ఈ వారం థియేట‌ర్, ఓటీటీ రిలీజ్ చిత్రాలు.. సినీ ప్రియులకు పండగే

OTT
ఈవారం ఓటీటీ, థియేటర్ సినిమాలు Image by Mudassar Iqbal from Pixabay

OTT and Theatre releases this week: ఈ వారం థియేట‌ర్ల‌లోనూ, ఓటీటీలోనూ సినిమాలు సంద‌డి చేయనున్నాయి. మొన్న‌టి వ‌ర‌కూ పెద్ద సినిమాలేవి థియేట‌ర్ల‌లో లేక‌పోవ‌డం వ‌ల‌న ప్రేక్ష‌కులంతా స్టార్ హీరోల సినిమాల‌కై ఎదురుచూస్తున్న సంద‌ర్భంలో ఎన్నో మంచి మంచి చిత్రాలు ఈవారం అల‌రించ‌నున్నాయి. అలాగే ఓటీటీలో ఈ వారం కూడా దాదాపు 19 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానుండ‌డం విశేషం. 

ఈ వారం క్రేజీ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అందులో  విశ్వక్‌ సేన్ హీరోగా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గం గం గణేశా, భజే వాయు వేగం వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. 

ఈ వారం  థియేట‌ర్లో విడుద‌ల అయ్యే చిత్రాలు:

  1. ఈ వారం థియేట‌ర్లో విడుద‌ల అయ్యే చిత్రాల్లో మొద‌టిది విశ్వ‌క్ సేన్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల అవుతుంది. ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంత‌రం ఇప్పుడ మే 31 కి విడుద‌ల చేయ‌బోతున్నారు. దీనికి క్రిష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, విశ్వ‌క్ సేన్, నేహా శెట్టి క‌థానాయికులుగా న‌టించ‌నున్నారు.
  2. ఇక మ‌రో సినిమా భ‌జే వాయు వేగం. ఇది కూడా మే 31 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో ఆర్ ఎక్స్ 100 సినిమా హారో కార్తికేయ న‌టించ‌గా, ఐశ్వ‌ర్య మేన‌న్ హీరోయిన్‌గా న‌టించింది. దీనికి ప్ర‌శాంత్ రెడ్డి చంద్ర‌పు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, కీల‌క పాత్రలో హ్యాపీడేస్ సినిమా ఫేం టైస‌న్ న‌టిస్తున్నాడు.
  3. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన మ‌రో స‌రికొత్త సినిమా గం గం గ‌ణేశా. ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమా క్రైమ్‌, కామెడీ జోనర్‌‌లో రూపొందింది. ఇందులో ఆనంద్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న హీరోయిన్‌గా  అను ఇమ్మాన్యుయేల్  న‌టించారు. ఇది కూడా థియేట‌ర్లో మే 31 న విడుద‌ల కానుంది.

ఈ వారం ఓటీటీలో విడుద‌ల కాబోయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు:  

అమెజాన్ ప్రైమ్:

  1. పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

జియో సినిమా:

  1. ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.
  2. దేడ్ బిగా జమీన్ (హిందీ సినిమా) – మే 31
  3. లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) – మే 31
  4. ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – మే 31
  5. ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 01

నెట్‌ఫ్లిక్స్ :

  1. ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) – మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.
  2. ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 30
  3. గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 30
  4. ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) – మే 31
  5. రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) – మే 31
  6. లంబర్‌జాక్ ద మాన్‌స్టర్ (జపనీస్ మూవీ) – జూన్ 01

హాట్‌స్టార్ :

  1. కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.
  2. ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 30
  3. ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) – మే 30
  4. జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – మే 31

ఈటీవి విన్:

  1. యూత్ (తెలుగు) – మే 30
  2. కీచురాళ్లు – (తెలుగు) – మే 30

యూట్యూబ్ :

  1. ధూమ‌మ్ – (తెలుగు) – 31
  2. శ్రీరంగ నీతులు – (తెలుగు) – మే 30

జీ 5 :

  1. స్వాతంత్య్ర వీర్ సావ‌ర్క‌ర్ – (హిందీ చిత్రం) – మే 28 నుంచి స్రీమింగ్ అవుతోంది.
  2. హౌస్ ఆఫ్ లైస్  (హిందీ వెబ్ సిరీస్ ) – మే 31

ఆహా :

  1. ప్రాజెక్ట్ జెడ్ – మే 31
Previous articleHomemade Ice cream: ఇంట్లోనే సుల‌భంగా ఐస్‌క్రీమ్ త‌యారు చేయండి.. చాలా టేస్టీగా ఉంటుంది
Next articleOdisha Beaches: ఒడిషాలోని సంద‌ర్శ‌న‌కు అద్భుత‌మైన బీచ్‌లు ఇవే..