Yoga Poses for Back Pain and Sleep: వెన్నునొప్పి తగ్గడానికి మంచి నిద్రకు 3 సింపుల్ యోగా ఆసనాలు

child pose
వెన్నునొప్పికి, చక్కటి నిద్రకు బాలాసనం (Pixabay
Yoga Poses for Back Pain and Sleep: నడుము నొప్పికి, మంచి నిద్రకు ప్రత్యేకంగా యోగాసనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ రోజుల్లో చాలా మందికి వచ్చే కామన్ సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరిలోనూ ఉంటుంది. ఈ సమస్యను పట్టించుకోకపోతే నొప్పి తీవ్రమయ్యే అవకాశముంది. కాబట్టి మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వాటితో పాటు కొన్ని స్ట్రెచ్ వ్యాయామలు చేస్తూ సమస్యను తగ్గించుకోవచ్చు.
 
రోజూవారీ పనులవల్లనో.. లేక పడుకునే బెడ్ సరిగ్గా లేకనో.. కంప్యూటర్ ముందు పని చేస్తున్నప్పుడు సరైన సిట్టింగ్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్లనో చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. వెన్నునొప్పి మీకు అలసటనిచ్చి.. నిద్రకు భంగం కలిగిస్తుంది. అయితే మీకు నడుము నొప్పిని తగ్గించి.. మంచి నిద్రను అందించే కొన్ని యోగా ఆసనాలు ఇక్కడున్నాయి. ఇవి కేవలం మీకు వెన్నునొప్పిని తగ్గించడమే కాకుండా మీ అలసటను తగ్గించి ప్రశాంతతనిస్తాయి. పైగా వీటిని రాత్రి సమయంలో చేయడం వల్ల ఇది మీకు మంచి నిద్రను అందిస్తుంద. నిద్ర సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా ఈ ఆసనాలు ఫాలో అవ్వొచ్చు. ఇంతకీ ఆ ఆసనాలు ఏమిటో.. వాటి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

బాలాసనం

బాలాసనం మీ వెనుక వీపు, భుజాలపై ఒత్తిడిని తగ్గించే సున్నితమైన యోగా ఆసనం. దీనిని చేయడం కూడా చాలా తేలిక. ముందుగా నేలపై మోకరిళ్లండి. అనంతరం మీ మడమల మీద కూర్చుని.. మీ చేతులను ముందుకు చాపుతూ వంగి నేలకు మీ శరీరాన్ని తాకేలా స్ట్రెచ్ చేయండి. 
 
మీ నుదిటిని నేలపై ఉంచి మీ చేతులను మీకు వీలైనంత చాచండి. అనంతరం నెమ్మదిగా డీప్ బ్రీత్ తీసుకోండి. మీ వీపు, భుజాలు స్ట్రైచ్ అయ్యేలా శ్రద్ధ చూపండి. ఇది మీ నడుము దగ్గర కండరాలను సాగదీస్తుంది. అదనంగా మీకు నడుముపై ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందిస్తుంది. తద్వార మీకు మంచి నిద్ర కూడా వస్తుంది. 

మార్జర్యాసనం

దీనినే పిల్లి భంగిమ కూడా అంటారు. ఇది మీ నడుమును నొప్పిని సరి చేయడంలో మంచిపాత్ర పోషిస్తుంది. రెగ్యూలర్గా ఈ ఆసనం చేస్తూ ఉంటే వెన్నునొప్పి తగ్గడంలో అద్భుత ఫలితాలు చూపిస్తుంది. మీ మోకాళ్లపై ఉండి.. మీ అరచేతులు మాత్రమే నేలకు తాకేలా ముందుకు వంచండి. 
 
ఇప్పుడు డీప్ బ్రీత్ తీసుకుంటూ.. మీ నడుమును ఆవు వలె పైకి ఎత్తండి. అనంతరం గాలిని వదులుతూ నడుమును లోపలికి వంచండి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయాలి. ఈ ఆసనం మీ వెన్నుముకపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా మీకు ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. 

మోకాలిని ఛాతికి తాకించండి

మోకాళ్లను ఛాతికి తాకించడం వల్ల వెన్నునొప్పి తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా మీ రోజువారీ పనిలో బాగా అలసిపోతే ఇది మీకు అలసటను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ స్ట్రెచ్ చేయడం కోసం ముందుగా నార్మల్‌గా మీరు ఎలా పడుకుంటారో అలా పడుకోండి. 
 
మీ కుడి మోకాలిని వంచి దానిని మీ ఛాతి వైపునకు తీసుకురండి. మీ చేతులతో దానిని పట్టుకుని.. డీప్ బ్రీత్ తీసుకుంటూ 15 నుంచి 30 సెకన్లు అలాగే ఉండండి. అనంతరం ఎడమ కాలితో రిపీట్ చేయండి. ఇది మీ కండరాలను సున్నితంగా స్ట్రెచ్ చేస్తుంది. ఇది మీకు  ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది.
Previous articleSide Effects of Shapewear: అమ్మాయిలూ.. షేప్‌వేర్ ధరిస్తున్నారా.. అయితే మీ యోని జాగ్రత్త
Next articlePeriods Tablet: పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఇది మీకోసమే..