Railway RRB Jobs: రైల్వేలో 9,144 పోస్టులకు ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్.. మరో 5 రోజుల్లో ముగియనున్న గడువు

people inside train
వేసవిలో తిరుమలకు ప్రత్యేక రైళ్లు

RRB Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. రైల్వేలో ఉద్యోగాల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ, అలాగే పోస్టుల వివరాలు, అర్హ‌త, జీతం, ఎంపిక ప్ర‌క్రియ వివ‌రాలు అన్నింటినీ ఈ నోటిఫికేష‌న్‌లో పొందుపరిచింది.

ఆర్ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) దాదాపు 9 వేల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయగా, అందులో టెక్నీషియ‌న్  గ్రేడ్ -1 సిగ్న‌ల్, టెక్నీషియ‌న్ గ్రేడ్-3లోని కేట‌గిరీలకు సంబంధించి ఖాళీగా ఉన్న‌టువంటి 9,144 పోస్టుల‌కు దర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులు సమర్పించడానికి చివ‌రి తేదీ ఏప్రిల్ 8, 2024. 

ఆర్ఆర్బీ రైల్వే పోస్టుల వివ‌రాలు:

టెక్నీషియ‌న్ గ్రేడ్ 1 సిగ్న‌ల్: 1092 పోస్టులు 

టెక్నీషియ‌న్ గ్రేడ్ 3: 8052 పోస్టులు 

అభ్య‌ర్థి వయో పరిమితి

టెక్నీషియ‌న్ గ్రేడ్-1కి సంబంధించి  18-36 సంవ‌త్స‌రాల మధ్య వ‌య‌స్సు ఉండాలి. 

టెక్నీషియ‌న్ గ్రేడ్ -3 కి పోస్టుల‌కు  18-33 ఏళ్ల మ‌ధ్య వయస్సు ఉండాలి.

వీరికి గరిష్ట వయోపరిమితిలో స‌డ‌లింపు 

SC/ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవ‌త్స‌రాల‌ స‌డ‌లింపు  ఉంటుంది.

ఓబీసీలకు 3 సంవ‌త్స‌రాలు స‌డ‌లింపు ఉంటుంది.

ఎక్స్- స‌ర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 నుండి 8 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

దివ్యాంగులైన అభ్య‌ర్థులకు 8 నుండి 15 సంవ‌త్స‌రాల సడలింపు ఉంటుంది.

రైల్వే ఉద్యోగాల ఎంపిక విధానం:

కంప్యూట‌ర్ ఆధారిత టెస్ట్(CBT), మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ మ‌రియు డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ ద్వారా రైల్వే ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దర‌ఖాస్తు ర‌సుం:

ఎస్సీ, ఎస్టీ, మ‌హిళ‌లు, మైనార్టీ, ట్రాన్స్‌జెండార్, మాజీ సైనికోద్యోగి, ఆర్థికంగా వెన‌క‌బ‌డిన వారు రూ. 250ల మేర పరీక్ష దరఖాస్తు రుసుం చెల్లించాలి. మిగిలిన అభ్య‌ర్థులు  రూ. 500 ఫీజు చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

టెక్నీషియ‌న్ -1 గ్రేడ్‌కి సంబంధించి  కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్‌లో జ‌న‌రల్ అవేర్‌నెస్ నుండి 10 ప్ర‌శ్న‌లు, జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ రీజ‌నింగ్ నుండి 15 ప్ర‌శ్న‌లు, బేసిక్ కంప్యూట‌ర్ అండ్ అప్లికేష‌న్ నుండి 20 ప్ర‌శ్న‌లు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్ నుండి 35 ప్ర‌శ్న‌లు మొత్తం 90 నిమిషాల స‌మ‌యంలో పూర్తి చేయాలి. అలాగే 1\3 నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి.

టెక్నీషియ‌న్ గ్రేడ్ -3  పోస్టుకు గ‌ణితం నుంచి 25, జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, జ‌న‌ర‌ల్  సైన్స్ నుంచి 40, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ నుంచి 10 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి.

జీతం:

ఆర్ఆర్‌బీ టెక్నీషియ‌న్ గ్రేడ్ -1 కి రూ. 29,200 ప్లస్ భత్యాలు

ఆర్ఆర్‌బీ టెక్నీషియ‌న్ గ్రేడ్ -3 కి రూ. 19,900 ప్లస్ భత్యాలు

ఆర్ఆర్‌బీ దరఖాస్తు చేసే విధానం:

step-1: RRB అధికార వెబ్‌సైట్‌ను http://rrbapply.gov.in/ ఓపెన్ చేయండి. 

step -2: ఆర్ఆర్‌బీ టెక్నీషియ‌న్ రిక్రూట్‌మెంట్ 2024 అప్ల‌య్ లింక్‌ను చూడండి.

step -3:  అవ‌స‌ర‌మైన వివరాల‌ను నింపి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయండి.

step -4: వివ‌రాల‌ను ఒక‌సారి చెక్ చేసుకోండి.

step -5: అప్లికేష‌న్ ఫీజు చెల్లించండి.

step -6: ప్రింటౌట్ తీసుకొని భద్రపరచుకోండి.

ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ కోసం వార్త చివరలో పీడీఎఫ్ చూడండి.

  • లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
Previous articleతెలుగు డ‌బ్బింగ్ సినిమాల సంద‌డి.. ఏ ఓటీటీలో ఏది స్ట్రీమింగ్ అవుతోంది?
Next articleBlack Circles under Eye: క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు శాశ్వతంగా తొలగించడం ఎలా?