Best gym in hyderabad: హైదరాబాద్‌లో బెస్ట్ జిమ్, ఫిట్ నెస్ సెంటర్ కోసం వెతుకుతున్నారా? దగ్గర్లోని బెస్ట్ జిమ్ కోసం చూస్తున్నట్టయితే ఈ కథనం మీకోసమే. నగరాల్లో యువత, ఒత్తిడి రీత్యా ఉద్యోగస్తులు జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేస్తూ కండలు కరిగించేస్తున్నారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ తమ బాడీని ఓ షేప్‌లో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. జిమ్‌లో బరువులు ఎత్తడంతోపాటు అదనంగా ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ.. కొవ్వును దరి చేరనీయని డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఇందుకోసం బెస్ట్ జిమ్ ఎక్కడ ఉందో వెతుకుతున్నారు.
అత్యాధునిక పరికరాలు, పర్సనల్ ట్రైనర్ ఉండటంతోపాటు ఎలాంటి డైట్ ఫాలో కావాలో చెప్పే ఓ పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ సెంటర్ వంటి బెస్ట్ జిమ్ కోరుకుంటున్నారు. హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాల్లో గల్లీకో జిమ్ ఎలాగూ ఉంటుంది. అయితే మీరు కోరుకున్న అత్యాధునిక సదుపాయాలు కల్పించేవి మాత్రం కొన్నే ఉంటాయి. బెస్ట్ జిమ్ మీకు అందుబాటులో ఎక్కడ ఉంది? అక్కడ ఉండే సదుపాయాలు ఏంటి ? వాటి రుసుము ఎంత? అన్న సమగ్ర సమాచారంతో డియర్ అర్బన్ అందిస్తున్న స్టోరీ ఇది.
360 డిగ్రీ ఫిట్‌నెస్
ఎక్కడ: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న క్రోమా బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్
కొండాపూర్ గూగుల్ ఎదురుగా స్టోన్‌రిడ్జ్ సెంటర్ సెకండ్ ఫ్లోర్
టైమ్: సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు
ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు
కాంటాక్ట్ నంబర్స్: 9000111360, 040 23552360, [email protected]
పరికరాలు, ఇతర సదుపాయాలు: ట్రెడ్‌మిల్స్, ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్స్, బైక్స్, రోయింగ్ మెషీన్స్, బార్‌బెల్స్, డంబెల్స్, పర్సనల్ ట్రైనింగ్, గ్రూప్ ఫిట్‌నెస్ క్లాసెస్, ఏరోబిక్స్, సాల్సా డ్యాన్స్, కిక్ బాక్సింగ్, స్పిన్నింగ్, యోగా క్లాసెస్. బెస్ట్ జిమ్ లో ఈమాత్రం సదుపాయాలు, పరికరాలు ఉండాల్సిందే మరి.
ఈ జిమ్ ప్రత్యేకతలు:
- మీ ఫిట్‌నెస్ గోల్స్‌కు తగినట్లు శిక్షణ ఇచ్చే సర్టిఫైడ్ ట్రైనర్లు
- మీ లైఫ్‌స్టైల్, మీ ఫిట్‌నెస్ గోల్స్‌కు తగినట్లు వ్యక్తిగత డైట్ ప్లాన్ చెప్పేందుకు క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌లు
- పది వేల చదరపు అడుగుల వైశాల్యంలో అన్ని సౌకర్యాలతో కూడిన జిమ్
మెంబర్‌షిప్:
నెలకు రూ. 4,900
ఏడాదికి రూ. 30,000
పల్స్8 ఎలైట్ జిమ్
ఎక్కడ: అబిడ్స్ స్టేషన్ రోడ్ పుల్లారెడ్డి స్వీట్స్ ఎదురుగా, ఇస్కాన్ టెంపుల్ పక్కన
శ్రీనగర్ కాలనీ మెయిన్‌రోడ్‌లోని సత్యసాయి నిగమాగమమ్ ఎదురుగా ఉన్న హెరిటేజ్ సూపర్‌మార్కెట్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్
మెహదీపట్నం మెయిన్‌రోడ్‌లోని పిల్లర్ నంబర్ 5 దగ్గర్లో ఉన్న మెక్‌డొనాల్డ్స్ పక్కన, అజీజియా మసీదు ఎదురుగా
