వెడ్డింగ్ గిఫ్ట్ ఐడియా కోసం ఆలోచిస్తున్నారా.. మనకు అత్యంత ఆత్మీయులైన మిత్రులు, బంధువుల పెళ్లికి వెళ్లినపుడు గిఫ్ట్ ఇవ్వడం కామనే. కానీ కాస్త వెరైటీ వెడ్డింగ్ గిఫ్ట్‌తో వారికి ఒక మధురానుభూతి పంచాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మేము చెప్పబోయే wedding gift idea ట్రై చేయండి.
వీటిలో చాలా వరకు రోజువారీగా వాడే వస్తువులే ఉన్నాయి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఈ వెరైటీ వెడ్డింగ్ గిఫ్ట్స్‌ను ప్రెజెంట్ చేస్తారు. పైగా ధర కూడా మీ బడ్జెట్‌లోనే ఉంటుంది. మామూలుగా వెడ్డింగ్ గిఫ్ట్స్ మార్కెట్‌లో ఎన్నో ఉంటాయి. వాటిలో నచ్చింది సెలెక్ట్ చేసుకోవడం అంత సులువు కాదు. అందులోనూ రొటీన్‌కు భిన్నంగా ఉండాలనుకుంటే మరీ కష్టం. అలాంటి వాళ్లు డియర్ అర్బన్.కామ్ చెబుతున్న ఈ వెరైటీ వెడ్డింగ్ గిఫ్ట్స్‌ను ట్రై చేయొచ్చు.
వెడ్డింగ్ గిఫ్ట్ ఐడియా ఎలా ఉండాలి?
వెడ్డింగ్ గిఫ్ట్స్ అంటేనే కొత్తగా పెళ్లయిన జంటకు పనికొచ్చేవిగా ఉండాలి. అందుకే ఏదైనా గిఫ్ట్ కొనే ముందు వాళ్లు దానిని ఎంత మేరకు వాడతారో చూసుకోవడం మంచిది. వాళ్ల లైఫ్ స్టైల్, అలవాట్లు, టేస్ట్‌లు తెలుకోగలిగితే అందుకు తగిన గిఫ్ట్ ఇచ్చే వీలుంటుంది.
మీరిచ్చే గిఫ్ట్ సాధ్యమైనంత వరకూ యూనిక్‌గా, ఈ కాలం ట్రెండ్‌కు తగినట్లు ఉండటంతోపాటు ఆ కపుల్ టేస్ట్‌కు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఫిజికల్ గిఫ్ట్‌లే కాదు.. ఆన్‌లైన్ గిఫ్ట్ కార్డులు కూడా ట్రై చేయొచ్చు. బడ్జెట్ మీ రిలేషన్‌షిప్‌పై ఆధారపడి ఉంటుంది.
మరీ క్లోజ్ ఫ్రెండ్స్ లేదా బంధువులైతే కాస్త ఎక్కువైనా పెట్టొచ్చు. సాధారణంగా రూ.2 వేల లోపు ఉన్న వెడ్డింగ్ గిఫ్ట్ అయితే ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. మరి అలాంటి వెరైటీ వెడ్డింగ్ గిఫ్ట్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం.
3డీ మూన్ ల్యాంప్
రొమాన్స్‌కు, చందమామకు ఓ విడదీయలేని బంధమే ఉంది. వెండి వెన్నెల్లో హాయిగా విహరించాలని ప్రతి రొమాంటిక్ కపుల్ అనుకుంటుంది. మరి ఆ చందమామనే తీసుకొచ్చి వాళ్ల చేతికి ఇస్తే ఎలా ఉంటుంది? రొటీన్ వెడ్డింగ్ గిఫ్ట్స్ కంటే కాస్త ఔట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి ఈ 3డీ మూన్ ల్యాంప్ ఇచ్చారంటే.. అందరిలోనూ మీరు స్పెషల్‌గా నిలుస్తారు.
ఫ్యాన్సీ లుక్‌తో ఉండే ఈ మూన్ ల్యాంప్‌ను బెడ్ పక్క టేబుల్‌పై అందంగా డెకొరేట్ చేసుకోవచ్చు. ఈ ల్యాంప్‌ను గ్లాస్‌తో తయారు చేస్తారు. దీనికింద చెక్కతో చేసిన ఓ స్టాండ్ ఉంటుంది. డిజైన్ చేసిన లైట్ కారణంగా గదికే ఓ కొత్త అందం వస్తుంది.
