ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల సంఖ్య పెరిగింది. ఏకంగా 20 పైగా సినిమాలు అలరించనున్నాయి. థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఒక్క గెటప్ శీను నటించిన రాజు యాదవ్ అనే చిన్న సినిమా మాత్రమే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. అయితే ఓటీటీలు సినిమాలు, సిరీస్‌లతో అలరించనున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు పెద్దగా లేకపోయినా ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా మరెన్నో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు సరికొత్త సినిమాలతో ఆకట్టుకోనున్నాయి. ఈ వారం అందించబోయే ఎంటర్టైన్మెంట్ లిస్ట్ ఇక్కడ ఉంది చూసేయండి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ
- క్రాష్ (కొరియన్ వెబ్ సిరీస్) – మే 13
- చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 14
- అంకుల్ సంషిక్ (కొరియన్ వెబ్ సిరీస్) – మే 15
- బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ సిరీస్) – మే 17
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:
- ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 15
- బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 15
- బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 16
- మేడమ్ వెబ్ (ఇంగ్లిష్ మూవీ) – మే 16
- పవర్ (ఇంగ్లిష్ సినిమా) – మే 17
- ది 8 షో (కొరియన్ వెబ్ సిరీస్) – మే 17
- థెల్మా ది యూనికార్న్ (ఇంగ్లిష్ మూవీ) – మే 17
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ:
- ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 16
- 99 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 17
జీ5 ఓటీటీ:
- బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ సినిమా) – మే 17
- తళమై సెయలగమ్ (తమిళ్ వెబ్ సిరీస్) – మే 17
జియో సినిమా ఓటీటీ:
- డెమన్ స్లేయర్ (జపనీస్ వెబ్ సిరీస్) – మే 13
- C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) – మే 14
- జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) – మే 17
బుక్ మై షో :
- గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 13
సోనీ లివ్ :
- లంపన్ (మరాఠీ సిరీస్) – మే 16
ఆపిల్ ప్లస్ టీవీ :
- ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 17
ఎమ్ఎక్స్ ప్లేయర్ :
- ఎల్లా (హిందీ సినిమా) – మే 17
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్