టైమ్: సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు
ఆదివారం ఉదయం 6.30 నుంచి 11.30 వరకు
కాంటాక్ట్ నంబర్స్: 9912525027, 9666690060, 9848567479, 040 6677277, [email protected]
వెబ్‌సైట్: వెబ్ సైట్ చిరునామా
పరికరాలు, ఇతర సదుపాయాలు: రెసిస్టెన్స్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్విప్‌మెంట్, కార్డియో ఎక్విప్‌మెంట్స్, ఎలిప్టికల్ క్రాస్ ట్రైనర్స్, ఎక్సర్‌సైజ్ సైకిల్స్, రోయింగ్ మెషీన్స్, స్పిన్ బైక్స్, డంబెల్స్, బార్‌బెల్స్, బెంచ్ ప్రెస్, హామర్ స్ట్రెంత్ మెషీన్స్, మెడిసిన్ బాల్స్, ఫిట్‌నెస్ క్లాసెస్, క్రాస్‌ఫిట్ ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్
ఈ జిమ్ ప్రత్యేకతలు:
- అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ స్థాయి ఫిట్‌నెస్ ట్రైనింగ్ మాడ్యూల్‌ను అమలు చేస్తారు
- న్యూట్రిషనల్ కౌన్సెలింగ్
- లేడీస్‌కు మాత్రమే ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏరియా
- మంచి అనుభవం ఉన్న ట్రైనర్స్
మెంబర్‌షిప్: ఏడాదికి రూ.11 వేలు
గోల్డ్స్ జిమ్
ఎక్కడ: హిమాయత్‌నగర్‌లోని హైదర్‌గూడ్ మెయిన్‌రోడ్ ప్లాట్ నంబర్ 3-6-289
టైమ్: సోమవారం ఉంచి శనివారం వరకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు
ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు
కాంటాక్ట్ నంబర్స్: 76809 89874, 90000 26767
పరికరాలు, ఇతర సదుపాయాలు: పర్సనల్ ట్రైనింగ్, బార్‌బెల్స్, మెడిసిన్ బాల్స్, కార్డియో ఎక్విప్‌మెంట్, క్రాస్ ఫిట్‌నెస్ ట్రైనింగ్, డంబెల్స్, ట్రెడ్‌మిల్స్, సర్క్యూట్ ట్రైనింగ్, యోగా క్లాసెస్, ఏరోబిక్ క్లాసెస్, వెయిట్ లిఫ్టింగ్, కిక్ బాక్సింగ్ క్లాసెస్, జుంబా క్లాసెస్, స్పిన్ బైక్స్
ఈ జిమ్ ప్రత్యేకతలు:
- ఫ్రీ ట్రయల్‌కు అవకాశం కల్పిస్తోంది
- 30 దేశాల్లో ఈ గోల్డ్స్ జిమ్ ఉంది. దీంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎక్విప్‌మెంట్, ట్రైనింగ్ ఈ జిమ్‌లో ఇస్తారు
- 250 రోజులు వర్కవుట్ చేస్తే వంద శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.
మెంబర్‌షిప్: ఏడాదికి రూ.19600
హౌజ్ ఆఫ్ చాంపియన్స్
ఎక్కడ: బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ ఒమెగా హాస్పిటల్ దగ్గర
టైమ్: ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు
కాంటాక్ట్ నంబర్స్: 99 4969 6946
పరికరాలు, ఇతర సదుపాయాలు: పర్సనల్ ట్రైనింగ్, స్టీమ్ బాత్, యోగా క్లాసెస్, టీఆర్‌ఎక్స్ ట్రైనింగ్, కార్డియో ఎక్విప్‌మెంట్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్విప్‌మెంట్, స్ట్రెచింగ్ ఏరియా, మ్యూజిక్-వీడియో ఎంటర్‌టైన్‌మెంట్, జుంబా క్లాసెస్
ఈ జిమ్ ప్రత్యేకతలు:
- అత్యాధునిక ఎక్విప్‌మెంట్
- ఫ్రీ ట్రయల్
- ప్రొఫెషనల్ ట్రైనర్స్
- ఒక్కొక్కరి ఫిట్‌నెస్ స్థాయి, ఆరోగ్య వివరాలను తెలుసుకొని వాళ్ల లక్ష్యాలకు అనుగుణంగా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ప్లాన్ రూపొందిస్తారు.
