క్రికెట్ కోచింగ్ సెంటర్లు ఎక్కడ బాగున్నాయి?

cricket coaching
Image by PDPics from Pixabay

ర్బన్‌ ఏరియాల్లో చదువుతోపాటు స్పోర్ట్స్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. స్పోర్ట్స్‌నే కెరీర్‌గా ఎంచుకుంటున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో సహజంగానే స్పోర్ట్స్‌ కోచింగ్‌ సెంటర్లకు ఫుల్ డిమాండ్‌ ఏర్పడింది. ముఖ్యంగా క్రికెట్ కోచింగ్ సెంటర్లు నిత్యం సందడిగా ఉంటున్నాయి.

స్కూల్స్‌లోనూ క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా వాటికి టైమ్‌ కేటాయిస్తున్నా పేరెంట్స్‌ మాత్రం తమ పిల్లలకు ఫుల్‌టైమ్‌ కోచింగ్‌ ఇప్పించడానికే ఇష్టపడుతున్నారు. మన దేశంలో క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌లాంటి ఔట్‌డోర్‌ గేమ్స్‌ను పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఇండోర్‌ గేమ్స్‌లో అయితే చెస్‌ను కెరీర్‌గా మలుచుకుంటున్నారు. మన హైదరాబాద్‌ అయితే క్రికెట్‌తోపాటు బ్యాడ్మింటన్‌, చెస్‌లకు హబ్‌గా మారిపోయింది. మన భాగ్యనగరం నుంచి ఎంతో మంది స్టార్‌ ప్లేయర్స్‌ అంతర్జాతీయ స్థాయిలో రాణించారు.. ఇప్పటికీ రాణిస్తున్నారు.

ఇండియాలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్‌ క్రికెటర్లకు ఉంటోంది. వాళ్లు అనుభవిస్తున్న స్టార్‌ స్టేటస్‌ చూసి చాలా మంది క్రికెట్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. అందులోనూ హైదరాబాద్‌ కూడా ఎంతో మంది స్టార్‌ ప్లేయర్స్‌ను నేషనల్‌ టీమ్‌కు అందించింది. ఒకప్పటి ఎంఎల్‌ జయసింహ నుంచి మొదలుపెడితే అర్షద్‌ ఆయూబ్‌, శివ్‌లాల్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అంబటి రాయుడు, వెంకటపతి రాజులాంటి ప్లేయర్స్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. సహజంగానే వీళ్ల నుంచి స్ఫూర్తి పొందిన ఎంతోమంది చిన్నారులు.. క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ క్రికెట్ కోచింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? ఆ వివరాలతో డియర్ అర్బన్ డాట్ కామ్ మీకు ప్రత్యేక కథనం అందిస్తోంది.

సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీ

వీవీఎస్‌ లక్ష్మణ్‌లాంటి స్టార్‌ బ్యాట్స్‌మన్‌ను ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు అందించిన అకాడమీ ఇది. దీనిని 1987లో మాజీ క్రికెటర్‌ ఎంవీ నరసింహారావు, జాన్‌ మనోజ్‌ కలిసి ఏర్పాటు చేశారు. లక్ష్మణ్‌తోపాటు ఇప్పుడు టెస్ట్‌ టీమ్‌లో ఉన్న హనుమ విహారి, చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌, నోయల్‌ డేవిడ్‌, తరుణ్‌ నేథులాలాంటి ఇంటర్నేషనల్‌ క్రికెటర్లు ఈ అకాడమీలో క్రికెట్‌ పాఠాలు నేర్చుకున్నవాళ్లే. వీళ్లే కాకుండా మరెంతో మంది రంజీ స్థాయి క్రికెటర్లు కూడా ఈ సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీ నుంచి వచ్చారు. హైదరాబాద్‌లోనే ఇది బెస్ట్‌ క్రికెట్‌ అకాడమీ అని చెప్పొచ్చు.

ఈస్ట్‌ మారేడుపల్లిలో ఈ అకాడమీ ఉంది. 04027822191 నంబర్‌కు ఫోన్‌ చేసి కాంటాక్ట్‌ అవచ్చు.  ఈ క్రికెట్‌ అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌ www.stjohnscricketacademy.com ఇక  admin@stjohnscricketacademy.com అడ్రెస్‌కు మెయిల్‌ చేయొచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడైనా కాంటాక్ట్‌ అవచ్చు. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా క్రికెట్‌ కోసమే ఏర్పాటు చేసిన అకాడమీ. ఇక్కడ ఏ ఇతర స్పోర్ట్స్‌కు కోచింగ్‌ ఇవ్వరు.

