ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 4 లక్షలకు చేరువైంది. ఈ కథనం రాసే సమయానికి మొత్తం 216 దేశాల్లో 3,99,895 మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి విపత్తు ఇంకా ఎన్ని నెలలు ఉంటుందో ఇప్పటికీ కచ్చితమైన అంచనాలు లేవు.
ప్రపంపచవ్యాప్తంగా ఇప్పటివరకు 68,81,352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్యలో, మరణాల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికానే తొలి స్థానంలో ఉంది.
కేసుల సంఖ్యలో నాలుగో స్థానంలో ఉన్న యూకే.. మర ణాల సంఖ్యలో మాత్రం రెండోస్థానంలో ఉంది. కేసుల సంఖ్యలో ఐదో స్థానంలో ఉన్న ఇండియా మరణాల సంఖ్యలో మాత్రం 12వ స్థానంలో ఉంది. అంటే కేసులు ఉన్నప్పటికీ మరణాలు మిగిలిన దేశాలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉండడం ఊరటనిచ్చే అంశం.
పది వేలకు పైగా మరణాలు సంభవించిన దేశాలు మొత్తం ఏడు ఉన్నాయి. అమెరికా, యూకే, బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికో దేశాలు ఉన్నాయి.
కాగా గడిచిన వారం రోజుల్లో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో తొలి స్థానంలో బ్రెజిల్, రెండోస్థానంలో అమెరికా ఉండగా.. ఆ తరువాతి స్థానాల్లో మెక్సికో, యూకే, ఇండియా, రష్యన్ ఫెడరేషన్, పెరూ, కెనడా, చిలీ, పాకిస్తాన్, ఇటలీ, ఇరాన్ నిలిచాయి.
కేసుల్లో టాప్–12 దేశాలు
క్రమ సంఖ్య దేశం కేసుల సంఖ్య
- అమెరికా 18,86,794
- బ్రెజిల్ 6,45,771
- రష్యన్ ఫెడరేషన్ 4,67,673
- యునైటెడ్ కింగ్డమ్ 2,84,872
- ఇండియా 2,46,628
- స్పెయిన్ 2,41,310
- ఇటలీ 2,34,801
- పెరూ 1,87,400
- జర్మనీ 1,83,979
- ఇరాన్ 1,69,425
- టర్కీ 1,69,218
- ఫ్రాన్స్ 1,50,022
కరోనా మరణాల సంఖ్య లో టాప్–12 దేశాలు
క్రమ సంఖ్య దేశం మరణాలు
- అమెరికా 1,09,038
- యునైటెడ్ కింగ్డమ్ 40,465
- బ్రెజిల్ 35,026
- ఇటలీ 33,846
- ఫ్రాన్స్ 29,084
- స్పెయిన్ 27,135
- మెక్సికో 13,170
- బెల్జియం 9,580
- జర్మనీ 8,668
- ఇరాన్ 8,209
- కెనడా 7,703
- ఇండియా 6,929