ఈ 3డీ మూన్ ల్యాంప్ ధర కూడా చాలా తక్కువ. 800 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కస్టమైజ్డ్ మూన్ ల్యాంప్స్ కావాలన్నా దొరుకుతాయి. వెడ్డింగ్ కపుల్ ఫొటోను మూన్ ల్యాంప్‌పై ప్రింట్ చేయించుకోవచ్చు. వీటి ధర రూ. 2 వేల వరకూ ఉంటుంది.
కాఫీ మేకర్
కాఫీ మేకర్ కూడా మంచి వెడ్డింగ్ గిఫ్టే. పైగా ప్రతిరోజూ ఉపయోగించగలిగేది. ఉదయాన్నే కాఫీ సువాసనలు నిద్ర లేపుతుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. పైగా మీ బడ్జెట్‌లోనే ఎన్నో ఎలక్ట్రానిక్ కాఫీ మేకర్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఫిలిప్స్ కంపెనీకి చెందిన హెచ్‌డీ 7431 మోడల్ బెస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్‌గా చెప్పొచ్చు. స్టైలిష్ లుక్‌తో కేవలం ఒక కేజీ బరువు మాత్రమే ఉండే ఈ మెషీన్.. కొత్తగా పెళ్లయిన జంటకు బాగా ఉపయోగపడుతుంది. కేవలం 8 నిమిషాల్లో కాఫీని రెడీ చేస్తుంది.
దీనికి మీ నైపుణ్యం కూడా పెద్దగా అవసరం లేదు. దీని ధర రూ. 2100 మాత్రమే. ప్రెస్టిజ్‌లాంటి కంపెనీలకు చెందిన కాఫీ మేకర్స్ అయితే రూ.వెయ్యి నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి.
పోలరాయిడ్ కెమెరా
వీటినే ఇన్‌స్టాంట్ కెమెరా అని కూడా అంటుంటాం. కెమెరా క్లిక్‌మనిపించగానే ఫొటో బయటకు వచ్చేస్తుంది. ఈ స్మార్ట్ ప్రపంచంలో సెల్ఫీలతో ఇప్పటికే బోర్ కొట్టేసింది. కాస్త వెరైటీగా ఆలోచించి ఈ పాత కాలం కెమెరాను కొత్తగా ఇచ్చారంటే పెళ్లయిన జంట సర్‌ప్రైజ్ అవుతుంది. రూ. 2 వేల నుంచి రూ .3 వేల ధరల్లోనూ మంచి పోలరాయిడ్ కెమెరాలు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. ఫ్యుజిఫిల్మ ఇన్‌స్టాక్స్ 8 కూడా అలాంటిదే. దీని ధర అమెజాన్‌లో రూ. 2399గా ఉంది.
డిజిటల్ ఫొటో ఫ్రేమ్
మూన్‌ల్యాంప్‌లాగే ఈ డిజిటల్ ఫొటో ఫ్రేమ్ కూడా కొత్తగా పెళ్లయిన జంటకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఫొటోల రూపంలో ఉన్న జీవితంలోని మధుర జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు కళ్ల ముందు ఉంచుతుందీ డిజిటల్ ఫొటో ఫ్రేమ్. ఓ స్లైడ్ షో రూపంలో ఫొటోలను ఇందులో చూసుకోవచ్చు. రెండు వేల నుంచి మూడు వేల ధరల్లోనూ మంచి డిజిటల్ ఫొటో ఫ్రేమ్స్ అందుబాటులో ఉన్నాయి. డిజిఫ్లిప్ డీఎఫ్001 అందులో ఒకటి. ఇందులో ఆరు ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 32 జీబీ వరకూ ఎస్‌డీ కార్డ్‌ను ఇందులో ఇన్‌సెర్ట్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 1999.
కపుల్ పర్‌ఫ్యూమ్ సెట్
వెరైటీ వెడ్డింగ్ గిఫ్ట్స్‌లో ఈ పర్‌ఫ్యూమ్ సెట్‌ను కూడా ట్రై చేయొచ్చు. కపుల్ కోసం కాంబో ప్యాక్‌లలోనూ ఇవి దొరుకుతున్నాయి. టైటాన్ కంపెనీకి చెందిన స్కిన్ (Skinn) సెట్ బెస్ట్ అని చెప్పొచ్చు. రూ. 1500 నుంచి రూ. 2500 మధ్య కపుల్ సెట్స్ అందుబాటులో ఉన్నాయి.
బార్బెక్యూ గ్రిల్
పెళ్లి చేసుకోబోయే జంట ఫుడ్ లవర్స్ అయితే ఈ బార్బెక్యూ గ్రిల్ ఇవ్వొచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే పోర్టబుల్ గ్రిల్స్ కూడా ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. ప్రెస్టిజ్ కంపెనీకి చెందిన పోర్టబుల్ బార్బెక్యూ అమెజాన్‌లో రూ. 2100కే లభిస్తోంది.
