విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకకుల ముందుకు రానున్నాడు. గీత గోవిందం సినిమాతో ఎంతో క్రేజ్‌ని దక్కించుకున్న రౌడీ స్టార్.. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలకు సిద్దం కానుంది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు రెడీగా ఉంది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేయడంతో దానిపై స్పందిస్తూ రష్మిక ఒక ట్వీట్ చేసింది.
వచ్చే వారమే విడుదలకు సిద్దంగా ఉన్న ఈ ఫ్యామిలా స్టార్ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు హిరోయిన్ రష్మిక. బెస్ట్ మూవీని ఇవ్వబోతున్న నా డార్లింగ్ విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ యాంగిల్‌లో ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో మృణాల్ హిరోయిన్‌గా నటిస్తుంది. రష్మిక డైరెక్టర్ పరశురామ్, హీరోయిన్ మృణాల్‌కు కూడా విషెస్ అందించారు. ఈ సందర్భంగా హిరోయిన్ రష్మిక ఏప్రిల్ 5న విడుదల కాబోయే ఈ సినిమా ఖచ్చితంగా బెస్ట్ మూవీ అవుతుందని, తనకు పార్టీ కావాలి అంటూ లవ్ సింబల్‌తో ట్వీట్ చేశారు. కాగా ఏప్రిల్ 5వ తేదీ ఆమె బర్త్ డే కూడా కావడం విశేషం.
దీనికి విజయ్ దేవరకొండ కూడా క్యూట్‌గా క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చేశారు. డైరెక్టర్ పరశురామ్ సూపర్ హిట్ మూవీ గీత గోవిందంతో ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యారు. ఇప్పుడు మరొక హిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని, సినిమా మొదలు నుంచి చివరి వరకూ మంచి ఎమోషనల్స్ పండుతాయని ఆయన అన్నారు.
గీత గోవిందం మూవీని ఎంత ఎంజాయ్ చేశారో అంతకంటే మించిన ఎంజాయ్‌తో ఈ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నామని హిరో విజయ్ దేవరకొండ అన్నారు. అంతేకాదు ఇది కేవలం సాఫ్ట్ ఫ్యామిలీ స్టార్ కాదని ఆయన చెప్పారు. ఏదేమైనా హీరోయిన్ రష్మిక చేసిన ట్వీట్‌కు నెటిజన్లు కామెంట్లతో హడావుడి చేస్తున్నారు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్