స్పోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌

దేశంలోని ప్రముఖ స్పోర్ట్స్‌ ఎన్జీవోల్లో ఇదీ ఒకటి. ఇక్కడ క్రికెట్‌తోపాటు ఇతర స్పోర్ట్స్‌ కోచింగ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. క్రికెట్‌ కోచింగ్‌ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇది అందరికీ సాధ్యం కాదు. అంత ఖర్చు పెట్టలేని వాళ్లు ఈ స్పోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌కు వెళ్లొచ్చు. మాజీ రంజీ క్రికెటర్‌ సాయిబాబా దీనిని 1991లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎన్నో వందల మంది ప్లేయర్స్‌ ఇక్కడి శిక్షణలో రాటుదేలారు.

ఇక్కడ ప్రధానంగా మూడు ఏజ్‌ గ్రూప్‌ల వారికి కోచింగ్‌ ఇస్తారు. ఆరు నుంచి పదేళ్లు, పది నుంచి పన్నెండేళ్లు, పన్నెండు నుంచి పదహారేళ్ల వయసున్న వాళ్లకు వేరు వేరుగా కోచింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. బుధవారం నుంచి ఆదివారం వరకు అంటే వారంలో ఐదు రోజులు ఇక్కడ కోచింగ్‌ ఇస్తారు.

హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్క్‌ ఎదురుగా ఈ స్పోర్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌ ఉంది. మరిన్ని వివరాల కోసం 9396559440 నంబర్‌కు కాల్‌ చేయొచ్చు. ఈ ఫౌండేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ http://www.scfindia.org/ ఒకవేళ మెయిల్‌ చేయాలనుకుంటే.. [email protected][email protected] ఐడీలకు చేయొచ్చు. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌, కబడ్డీ, టెన్నిస్‌, బాక్సింగ్‌, కరాటె, వాలీబాల్‌లాంటి స్పోర్ట్స్‌లో శిక్షణ ఇస్తారు.

జుబి క్రికెట్‌ అకాడమీ

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో ఉన్న ఈ అకాడమీ కూడా క్రికెట్‌ కోచింగ్‌కు ఫేమస్‌. జర్నలిస్ట్‌ బకర్‌ మేరాజ్‌ 2011లో దీనిని ప్రారంభించారు. 35 ఏళ్ల అనుభవం ఉన్న ఐసీసీ సర్టిఫైడ్ క్రికెట్‌ కోచ్‌ సయ్యద్‌ జాఫర్‌ అబ్బాస్‌ ఇక్కడ హెడ్‌ కోచ్‌గా ఉన్నారు. ఈ అకాడమీ ప్రతి ఏడాది సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తుంది. బ్రోసిడ్‌ ఇంటర్నేషన్‌ అకాడమీతోపాటు మాజీ ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌కు చెందిన అలన్‌ ములాలీ ఫాస్ట్‌ బౌలింగ్‌ అకాడమీతో కలిసి గత జూన్‌ నెలలో ఏడు రోజుల పాటు ఇండియాస్‌ మాస్టర్‌ క్లాస్‌ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.

ఉదయం ఆరు నుంచి 8.30 వరకు, సాయంత్రం 5 నుంచి 6.30 వరకు ఇక్కడ క్రికెట్‌ కోచింగ్‌ ఇస్తారు. అంబర్‌పేట్‌లోని అలీకేఫ్‌ రోడ్‌, ఆజాద్‌నగర్‌లో ఈ అకాడమీ ఉంది. మరిన్ని వివరాల కోసం 9885942667 లేదా 9000207785 నంబర్లను సంప్రదించవచ్చు. [email protected] అడ్రెస్‌కు మెయిల్‌ చేయొచ్చు. జుబి క్రికెట్‌ అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌ http://zubicricketacademy.com/