కుక్‌బుక్
ఫుడ్ లవర్స్‌కు ఈ కుక్‌బుక్ అనేది కూడా మంచి గిఫ్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ బుక్ భార్యలకు బాగా పనికొస్తుంది. పెళ్లయిన కొత్తలోనే వెరైటీ వంటకాలతో రోజుకో కొత్త టేస్ట్‌ను భర్తలకు రుచి చూపించవచ్చు.
ఫొటో ఫ్రేమ్స్
బెడ్‌రూమ్‌ను అందంగా డెకొరేట్ చేయడానికి వీలుగా వివిధ సైజుల్లో ఉండే ఫొటో ఫ్రేమ్స్ సెట్స్ కూడా ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. వీటితో ఓ గోడను మొత్తం ఫొటోల రూపంలో ఉన్న వాళ్ల అరుదైన జ్ఞాపకాలతో డెకొరేట్ చేసుకోవచ్చు. 16 ఫ్రేమ్‌లతో ఉన్న సెట్ అమెజాన్‌లో రూ. 1525 కే లభిస్తోంది. ఇది వందకు వంద శాతం మంచి వెడ్డింగ్ గిఫ్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అమెజాన్ గిఫ్ట్ కార్డ్
మార్కెట్‌లో ఎన్నో గిఫ్ట్స్ చూసి చూసి ఏది సెలక్ట్ చేయాలో తెలుసుకోలేకపోతున్నారా? అయితే ఇలా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కూడా ఇవ్వొచ్చు. అమెజాన్‌లోకి వెళ్లి మీరెంత మొత్తం ఇవ్వాలనుకుంటున్నారో అంతకు ఓ గిఫ్ట్ కార్డును సెలక్ట్ చేసుకోవచ్చు. ఈ కార్డ్‌ను పెళ్లయిన జంటకు ఇస్తే.. వాళ్లకు నచ్చిన గిఫ్ట్‌ను వాళ్లే సెలక్ట్ చేసుకుంటారు. ఇదొక్కటే కాదు.. బట్టలు, నగలు, ఫుడ్, ఇతర షాపింగ్‌కు సంబంధించిన ఎన్నో ఆన్‌లైన్ గిఫ్ట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. కపుల్ టేస్ట్‌ను బట్టి సెలెక్ట్ చేసి ఇవ్వొచ్చు.
అధునాతన స్మార్ట్ డివైజెస్
టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ స్మార్ట్ హోం డివైజెస్ పెరుగుతున్నాయి. ఇంట్లో వర్చువల్ అసిస్టెంట్ కూడా తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఓకే గూగుల్, అలెక్సా.. అంటూ తమకు కావాల్సిన సేవలను కూర్చున్న చోటు నుంచే పొందుతున్నారు. దీనిపై డియర్ అర్బన్ ప్రత్యేక కథనాలు కూడా చదవి.. వాటిలో మీ బడ్జెట్ కు అనుగుణంగా గిఫ్ట్ ఎంచుకోవచ్చు. స్మార్ట్ హోం డివైజెస్ , ఓకే గూగుల్.. నువ్వు ఏవిధంగా సాయపడగలవు .. ఈ కథనాలు చదవి వెడ్డింగ్ గిఫ్ట్ ఐడియా కనుక్కోవచ్చు.
ఉపయోగపడేది ఏదైనా వెడ్డింగ్ గిఫ్ట్ ఐడియానే
ఫిట్ నెస్ బ్యాండ్, బ్లెండర్స్, మిక్సీలు, ఓవెన్స్‌లాంటి హోమ్ అప్లయెన్సెస్‌తోపాటు డిన్నర్ సెట్స్, వాల్ క్లాక్స్, పర్సనలైజ్డ్ కాఫీ కప్స్‌లాంటివి కూడా ఇవ్వొచ్చు.
బడ్జెట్ పరిమితులు లేవనుకుంటే వాటర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ఫ్యూరిఫయర్, వాషింగ్ మిషన్.. బంగారునగలు.. ఇవన్నీ కూడా ఉపయోగపడేవే..
ఇవన్నీ కొత్తగా పెళ్లయిన జంటకు ఉపయోగపడేవే. కానీ మీరిచ్చిన గిఫ్ట్స్ యూనిక్‌గా ఉండాలంటే మాత్రం పైన చెప్పిన వెరైటీ వెడ్డింగ్ గిఫ్ట్స్ ట్రై చేయండి.
వెడ్డింగ్ గిఫ్ట్ ఐడియా కథనం మీకు నచ్చితే మీ స్నేహితులు, బంధుమిత్రులకు షేర్ చేయడం మరవకండి.