Masturbation Tips for women: స్త్రీలు హస్త ప్రయోగ సమయంలో పాటించాల్సిన చిట్కాలివే..

fruit
మహిళలు హస్త ప్రయోగం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి PC Pexels
Masturbation Tips for women: మితంగా హస్తప్రయోగం చేయడం వల్ల అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. భద్రత, పరిశుభ్రత విషయాల్లో ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
హస్తప్రయోగం అనేది లైంగిక ఆనందం కోసం తమ శరీరాలను తాకే ఓ చర్య. ఈ అనుభవం ఒక్కో వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. పురుషులు అయితే హస్తప్రయోగం చేయడానికి పురుషాంగాన్ని రుద్దడం లేదా స్ట్రోక్ చేస్తారు. ఇది మహిళల్లో భిన్నంగా ఉంటుంది. కొందరికి యోనిని తాకితే లేదా రుద్దితే లేదా క్లిటోరిస్‌ను రుద్దితే లైంగిక ఆనందం కలుగవచ్చు. మరికొందరికి యోనిలోకి చొచ్చుకుపోయేలా సెక్స్ టాయ్స్ వినియోగించడం వల్ల అనుభూతిని పొందవచ్చు. 
 
స్వీయ ఆనందం కోసం తమ లైంగిక అవయవాలను లైంగింకంగా ప్రేరేపించే హస్తప్రయోగం ఓ సురక్షితమైన పద్ధతి అంటున్నారు లీజా మంగళదాస్. అయితే మీ ఆనందాన్ని మెరుగుపరచడానికి పరిశుభ్రత, సురక్షితమైన పద్ధతులు పాటించాలి అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రక్రియలో అతిగా పాల్గొనడం లేదా పరిశుభ్రత లేని చిట్కాలు పాటిస్తే అవి మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటున్నారు. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీరు ఆరోగ్యకరమైన హస్త ప్రయోగ అనుభవాన్ని పొందవచ్చు అంటున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. చేతులు శుభ్రంగా ఉండాలి..

హస్తప్రయోగం చేతులతో చేసే ప్రక్రియ కాబట్టి. దానిపై ఉన్న బ్యాక్టిరీయా, వైరస్, దుమ్ము, ధూళిని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యోనిలోకి హానికరమైన బ్యాక్టీరియా, జెర్మ్స్ ప్రవేశించవు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ ప్రమాదముండదు. అలాగే హస్త ప్రయోగం తర్వాత కూడా మీ చేతులను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. 

2. గోర్లు కూడా..

చాలామందికి చేతులు, వేళ్లు హస్తప్రయోగానికి సాధారణ సాధనాలు. కాబట్టి చేతులు కడుక్కోవడం మాత్రమే కాదు.. మీ గోళ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పొడవైన, అందమైన గోళ్లు మీకు మంచి లుక్ ఇస్తాయి. కానీ వాటిలో బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోళ్లు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. గోళ్లు లేకపోతే ఇంకా మంచిది. ఎందుకంటే యోని ప్రాంతం చాలా సున్నితంగా ఉంటుంది. హస్త ప్రయోగం సమయంలో యోనిలో గాట్లు పడే అవకాశముంది. 

3. సెక్స్ టాయ్స్

మీరు హస్తప్రయోగానికి కొత్తవారైతే.. మీ వేళ్లతో ఈ చర్యను ప్రారంభించి.. అదనపు ఆనందం కోసం సెక్స్ టాయ్స్ వినియోగించవచ్చు. అయితే సరైన సెక్స్ బొమ్మను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వాటి గురించి కాస్త సమయం వెచ్చించి.. ఏది సరైనదో తెలుసుకుని దానిని వినియోగించండి. కుదిరితే మీ గైనకాలజిస్ట్ సలహా తీసుకోండి. 
 
అయితే సెక్స్ టాయ్స్ రబ్బరుతో ఎక్కువగా తయారు చేస్తారు. కాబట్టి వీటిపై దుమ్ము, ధూళి సులభంగా చేరుకుపోయే ప్రమాదముంది. కాబట్టి అంటువ్యాధులు, బ్యాక్టిరీయాను నిర్మూలించడానికి వాటిని పూర్తిగా శుభ్రం చేయండి. మీరు వినియోగించిన తర్వాత కూడా మీరు శుభ్రం చేసుకోవాలి. అయితే హస్త ప్రయోగ సమయంలో మీరు పండ్లు, కూరగాయలు వినియోగించకపోవడమే మంచిది.

4. లూబ్రికెంట్స్

వివిధ లూబ్రికెంట్స్ వినియోగించడం వల్ల యోని లైనింగ్కు హాని కలగవచ్చు. ఎస్టీఐలు సంక్రమించే ప్రమాదం ఉంది. అదనంగా ఉండే కెమికల్స్ అలెర్జీని కలిగిస్తాయి. కాబట్టి ఎంచుకునేటప్పుడు సరైనవి ఎంచుకోవాలి. కొబ్బరి నూనెను సురక్షితమైన లూబ్రికెంట్‌గా చెప్తారు. 

5. విశ్రాంతి తప్పనిసరి..

మీరు ఆరోగ్యకరమైన హస్త ప్రయోగం కావాలనుకుంటే మీ మానసిక స్థితి సరిగ్గా ఉండాలి. లోతైన, నెమ్మదిగా శ్వాస తీసుకునే విశ్రాంతి పద్ధతులు మీ మానసిక ఆనందాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళ తగ్గించి.. ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించేలా చేస్తాయి. కాబట్టి ఈ ప్రక్రియ చేసే ముందు కాస్త ప్రశాంతంగా ఉండేందుకు పనుల నుంచి విశ్రాంతి తీసుకోండి. 

6. మూత్ర విసర్జన

శృంగారంలో పాల్గొన్న తర్వాత మూత్ర విసర్జన చేయడం ఎంత ముఖ్యమో.. హస్త ప్రయోగం తర్వాత కూడా మూత్ర విసర్జన చేయడం అంతే ముఖ్యం. ఇది బాక్టీరియా, జెర్మ్స్ మూత్రాశయంలోకి ప్రవేశించకుండా యోని నుంచి బయటకువచ్చేస్తాయి. తద్వార మీరు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు. ఈ పద్ధతులను పాటిస్తే మీరు కచ్చితంగా ఆరోగ్యకరమైన హస్తప్రయోగ ఫలితాలను పొందుతారు.
Previous articleHugging Benefits: నచ్చినవారిని హగ్ చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Next articleWeight Loss Drinks: ఉదయాన్నే వీటిని తాగితే ఇట్టే బరువు తగ్గుతారు..