ఎంజి మోటర్ ఇండియా తన ఎంజి కామెట్ ఈవీ (EV)-ది స్మార్ట్ ఎలక్ట్రిక్ వెహికల్తో కొత్త శకానికి నాంది పలికింది. అర్బన్ మొబిలిటీ కోసం వినియోగదారులకు ఇది సరికొత్త ఎంపిక కానుంది. MG మోటార్ ఇండియా 99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్. ఇది భారతదేశంలో అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రకటిస్తూ తన స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం, ఎంజి కామెట్ ఈవీ(EV)ని నేడు ఆవిష్కరించింది. బహుముఖ జీఎస్ఈవీ-ప్లాట్‌ఫారమ్-ఆధారిత ప్యూర్ ఈవీ కొద్దిపాటి ఇంకా విశాలమైన డిజైన్‌తో నగరంలో సాఫీగా, ఒత్తిడి లేని ప్రయాణాన్ని అనుమతించే స్వాభావిక చురుకుదనాన్ని కలిగి ఉంది. కామెట్ ఈవీ అనేది ఎంజీ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో రెండవ ఈవీ. ఫ్యూచర్ టెక్నాలజీ, వినియోగదారు-స్నేహపూర్వక స్మార్ట్ టెక్నాలజీలతో అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఈవీ – ఎంజీ కామెట్ ప్రత్యేక పరిచయ ధర రూ 7,98,000 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.
ఈ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ, ‘‘అర్బన్ మొబిలిటీ పరిణామంలో కీలక ఘట్టాన్ని సూచిస్తూ, భారతదేశంలో ఎంజీ కామెట్ ఈవీని విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. కామెట్ ఈవీ కారు కన్నా ఎక్కువ. ఇది మన నగరాల్లో మనం ప్రయాణించే విధానాన్ని మార్చాలనే మా సంకల్పాన్ని సూచిస్తుంది’’ అని తెలిపారు.
‘‘కామెట్ ఈవీ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ జీఎస్ఈవీ (GSEV)ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించగా, ఇది ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ ఈవీ విక్రయాల మార్కును చేరుకుంది. స్టైల్, టెక్నాలజీ, సుస్థిరతలను కారు నాజూకుగా మిళితం చేస్తూ, అసమానమైన భద్రతా లక్షణాలతో బహుముఖ, విశాలమైన రైడ్‌ను అందిస్తుంది. ఎంజీలో మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ కనెక్ట్ అయిఉందని మేము అర్థం చేసుకున్నాం. కామెట్ ఈవీతో స్టైల్ లేదా సౌలభ్యం విషయంలో రాజీ పడకుండా స్మార్ట్ ఎంపిక చేసుకునేలా మా వినియోగదారులను శక్తివంతం చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన వివరించారు.
ఎంజి కామెట్ ఈవీ స్మార్ట్ సేఫ్టీ
కామెట్ ఈవీ అన్ని అంశాలలో, లోపలి నుంచైనా లేదా బయటి నుంచైనా సురక్షితమైన, పటిష్టమైన వాహనం. ఇది 17.3 kWh లి-ఐయాన్ బ్యాటరీతో పాటు ప్రిస్మాటిక్ సెల్స్‌ను కలిగి ఉంటుంది. ఇది సుదీర్ఘ సైకిల్ లైఫ్ కోసం 39 కఠినమైన భద్రతా పరీక్షలకు లోనైంది. ఇది ఐపీ67-రేటెడ్‌తో నీరు, ధూళికి అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. వీటన్నింటితో ప్రతి పరిస్థితికి గరిష్ట భద్రతను నిర్ధారిస్తాయి. ఇది 17 హాట్ స్టాంపింగ్ ప్యానెల్లతో కూడిన హై స్ట్రెంత్ వెహికల్ బాడీ ఎంజీ కామెట్ ఈవీ మొత్తం నిర్మాణాన్ని బలంగా మరియు సురక్షితంగా చేస్తుంది. స్మార్ట్ ఈవీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ +ఈబీడీ, ఫ్రంట్ & రియర్ 3 పాయింట్, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, టీపీఎంఎస్ (ఇన్‌డైరెక్ట్) మరియు ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ వంటి సెగ్మెంట్-లీడింగ్ యాక్టివ్ మరియు పాసివ్ సేఫ్టీ ఫీచర్లతో లోడ్ అయి ఉంది.
ఎంజి కామెట్ ఈవీ స్మార్ట్ టెక్
ఇంటెలిజెంట్ టెక్ డాష్‌బోర్డ్ విభాగంలో, ఎంజీ కామెట్ ఈవీ అధునాతనతను అందిస్తుంది. అంతర్నిర్మిత ఐస్మార్ట్ (iSmart)సిస్టమ్ 100+ వాయిస్ కమాండ్లు మరియు 55+ కనెక్టెడ్ కార్ ఫీచర్లతో వస్తుంది.
ఎంజి కామెట్ ఈవీ హైలైట్స్
- ఆకర్షణీయమైన ప్రారంభ ధర రూ 7,98,000 కు కామెట్ ఈవీ లభిస్తుంది.
- నెలకు రూ. 519* ఎకనామికల్ ఛార్జింగ్ ఖర్చుతో పనిచేస్తుంది
- పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు.
- కామెట్ ఈవీ బీఐసీఓ(BICO)-‘బిగ్ ఇన్సైడ్, కాంపాక్ట్ అవుట్‌సైడ్’ అనే డిజైన్‌తో రూపొందించారు.
- నిర్మాణ భద్రత కోసం 17 హాట్ స్టాంపింగ్ ప్యానెళ్లు; వాహనం మరియు బ్యాటరీ భద్రత కోసం 39 కఠినమైన పరీక్షలు
- ఎంజి కామెట్ ఈవీ అధిక-ధృఢత్వాన్ని కలిగిన వెహికల్ బాడీతో వస్తుంది
- 17.3kWh లి-ఐయాన్ బ్యాటరీతో ప్రిస్మాటిక్ సెల్స్‌తో 230కి.మీ. పరిధి
- వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే
- 3-డ్రైవ్ మోడ్లు & 3 కేఈఆర్ఎస్ మోడ్లు
- డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్+ఈబీడీ, ఫ్రంట్ & రియర్ 3 పాయింట్, సీట్ బెల్ట్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా & సెన్సార్, టీఎంపీఎస్ (ఇన్‌డైరెక్ట్) మరియు ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్‌తో సహా యాక్టివ్ మరియు పాసివ్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు.
- 100+ వాయిస్ కమాండ్లు, 55+ కనెక్ట్డ్ కార్ ఫీచర్లతో ఐస్మార్ట్ (iSmart)
- 10.25” హెడ్ యూనిట్ మరియు 10.25” డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ ట్విన్ డిస్ప్లే
- స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్, ఇద్దరు వ్యక్తుల వరకు డిజిటల్ బ్లూటూత్ కీ షేరింగ్ ఫంక్షన్
- డైనమిక్ ఐలాండ్ నోటిఫికేషన్లు
- వన్ టచ్ స్లయిడ్ & రెక్లైన్ ప్యాసింజర్ సీటు
- ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీఎస్ఈవీ ఆధారంగా; 4-సీటర్ కాన్ఫిగరేషన్‌తో ఫ్లాట్‌ఫారం ఉంటుంది.