మెంబర్‌షిప్: నెలకు 5000, ఏడాదికి 17999
ఎస్‌డీ ఫిట్‌నెస్
ఎక్కడ: సోమాజీగూడలోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ మూడో ఫ్లోర్‌లో
టైమ్: సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5.30 నుంచి రాత్రి 10 గంటల వరకు
ఆదివారం ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
కాంటాక్ట్ నంబర్స్: 04066881920, [email protected]
పరికరాలు, ఇతర సదుపాయాలు: వెయిట్ మేనేజ్‌మెంట్, కార్డియో ఎక్విప్‌మెంట్, ఫిట్‌నెస్ ట్రైనింగ్, క్రాస్ ఫిట్
ఈ జిమ్ ప్రత్యేకతలు:
- సర్టిఫైడ్ ట్రైనర్లు
- అత్యాధునిక ప్రపంచస్థాయి ఎక్విప్‌మెంట్
- ఒక్కొక్కరికి ఒక్కో డైట్, వర్కవుట్ ప్లాన్స్
సోల్ స్పా సెలూన్ అండ్ జిమ్
ఎక్కడ: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఎన్‌బీకే బిల్డింగ్ ఆరో ఫ్లోర్
టైమ్: సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు
కాంటాక్ట్ నంబర్స్: 9347671801 , 9347671805, 9347671809
వెబ్‌సైట్: వెబ్ సైట్ లింక్
పరికరాలు, ఇతర సదుపాయాలు: కార్డియో ఎక్విప్‌మెంట్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్విప్‌మెంట్, స్ట్రెచింగ్ ఏరియా, మ్యూజిక్ అండ్ వీడియో ఎంటర్‌టైన్‌మెంట్, కిక్ బాక్సింగ్, టీఆర్‌ఎక్స్ క్లాసెస్, బూట్ క్యాంప్
ఈ బెస్ట్ జిమ్ ప్రత్యేకతలు:
- ఫ్రీ ట్రయల్ సౌకర్యం
- అత్యాధునిక ఎక్విప్‌మెంట్
- అంతర్జాతీయ స్థాయి అర్హత పొందిన ట్రైనర్స్
- వర్కవుట్ చేసిన తర్వాత కిందే ఉన్న స్పాకి వెళ్లి రిలాక్స్ కావచ్చు
మెంబర్‌షిప్: నెలకు రూ.6500, ఏడాదికి రూ.30000
ఓ2 జిమ్
ఎక్కడ: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 గౌరీశంకర్ నగర్ కాలనీ
టైమ్: సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు
కాంటాక్ట్ నంబర్స్: 7287020202
పరికరాలు, ఇతర సదుపాయాలు: పర్సనల్ ట్రైనింగ్, కార్డియో ఎక్విప్‌మెంట్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్విప్‌మెంట్, న్యూట్రిషనల్ సపోర్ట్, స్ట్రెచింగ్ ఏరియా, వెయిట్ ట్రైనింగ్, క్రాస్‌ఫిట్.
ఈ జిమ్ ప్రత్యేకతలు:
- లాకర్, షవర్ ఫెసిలిటీ
- ఫ్రీ ట్రయల్
- లేడీస్‌కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రత్యేక బ్యాచ్
మెంబర్‌షిప్: నెలకు రూ. 3000, ఏడాదికి రూ. 20000
హయత్ ఫిట్‌నెస్
ఎక్కడ: మోతీనగర్‌లోని రాజీవ్ నగర్ క్రాస్ రోడ్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పైన థర్డ్, ఫోర్త్ ఫ్లోర్
అమీర్‌పేట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎదురుగా ఉన్న ఆదిత్య ట్రేడ్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్
టైమ్: సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు
ఆదివారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
కాంటాక్ట్ నంబర్స్: 9391085955
పరికరాలు, ఇతర సదుపాయాలు: స్టాక్ మల్టీస్టేషన్, చెస్ట్ ప్రెస్, డంబెల్స్, ఫ్లాట్ బెంచ్, ట్రెడ్‌మిల్, స్పిన్ బైక్స్, అప్‌రైట్ సైకిల్, పర్సనల్ ట్రైనింగ్, కార్డియో ఎక్విప్‌మెంట్, స్ట్రెచింగ్ ఏరియా, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్విప్‌మెంట్, టీఆర్‌ఎక్స్ ట్రైనింగ్
ఈ జిమ్ ప్రత్యేకతలు:
- ఫ్రీ ట్రయల్
- లాకర్, షవర్ ఫెసిలిటీ
మెంబర్‌షిప్: నెలకు రూ. 2500, ఏడాదికి రూ. 12000
సిటీలో, మీకు అందుబాటులో ఉన్న బెస్ట్ జిమ్ ఏదో చూశారు కదా.. ఇంకా మీకు నచ్చిన ఇతర జిమ్ ఏదైనా ఉంటే మాకు రాయండి. ఈ కథనంలో అప్ డేట్ చేస్తాం.
ఇవి కూడా చదవండి