Weight Loss Drinks: ఉదయాన్నే వీటిని తాగితే ఇట్టే బరువు తగ్గుతారు..

weight loss drinks
బరువు తగ్గడానికి ఉదయం తాగాల్సిన పానీయాలు
Weight Loss Drinks: ఉదయం తీసుకునే కొన్ని పానీయాలు మీరు బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయని మీకు తెలుసా? బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్త వహించాలి. 
 
నిజమేనండి ఉదయాన్నే పరగడుపున కొన్నిపానీయాలు తీసుకుంటే మీరు ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గుతారు అంటున్నారు. ఉదయాన్నే మీ రోజును చురుకుగా ప్రారంభించేందుకు, ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కొన్నిపానీయాలు సేవించాలి అంటున్నారు. వీటిని మీరు చాలా తేలికగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లో మనం నిత్యం వినియోగించే కొన్ని పదార్థాలతో ఈ పానీయాలు తయారు చేసుకోవచ్చు. ఇంతకీ బరువు తగ్గించే, ఇంట్లోనే తయారు చేసుకోగలిగే పానీయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రోటీన్ స్మూతీ

బరువు తగ్గడంలో ప్రోటీన్ కీలకంగా వ్యవహరిస్తుంది. మీ ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు ఇది మీ శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకంగా చెప్పవచ్చు. ఇది మీ ఆకలిని నియంత్రిస్తుంది. కొందరు తెలియకుండానే ఎక్కువగా తినేసి బరువు పెరుగుతారు. అతిగా తినడానికి బ్రేక్ వేయాలనుకుంటే ఉదయాన్నే మీరు ప్రోటీన్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఉదయాన్నే ప్రోటీన్ స్మూతీ తీసుకోవడం హెల్తీ ఎంపిక. ఇది రుచికరమైన ప్రోటీన్ ప్యాక్ అని చెప్పవచ్చు. దీనిలో మీరు నట్స్ కూడా వేసి తీసుకోవచ్చు. ఇది మిమ్మల్ని రోజంతా నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వార మీరు అనారోగ్యకరమైన చిరుతిండి వైపు వెళ్లకుండా మిమ్మల్ని కాపాడుతుంది. 

నిమ్మరసం

బరువు తగ్గడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన పానీయాలలో గోరువెచ్చని నిమ్మ నీరు ఒకటి. గోరువెచ్చని నీటిలో తాజా నిమ్మరసాన్ని కలిపి ఈ పానీయం తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మీకు మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. గోరువెచ్చని నీరు.. మీ శరీరంలోని టాక్సిక్ పదార్థాలను బయటకు పంపిస్తాయి. ఈ ప్రక్రియ మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. 

యాపిల్ సైడర్ వెనిగర్

ఈ మధ్యకాలంలో యాపిల్ సైడర్ వెనిగర్ ప్రాముఖ్యతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం తమ డైట్లో తీసుకుంటున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి.. ఆహార కోరికలను తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. 
 
ఉదయాన్నే దీనిని సేవించాలనుకునేవారు ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని గ్లాస్ నీటిలో కలపండి. రుచికోసం మీరు తేనే కలిపి తాగవచ్చు. నేరుగా యాపిల్ సైడర్ వెనిగర్ ఎప్పుడూ తీసుకోకూడదు. దానిని కాస్త డైల్యూట్ చేసితాగాలి. లేదంగా దీనిలోని ఆమ్లాలు మీ దంతాలు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా.. లిమిటెడ్గా మీరు దీనిని సేవించి బరువు తగ్గవచ్చు. 

గోల్డెన్ మిల్క్

పసుపులోని సంభావ్య శోథ నిరోధక లక్షణాలు మీరు బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. పసుపు, దాల్చిన చెక్కపొడి, పాలు, అల్లంతో ఈ గోల్డెన్ మిల్క్ తయారు చేసుకోవచ్చు. పసుపు మీ శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఊబకాయంతో ఇబ్బందిపడేవారికి మెరుగైన జీర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. తద్వార మీరు బరువు తగ్గుతారు. అంతేకాకుండా మీరు రోజంతా చురుగ్గా ఉండడంలో ఈ గోల్డెన్ మిల్క్ మీకు శక్తిని అందిస్తుంది.

కలబంద జ్యూస్

కలబంద రసాన్ని మనం చర్మ సమస్యలు దూరం చేసుకోవడానికి ఎక్కువగా వినియోగిస్తాము. అయితే దీనిని పరగడుపునే తీసుకుంటే మీరు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతూ బరువు తగ్గవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఇది కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి మీరు దీనిని స్మూతీలతో కలిపి లేదా తేనేతో కలిపి సేవించవచ్చు. 

గ్రీన్ టీ

బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా తమ డైట్లో గ్రీన్ టీ తీసుకుంటారు. ఇది ఆరోగ్యప్రయోజనాలు అందిస్తూ.. బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీనిలోని సహజ యాంటీ ఆక్సిడెంట్లు మెరుగైన జీవక్రియను అందిస్తాయి. కొవ్వును కరిగించి టాక్సిక్ పదార్థాలను బయటకు పంపిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి గ్రీన్ టీ మంచి ఎంపిక.
Previous articleMasturbation Tips for women: స్త్రీలు హస్త ప్రయోగ సమయంలో పాటించాల్సిన చిట్కాలివే..
Next articleTooth Ache Home Remedies: పంటినొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే..