ప్రెగ్నెన్సీలో ఎదురయ్యే సాధారణ సమస్యల్లో మార్నింగ్ సిక్‌నెస్ (వాంతులు, వికారం), బ్యాక్ పెయిన్, తిమ్మిర్లు, గుండెల్లో మంట వంటివి కొన్ని. వాస్తవానికి ప్రెగ్నెన్సీ ఒక అపురూపమైన జర్నీ. ఉత్సాహం, నిరీక్షణ, ఆనందంతో నిండిన అద్భుతమైన ప్రయాణం. కానీ దీనిలో సవాళ్లు కూడా ఉంటాయి. మార్నింగ్ సిక్ నెస్ నుండి వెన్నునొప్పి వరకు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే భయపడకండి. ఈ సాధారణ గర్భధారణ చిక్కులను ఎదుర్కోవడంలో మీకు సహాయపడటానికి డియర్ అర్బన్ కొన్ని ఆచరణాత్మక చిట్కాలు, నివారణలను సూచిస్తోంది.
ప్రెగ్నెన్సీలో వాంతులు, వికారం:
- తక్కువగా, తరచుగా భోజనం చేయాలి: మూడుసార్లు సాధారణ పరిమాణంలో భోజనం చేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు భోజనం చేయండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, వాంతులు, వికారాల తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.
- అల్లం: వికారాన్ని నిరోధించడంలో అల్లం ఒక సహజ నివారణగా పనికొస్తుంది. వికారం తగ్గించడానికి అల్లం టీ, అల్లం క్యాండీలు లేదా అల్లం మొరబ్బ, అల్లం క్యాప్సూల్స్ ప్రయత్నించండి.
- హైడ్రేటెడ్ గా ఉండండి: డీహైడ్రేషన్ వల్ల మార్నింగ్ సిక్‌నెస్ మరింత తీవ్రమవుతుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజంతా నీరు లేదా స్పష్టమైన ద్రవాలను సిప్ చేస్తూ ఉండండి.
గర్భధారణలో వెన్నునొప్పి:
- సరైన భంగిమ: ప్రెగ్నెన్సీలో మీ భంగిమపై శ్రద్ధ వహించండి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కుషన్ లేదా లంబార్ సపోర్ట్‌ని ఉపయోగించండి. ఎక్కువ సేపు ఒకే భంగిమలో నిలబడటం లేదా కూర్చోవడం మానుకోండి.
- ప్రినేటల్ యోగా: ప్రినేటల్ యోగా క్లాస్‌లో చేరేందుకు అవకాశం ఉంటే చూడండి. యోగా మీ స్ట్రెంగ్త్‌ను మెరుగుపరచడానికి పనికొస్తుంది. మీ వీపును బలోపేతం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
- సపోర్టివ్ షూస్: మంచి ఆర్చ్ సపోర్ట్‌తో సౌకర్యవంతమైన, సపోర్టివ్ షూస్ కొనుగోలు చేయండి. ఇది మీ బరువును మరింత సమానంగా పంపిణీ చేయడంలో, వెన్ను ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
కాలు తిమ్మిర్లు:
- స్ట్రెచింగ్: సున్నితమైన స్ట్రెచింగ్ వ్యాయామాలు, ముఖ్యంగా నిద్రవేళకు ముందు, కాలు తిమ్మిరిని నివారించడంలో సహాయపడుతుంది. కాలి స్ట్రెచ్‌లు, చీలమండను సర్కిల్ లాగా తిప్పడం వంటి స్ట్రెచ్ వ్యాయామాలు చేయండి.
2. హైడ్రేటెడ్ గా ఉండండి: డీహైడ్రేషన్ కాళ్ల తిమ్మిరికి కారణమవుతుంది. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.
3. మసాజ్: లెగ్ మసాజ్ కోసం మీ భాగస్వామి సాయం తీసుకోండి. లేదా ప్రొఫెషనల్ ప్రినేటల్ మసాజ్ థెరపిస్ట్‌ని సందర్శించండి.
గుండెల్లో మంట:
- తక్కువ భోజనం: చిన్న సైజులో ఎక్కువ సార్లు భోజనం చేయడం వల్ల వాంతులు, వికారాన్ని తగ్గించుకోవడమే కాకుండా, గుండెల్లో మంటను నివారించవచ్చు.
- మీ ఎగువ శరీరాన్ని ఎలివేట్ చేయండి: నిద్రపోతున్నప్పుడు, అదనపు దిండ్లు ఉపయోగించి మీ పైభాగాన్ని కొద్దిగా పైకి లేపండి. ఇది యాసిడ్ రిఫ్లక్స్ ముప్పును తగ్గిస్తుంది.
- ట్రిగ్గర్ ఫుడ్స్‌ను నివారించండి: మీకు గుండెల్లో మంటను కలిగించే ఆహారాలను గుర్తించండి. గర్భధారణ సమయంలో వాటిని తీసుకోకుండా ఉండండి.
గర్భధారణ ఒక అందమైన ప్రయాణం. ప్రెగ్నెన్సీలో ఎదురయ్యే ఏ అనారోగ్య సమస్య అయినా మీ వైద్యుడి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తగిన చికిత్స అందుకోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీలో కౌంటర్ పై దొరికే మందులు వాడకూడదు. ముఖ్యంగా నొప్పి మాత్రలు తీసుకోకూడదు. ఏదైనా డాక్టర్ సలహా మేరకే వాడాలని గుర్తించండి.