వీవీఎస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ

పేరును చూస్తేనే మీకు ఇది వీవీఎస్‌ లక్ష్మణ్‌కు చెందిన అకాడమీ అని తెలిసిపోయి ఉంటుంది. క్రికెట్‌ నుంచి రిటైరైన తర్వాత అతను ఈ అకాడమీ ఏర్పాటు చేశాడు. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటైన అకాడమీ ఇది. నాణ్యమైన శిక్షణ అందించాలన్న ఉద్దేశంతో మంచి మంచి కోచ్‌లను ఇక్కడ నియమించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 2లో లుంబిని జువెల్‌ మాల్‌ వెనుకాల ఈ అకాడమీ ఉంది. మరిన్ని వివరాల కోసం  080969 78889 నంబర్‌కు కాల్‌ చేయండి లేదా [email protected] అడ్రెస్‌కు మెయిల్‌ చేయండి.

అర్షద్‌ ఆయూబ్‌ క్రికెట్‌ అకాడమీ

టీమిండియా మాజీ స్పిన్నర్‌ అర్షద్‌ ఆయూబ్‌ ఏర్పాటు చేసిన అకాడమీ ఇది. ఆయూబ్‌ 1987 నుంచి 1990 మధ్య ఇండియన్‌ టీమ్‌ తరఫున 13 టెస్టులు, 32 వన్డేలు ఆడారు. 1998లో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. అండర్‌ 14 నుంచి రంజీ ట్రోఫీ వరకు ఎంతో మంది ప్లేయర్స్‌ను ఈ అకాడమీ అందించింది. 2013లో ఈ అకాడమీకి చెందిన 20 మంది ప్లేయర్స్‌ వివిధ కేటగిరీల్లో హైదరాబాద్‌ స్టేట్‌ టీమ్స్‌కు ప్రాతినిధ్యం వహించారు.

అర్షద్‌ ఆయూబ్‌ స్వయంగా ఇక్కడ కోచింగ్‌ ఇస్తారు. ఈయన గతంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగానూ పని చేశారు. అర్ష్దద్‌ ఆయూబ్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిజికల్‌ ట్రైనింగ్‌తోపాటు టర్ఫ్‌ వికెట్‌, ఆస్ట్రో టర్ఫ్‌ వికెట్‌, ప్రాక్టీస్‌ నెట్స్‌, బౌలింగ్‌ మెషీన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

8 ఏళ్లు పైబడిన పిల్లలకు ఇక్కడ కోచింగ్‌ ఇస్తారు. 9912218228 నంబర్‌కు ఫోన్‌ చేస్తే అకాడమీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ అకాడమీ మాసబ్‌ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్‌లో ఉంది.

జయసింహ క్రికెట్‌ అకాడమీ

టీమిండియా మాజీ క్రికెటర్‌, దివంగత ఎంఎల్‌ జయసింహ కుటుంబ సభ్యులు 2008లో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. మిగతా అకాడమీలతో పోలిస్తే.. దీనికో ప్రత్యేకత ఉంది. ఇక్కడ 8 వేల చదరపు అడుగుల ఇండోర్‌ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. దీంతో ఏ సమయంలో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా ఇక్కడ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు.

ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు ఇక్కడి ఇండోర్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. ఈ ఇండోర్‌ స్టేడియంలో ఒక నెట్‌ వాడుకోవాలంటే గంటకు ఐదుగురికి రూ. 700 వరకు వసూలు చేస్తారు. ఇక ఉదయం 6.15 నుంచి 8.30 వరకు సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు క్రికెట్‌ కోచింగ్‌ ఇస్తారు. సికింద్రాబాద్‌ సిక్‌ రోడ్‌లోని బాంటియా ఎస్టేట్‌లో ఈ క్రికెట్‌ అకాడమీ ఉంది. మరిన్ని వివరాల కోసం 9346389015, 04032964973 నంబర్లకు కాల్‌ చేయొచ్చు. 

క్రికెట్ కోచింగ్ సెంటర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నారు కదా.. నచ్చితే షేర్ చేయగలరు.

ఇవి కూడా చదవండి

♦ స్టోర్ట్స్ కోచింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి?

♦ క్రికెట్ లో స్మార్ట్ బాల్ అంటే ఏంటి?

 

Previous articleఇండియాలో బెస్ట్‌ జాబ్ వెబ్‌సైట్స్ ఇవే..
Next articleహైదరాబాద్‌లో బెస్ట్‌ స్పోర్ట్స్ కోచింగ్‌ సెంటర్లు ఇవిగో