High Uric Acid Problems: అధికస్థాయిలో యూరిక్ యాసిడ్ ఉంటే వైద్య పరిభాషలో హైపర్యూరిసెమియా అని పిలుస్తారు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అత్యంత సాధారణ అనారోగ్య పరిస్థితి అయిన గౌట్‌కు దారితీస్తుంది. అధికస్థాయిలో యూరిక్ యాసిడ్ ఉంటే అనారోగ్య సమస్యలు ఇక్కడ తెలుసుకోండి.
గౌట్
గౌట్ అనేది కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పేరుకుపోయినప్పుడు సంభవించే ఆర్థరైటిస్ రూపం. ఇది ఆకస్మికంగా తీవ్రమైన కీళ్ల నొప్పులు, వాపు మంటకు దారితీస్తుంది. గౌట్ అటాక్ తరచుగా బొటనవేళ్లపై ప్రభావం చూపుతాయి. అలాగే చీలమండలు, మోకాలు, మణికట్టు, వేళ్లు వంటి ఇతర కీళ్లను కూడా ప్రభావితం చేయవచ్చు.
కిడ్నీ స్టోన్స్
అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు మూత్రపిండాలలో యూరేట్ స్ఫటికాలు ఏర్పడటానికి కారణమవుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్ల వృద్ధికి దారితీస్తుంది. ఈ రాళ్ళు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీటిని తొలగించడానికి చికిత్స అవసరం అవుతుంది. శస్త్ర చికిత్స కూడా అవసరం కావొచ్చు.
క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD)
హైపర్యూరిసెమియా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. కాలక్రమేణా వాటి వడపోత సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)
కొన్ని అధ్యయనాలు అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు, అధిక రక్తపోటు ప్రమాదానికి మధ్య సంబంధాన్ని సూచించాయి. అయితే, వీటి మధ్య ఖచ్చితమైన సంబంధం ఇంకా విచారణలో ఉంది.
కార్డియోవాస్కులర్ డిసీజ్
అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే ఇందుకు దారితీసిన పరిస్తితులపై ఇంకా పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉంది.
మెటబాలిక్ సిండ్రోమ్
అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు తరచుగా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులలో కనిపిస్తాయి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే పరిస్థితుల సమూహం. మెటబాలిక్ సిండ్రోమ్‌లో అధిక రక్తపోటు, ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటాయి.
జాయింట్ డ్యామేజ్
గౌట్ వల్ల కలిగే దీర్ఘకాలిక మంట, కాలక్రమేణా చికిత్స చేయకుండా వదిలేస్తే కీళ్ల నష్టం, వైకల్యాలకు దారితీస్తుంది.
అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య సమస్యలను గమనించడం ముఖ్యం. డైట్, ఆల్కహాల్ వినియోగం, శారీరక శ్రమ వంటి జీవనశైలి కారకాలు, అలాగే జన్యువులు, హైపర్యూరిసెమియాకు సంబంధించిన సమస్యలకు ఎవరు ఎక్కువ ముప్పు ఉన్నారో నిర్ణయించడంలో పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఆయా పరిస్థితులను బట్టి మీరు వ్యవహరించాల్సి ఉంటుంది.