంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఆందోళన కలిగిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి.
4. కర్కాటక రాశి: (పునర్వసు 4, పుష్యమి, అశ్లేష)
ఆదాయం – 14, వ్యయం – 2, రాజపూజ్యం – 6, అవమానం – 6
ఈ రాశి వారికి అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ లాభస్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నందువల్ల సంవత్సరమంతా సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. కొద్ది కాలంలోనే ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతగా సంతృప్తి చెందకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. గృహ, వాహన ప్రాప్తికి అవకాశం ఉంది, వృత్తి వ్యవహారాలు వృద్ది చెందుతాయి. కొర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యపీగా సాగిపోతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది.
6. సింహ రాశి: (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం – 2, వ్యయం – 14, రాజపూజ్యం – 2, అవమానం – 2
ఈ రాశివారికి ఇతర గ్రహాల అనుకూలతల వల్ల అప్పుడప్పుడూ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏప్రిల్ 30 నుంచి సప్తమ శని, అష్టమ రాహువు, దశమ గురువు వల్ల సంవత్సరమంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అవసరానికి డబ్బు అందదు. ధన సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన. కొన్ని శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.
7. కన్య రాశి: (ఉత్తర 2, 3, 4 హస్త, చిత్త 1,2)
ఆదాయం -5, వ్యయం – 5, రాజపూజ్యం -5, అవమానం -2
ఏప్రిల్ 30 నుంచి భాగ్య స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు, ప్రయాణాలు బాగా జరుగుతాయి. జీవిత భాగస్వామికి కూడా అదృష్ట యోగం పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్ధులు కొద్దిపాటి శ్రమతో పురోగతి సాధిస్తారు.
7. తుల రాశి: (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
ఆదాయం -2, వ్యయం – 8, రాజపూజ్యం -1, అవమానం – 5
గురువు , శని గ్రహాల సంచారం ఏ మాత్రం అనుకూలంగా లేదు. రాహువు మాత్రం ఆరో స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల సంవత్సరమంతా మిశ్రమ ఫలితాలు. ఆదాయం పెరిగినప్పటికీ ఎక్కువ భాగం వృథా ఖర్చయ్యే సూచనలు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంలోనూ, దాంపత్య జీవితంలోనూ సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.
8. వృశ్చిక రాశి: (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం – 8, వ్యయం – 14, రాజపూజ్యం -4, అవమానం -5
ఏప్రిల్ 30 తర్వాత గురువు సప్తమంలోకి మారుతున్నందువల్ల చెడు ఫలితాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితం ఉంటుంది. ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. శుభ వార్తలు వింటారు. అనవసర పరిచయాల కారణంగా ఇబ్బంది పడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. గృహ నిర్మాణాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ది ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.
9. ధనుస్సు రాశి: (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1)
ఆదాయం – 11, వ్యయం – 5 రాజపూజ్యం – 7, అవమానం – 5
ఈ రాశి వారికి ఏప్రిల్ 30 తర్వాత ఆరో స్థానంలో గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. మూడవ స్థానంలో శని ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. వృత్తి ఉద్యోగాలు బాగానే సాగిపోతాయి. ఎక్కువగా డబ్బు నష్టపోవడం జరుగతుంది. ఆర్థిక వ్యవహారాలు అంచనాలు తలకిందులవుతాయి. వృత్తి వ్యాపారాలలొ ఆలోచనలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇష్టమైన వారితో పెళ్లి కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
10. మకర రాశి: (ఉత్తరాషాడ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2)
ఆదాయం – 14, వ్యయం – 14, రాజపూజ్యం -3, అవమానం 1
గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. ధన స్థానాధిపతి శనీశ్వరుడు ధనస్థానంలోనే ఉన్నందువలన రాహువు తృతీయంలో, ఈ నెలాఖరు నుంచి గురువు పంచమంలో సంచారం చేయడం అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం వస్తుంది. వ్యాపారాల్లొ కొత్త ఆలోచనలు వస్తాయి. విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
11. కుంభ రాశి: (ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
ఆదాయం – 14 , వ్యయం – 14, రాజపూజ్యం -6 అవమానం -1
ఏలినాటి శని ప్రభావం, ధన స్థానంలో రాహువు సంచారం మరికొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశముంది. ఈ నెలాఖరు నుంచి నాలుగవ స్థానంలో గురువు సంచారం కూడా ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఆదాయం బాగున్నప్పటికీ ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల వల్ల కూడ ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి.గృహ, వాహనాల కోసం చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
12. మీన రాశి: (పూర్వాభాద్ర 4 , ఉత్తరాభాద్ర , రేవతి)
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4
ఈ రాశి వారిలో రాహువు సంచారం, శని ప్రభావం ప్రతికూలంగా ఉంటాయి. మేష రాశిలో ఉండి ఈ రాశికి అండగా ఉన్న గురువు కూడా వృషభ రాశిలోకి మారుతుండడంతొ ఈ రాశి వారికి శుభ ఫలితాలు బాగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చులు బాగా తగ్గుతాయి. గృహ వాహనాల మీద ఖర్చు తప్పకపోవచ్చు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.