Avoid food for diabetes: డయాబెటిస్ ఉందా? వేసవిలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి

diabetes
డయాబెటిస్ ఉన్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి (image by pexels)

Avoid food for diabetes: డయాబెటిస్ ఉన్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సమ్మర్‌లో కొన్ని ఆహారాలు తినకూడదు. మధుమే: అనేది ప్రపంచంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇది ఒక దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది టైప్2 డయాబెటిస్ బారిన పడుతుంటారు. చిన్నపిల్లల్లో వచ్చేది టైప్1 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ మాత్రం పెద్దలలో వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండి, శరీరం ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉన్నప్పుడు లేదా తగినంత ఇన్సులిన్ తయారు చేయలేనప్పుడు ఈ డయాబెటిస్ వ్యాధి వచ్చిందని అంటారు. వేసవిలో మధుమేహ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి

మైదా పిండితో చేసిన ఆహారం

మైదా పిండిన శుద్ధి చేసిన పిండిగా చెబుతారు. దీనిలో గ్లూటెన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మైదాతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. డయాబెటిస్ రోగులకు ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి వేసవిలోనే కాదు ఏ కాలంలో అయినా మైదాతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

గోధుమ రవ్వ

ప్రతి ఇంట్లో గోధుమ రవ్వ కచ్చితంగా ఉంటుంది. దీనితో ఎక్కువమంది ఉప్మా చేసుకొని తింటారు. గోధుమ రవ్వతో ఎలాంటి సమస్య లేదు అనుకుంటారు కానీ, దీనిలో స్టార్చ్ అధికంగా ఉంటుంది. గోధుమలను ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు. కాబట్టి ఇది గోధుమల ఉప ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుద్ధి చేసిన పదార్థాల జాబితాలో గోధుమ రవ్వ కూడా చేరుతుంది. దీన్ని డయాబెటిస్ రోగులు తక్కువగా తినాలి.

తీపి పానీయాలు

మండే ఎండల్లో శరీరం వేడెక్కిపోతుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల ఎక్కువ మంది చల్లని తీపి పానీయాలు తాగడానికి ఇష్టత చూపిస్తారు. డయాబెటిస్ రోగులు తీపి పానీయాలకు దూరంగా ఉండాలి. చక్కెర కలిపిన ఈ పానీయాలు తాగడం వల్ల సమస్యల బారిన పడతారు. వీటికి బదులు నిమ్మరసం, కోల్డ్ కాఫీ, మజ్జిగ, చల్లటి స్మూతీలు వంటి వాటిని తినడం మంచిది.

పండ్ల రసాలు

వేసవిలో మండే ఎండల్లో ఎక్కడైనా పండ్ల రసాలు కనిపిస్తే వెంటనే వెళ్లి తాగేస్తారు. కానీ ఆ పండ్ల రసాల్లో పంచదార కూడా కలుపుతారు అన్న విషయం మర్చిపోతారు. ప్యాక్డ్ పండ్ల రసాలు తాగడం మంచిది కాదు. వాటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. చక్కెర కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోయే అవకాశం ఉంది. దీని బదులు ఇంట్లో మీరే స్వయంగా పండ్ల జ్యూస్ తయారు చేసుకుని తాగితే మంచిది. చక్కెర మాత్రం కలపకూడదు.

ఐస్ క్రీములు

వేసవిలో ఐస్‌క్రీమ్ కనబడగానే కరిగిపోయేవారు ఎంతోమంది. వీటిని తినడం వల్ల చక్కెర కంటెంట్ అధికంగా శరీరంలో చేరుతుంది. అలాగే క్యాలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి.

బేకరీ ఉత్పత్తులు

చిరుతిండి కోసం బేకరీలకు రోజూ వెళ్లేవారు ఎంతోమంది. బిస్కెట్లు, నమ్కీన్స్ వంటివి ఎక్కువగా ఎంచుకొని తింటారు. వీటిని మైదాతో తయారుచేస్తారు. మైదాతో చేసిన ఆహారాలు తినడం చాలా ప్రమాదకరం.

బంగాళాదుంపలు

బంగాళాదుంపలు, చిలగడదుంపలు వంటి వాటిల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు, కాబట్టి వాటికి బదులుగా ఆకుకూరలు వినియోగాన్ని పెంచుకోవాలి.

వేపుళ్లు

ఏ సీజన్ అయినా మధుమేహ వ్యాధిగ్రస్తులు వేయించిన ఆహారాలను తీసుకోకపోవడం మంచిది. వేయించిన ఆహారాల్లో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల బరువు అమాంతం పెరుగుతారు. బరువు పెరగడం అనేది మధుమేహాన్ని మరింతగా పెంచుతుంది.

ఊరగాయలు

ఆవకాయలు, ఊరగాయలు, సలాడ్లు వంటి వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఆహారంలో అదనపు ఉప్పును జోడించుకోవడం మానేయాలి. ఎంత ఉప్పు సరిపోకపోయినా రుచి కోసం ఉప్పును జోడించుకుంటే ఆరోగ్యం మూలన పడుతుంది.

Previous articlePapaya health benefits: బొప్పాయి తింటే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Next articleఒడిశా రైలు ప్రమాద ఘటనలో 288కి చేరిన మృతుల సంఖ్య