ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగి జీవితానికి వెన్నెముక లాంటిది. మనకు తెలియకుండానే ఈ పీఎఫ్ మన సర్వీసుకు అనుగుణంగా పెద్దదవుతుంది. మన కష్టాల్లో అండగా ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ను ఏడు సందర్భాల్లో మన అవసరాలకు తగినట్టుగా విత్ డ్రా చేసుకోవచ్చు.
ముఖ్యంగా జీవితంలో అతి ముఖ్యమైన సందర్భాల్లో ఈ ప్రావిడెంట్ ఫండ్ మనం ఉపసంహరించుకుని వీలుంది ఆ సందర్భాలు ఏంటో ఇప్పుడు చూద్దాం
1. పెళ్లి
వివాహం చేసుకునే సందర్భంలో ఈపీఎఫ్ నుంచి 50 శాతం మేర ఉద్యోగి వాటా ఉపసంహరించుకోవచ్చు. అయితే ఏడేళ్ళ సర్వీస్ పూర్తిచేసి ఉండాలి.
అవివాహిత ఉద్యోగి లేదా కుమారుడు లేదా కుమార్తె, సోదరుడు లేదా సోదరి వివాహానికి నగదు ఉపసంహరించుకోవచ్చు.
2. విద్య కోసం
ఉద్యోగి ఈపీఎఫ్ చందా లో 50% వాటా వరకు ఉపసంహరించుకోవచ్చు. దీనికి కూడా ఏడేళ్ళ సర్వీసు పూర్తి చేసి ఉండాలి.
ఉద్యోగి ఉన్నత విద్య కోసం గానీ లేదా పదో తరగతి పూర్తి చేసిన ఆ ఉద్యోగి పిల్లల కోసం గానీ నగదు ఉపసంహరించుకోవచ్చు.
3. స్థలం కొనుగోలు లేదా ఇల్లు నిర్మాణం లేదా ఇంటి కొనుగోలు.
మూడో అంశం అతి ప్రాముఖ్యమైనది. స్థలం కొనుగోలు కోసమైతే నెలసరి వేతనం, డిఎ కలిపి దానిపై 24 రెట్ల మేర ఉపసంహరించుకోవచ్చు. ఇంటి నిర్మాణం కోసం అయితే ముప్పై ఆరు రెట్లు ఉపసంహరించుకోవచ్చు.
ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసి ఉండాలన్న నిబంధన ఉంది. ఇక సదరు ఆస్తి, అంటే స్థలం గానీ ఇల్లు గానీ ఉద్యోగి పేరున గానీ జీవిత భాగస్వామి పేరున గానీ లేదా సంయుక్తంగా గాని రిజిస్టర్ అయి వుండాలి. దాదాపుగా 90 శాతం వరకూ వెనక్కి ఇస్తారు.
4. హోమ్ లోన్ రీ పేమెంట్ కోసం
హోమ్ లోన్ రీ పేమెంట్ కోసం కూడా పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే సదరు ఆస్తి ఉద్యోగి పేరిట గానీ జీవితభాగస్వామి పేరిట గానీ సంయుక్తంగా గానీ రిజిస్టర్ అయి అయ్యుండాలి.
హోమ్ లోన్ రీపేమెంట్ కోసం 90 శాతం నగదు ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగి చందా, అలాగే యాజమాన్యం చందా.. 2 ఖాతాల నుంచి 90 శాతం ఉపసంహరించుకోవచ్చు.
5. ఇంటి ఆధునీకరణ
ఇందుకోసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. 12 నెలల వేతనానికి సమానంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సదరు ప్రాపర్టీ ఉద్యోగం పేరిట లేదా జీవిత భాగస్వామి పేరిట లేదా సంయుక్తంగా గాని రిజిస్టర్ అయి ఉండాలి.
6. మెడికల్ ఎమర్జెన్సీ
ఆరో అంశం మెడికల్ ఎమర్జెన్సీ. ఇక్కడ ఇన్నేళ్లు సర్వీస్ పూర్తిచేసి ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. ఆరు నెలలకు సరిపడా నగదు ఉపసంహరించుకోవచ్చు.
ఉద్యోగికి గానీ, కుటుంబ సభ్యుల చికిత్స కోసం కానీ నగదు ఉపసంహరించుకోవచ్చు.
అయితే ట్రీట్మెంట్ కి సంబంధించిన సర్టిఫికెట్ పైన డాక్టర్ మరియు యజమాని సంతకం ఉండాలి.
7. పదవీ విరమణకు ముందు..
ఏడో అంశం పదవీ విరమణ కంటే కొద్దికాలం ముందు.. అంటే ఉద్యోగి 50 ఏళ్ల వయసు చేరుకోగానే నగదు ఉపసంహరించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి