బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ లాంటి స్పోర్ట్స్‌కు హైదరాబాద్‌లో స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. అన్ని స్పోర్ట్స్ నేర్పించే అకాడమీలతోపాటు ప్రత్యేకంగా ఒక స్పోర్ట్పైనే దృష్టిసారించే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో స్పోర్ట్ వారీగా బెస్ట్ స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.
బ్యాడ్మింటన్ కోచింగ్ సెంటర్లు
ఇండియాలోనే బ్యాడ్మింటన్‌కు కేరాఫ్‌గా నిలుస్తోంది మన హైదరాబాద్. ఈ స్పోర్ట్‌లో చైనా ఆధిపత్యానికి ఇండియా గండి కొట్టిందంటే దానికి కారణం మన హైదరాబాద్ ప్లేయర్సే. మొన్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు ఏకంగా గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలుసు కదా. ఇప్పటి వరకు ఏ భారతీయుడికీ సాధ్యం కాని ఘనత ఇది. అంతకుముందు ఒలింపిక్స్‌లోనూ సిల్వర్ మెడల్ సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ షట్లర్ కూడా సింధూనే. ఈ విజయాలతో క్రికెటర్ల రేంజ్ ఫాలోయింగ్‌ను ఆమె సొంతం చేసుకుంది.
అలాంటి స్టార్ ప్లేయర్‌ను దేశానికి అందించింది మన నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీయే. ఆమెతోపాటు సైనా నెహ్వాల్, శ్రీకాంత్, ప్రణయ్, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్‌లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ మన భాగ్యనగరం నుంచి వచ్చిన వాళ్లే.
బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఇప్పటి పిల్లలు భావిస్తున్నారంటే దానికి కారణం ఈ ప్లేయర్సే. ప్రస్తుతం నాణ్యమైన బ్యాడ్మింటన్ కోచింగ్ ఇచ్చే అకాడమీలు హైదరాబాద్‌లో ఎన్నో ఉన్నాయి. అందులో బెస్ట్ ఇప్పుడు చూద్దాం.
1. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ
ఇండియాలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్‌కు ఇప్పుడీ స్థాయి క్రేజ్ రావడానికి కారణమైన వ్యక్తి పుల్లెల గోపీచంద్. 2001లో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన ప్లేయర్. రిటైరైన తర్వాత 2008లో ఈ కోచింగ్ అకాడమీ ప్రారంభించాడు. నగరంలోని బెస్ట్ బ్యాడ్మింటన్ అకాడమీగా ఈ పుల్లెల గోపీచంద్ అకాడమీకి పేరుంది. సింధు, సైనా, శ్రీకాంత్‌లాంటి స్టార్లంతా ఈ అకాడమీ నుంచి వచ్చినవాళ్లే. 2017లో గ్రేటర్ నోయిడాలోనూ గోపీచంద్ మరో అకాడమీ ప్రారంభించాడు.
హైదరాబాద్ అకాడమీలో ఎనిమిది బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు స్విమ్మింగ్ పూల్, వెయిట్ ట్రైనింగ్ రూమ్ కూడా ఉన్నాయి. ఫిజియోథెరపీ, డైట్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
గచ్చిబౌలిలోని ఐఎస్బీ రోడ్లో ఈ గోపీచంద్ అకాడమీ ఉంది. 040-23005369, 09315680085 నంబర్లకు ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. రెండు ఒలింపిక్స్ మెడల్స్, ఏడు వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్స్, 15 వరకు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన ఘనత ఈ అకాడమీ ప్లేయర్స్ సొంతం. అయితే ఓ స్థాయి ప్లేయర్స్‌కు మాత్రమే ఇక్కడ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇస్తారు. ఫీజు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.
2. చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీ
బ్యాడ్మింటన్‌లో తనకంటూ ఓ గుర్తింపు పొందిన స్టార్ ప్లేయర్ చేతన్ ఆనంద్ నెలకొల్పిన అకాడమీ ఇది. చేతన్ ఆనంద్ నాలుగుసార్లు నేషనల్ చాంపియన్. కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్ట్. అర్జున అవార్డు కూడా అందుకున్నాడు. ఈ ఆటపై మంచి పట్టుండటంతో సొంతంగా అకాడమీ పెట్టి ఆసక్తి ఉన్న పిల్లలకు నేర్పిస్తున్నాడు. ఇక్కడ అనుభజ్ఞులైన కోచ్‌లు, ప్రొఫెషనల్స్ అందుబాటులో ఉంటారు.
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ అకాడమీ తెరిచే ఉంటుంది. 098855 33357 నంబర్‌కు కాల్ చేసి అకాడమీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవల్ ప్లేయర్‌కు చెందిన అకాడమీ కావడంతో ఇక్కడ కోచింగ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకున్నవాళ్లకు ఈ అకాడమీ మంచి ఆప్షన్. హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఉన్న గాంగెస్ వ్యాలీ స్కూల్‌తోపాటు విజయవాడలోనూ చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలు ఉన్నాయి.
3. భాస్కర్ బాబు బ్యాడ్మింటన్ అకాడమీ
హైదరాబాద్‌లోని ప్రముఖ బ్యాడ్మింటన్ అకాడమీల్లో భాస్కర్ బాబు అకాడమీ కూడా ఒకటి. ఇక్కడ 12 కోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే ఉండాలనుకునే స్టూడెంట్స్ కోసం హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేశారు. అండర్ 19, అండర్ 17, అండర్ 13 కేటగిరిల్లో ఈ అకాడమీ ప్లేయర్స్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు.
భాస్కర్ బాబు ఇక్కడ చీఫ్ కోచ్‌గా ఉన్నారు. కోచింగ్ మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఈయన సొంతం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని సక్సెస్ఫుల్ కోచ్‌లలో భాస్కర్ బాబు కూడా ఒకరు.
దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెయిన్ క్యాంపస్‌లో ఈ అకాడమీ ఉంది. మరిన్ని వివరాల కోసం 9849909992 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. ఈ బ్యాడ్మింటన్ అకాడమీ అధికారిక వెబ్సైట్ http://www.bbba.co.in/
5. స్పర్ద బ్యాడ్మింటన్ అకాడమీ
బ్యాడ్మింటన్‌లో ఓనమాల నుంచీ మొదలుపెట్టాలనుకుంటే ఈ అకాడమీని ట్రై చేయొచ్చు. ఆదివారం సహా వారం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మూడు కోర్టులు అందుబాటులో ఉన్నాయి. అన్నీ సింథటిక్ సర్ఫేస్వే.
హైదరాబాద్ షేక్‌పేట్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్ వెనకాల లక్ష్మీనగర్‌లో ఈ అకాడమీ ఉంది. తక్కువ ఫీజుతో బ్యాడ్మింటన్‌లో బేసిక్స్ నేర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 97040 58222 నంబర్‌కు కాల్ చేయొచ్చు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ అకాడమీ తెరిచే ఉంటుంది.
6. ట్రింప్ స్పోర్ట్స్ అకాడమీ
ఇక్కడ బ్యాడ్మింటన్‌తోపాటు ఇతర స్పోర్ట్స్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంది. బ్యాడ్మింటన్ కోసం అనుభవజ్ఞులైన, శిక్షణ పొందిన కోచ్‌లు ఇక్కడ ఉన్నారు. ఈ గేమ్‌లోని కొన్ని టెక్నిక్స్‌ను నేర్పించడానికి ప్రత్యేకంగా కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు.
ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అకాడమీ తెరిచి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకమైన సర్ఫేస్ ఏమీ లేదు. సాధారణ సర్ఫేస్ మీదే బ్యాడ్మింటన్ నేర్పిస్తారు. మరిన్ని వివరాల కోసం 8978161616 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. మాదాపూర్‌లో బాటా షోరూమ్ వీధిలో ఈ అకాడమీ ఉంది.
టెన్నిస్ కోచింగ్ సెంటర్లు ఎక్కడ?
విజయ్ అమృత్‌రాజ్, లియాండర్ పేస్, మహేష్ భూపతిలాంటి స్టార్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నా.. మన దగ్గర టెన్నిస్‌కు క్రేజ్ వచ్చింది మాత్రం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాతోనే. ఇండియాలో తన కెరీర్ మొత్తం నంబర్ వన్ మహిళా ప్లేయర్‌గా నిలిచిన అరుదైన ఘనత సానియా సొంతం. తన కెరీర్లో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచింది. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆమె స్ఫూర్తితో క్రమంగా టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో హైదరాబాద్‌లో ఎన్నో కోచింగ్ సెంటర్లు వెలిశాయి.
అందులో బెస్ట్ కోచింగ్ సెంటర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఏవి ఉన్నాయో తెలుసుకునేందుకు ఆరాతీస్తున్న తల్లిదండ్రుల్లో ఎక్కువగా టెన్నిస్ కోచింగ్ సెంటర్ల గురించి కూడా తెలుసుకుంటున్నారు.
1. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ
2013లో టెన్నిస్ నుంచి రిటైరైన తర్వాత సానియా మీర్జా ఏర్పాటు చేసిన అకాడమీ ఇది. వరల్డ్‌క్లాస్ ఫెసిలిటీస్‌తో దీనిని ఏర్పాటు చేశారు. గ్రాండ్‌స్లామ్ ప్రమాణాలు ఉన్న 9 కోర్టులు ఇక్కడ ఉన్నాయి. ఫిజికల్ ట్రైనింగ్ కోసం జిమ్ కూడా ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న, అణగారిన వర్గాల పిల్లలను గుర్తించి వారికి పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. సానియా 15 ఏళ్ల టెన్నిస్ అనుభవం ఈ అకాడమీకి ప్లస్ పాయింట్. దీంతోపాటు ఇతర ప్రొఫెషనల్, శిక్షణ పొందిన కోచ్‌లు ఇక్కడ ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ దగ్గర్లోని ముర్తుజాగూడాలో సానియా టెన్నిస్ అకాడమీ ఉంది. మరిన్ని వివరాల కోసం 9985531397 నంబర్‌కు కాల్ లేదా info@saniamirzatennisacademy.
2. గ్రీన్లాండ్స్ టెన్నిస్ అకాడమీ
టెన్నిస్‌లో బిగినర్స్ కోసమైతే కొంపల్లిలో ఉన్న గ్రీన్లాండ్స్ టెన్నిస్ అకాడమీ బెస్ట్. 4 ఏళ్లు నిండిన వాళ్లకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఉదయం 6 నుంచి 7.30 వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కోచింగ్ ఉంటుంది. వారానికి మూడు నుంచి నాలుగు రోజులు కోచింగ్ ఇస్తారు.
బిగినర్స్తోపాటు ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ కోచింగ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. బిగినర్స్కైతే సాధారణంగా నెలకు సుమారు రూ.3 వేల వరకు చార్జ్ చేస్తారు. ప్రొఫెషనల్ కోచ్‌లతో ప్రపంచస్థాయి వసతులు ఈ అకాడమీలో ఉన్నాయి.
మరిన్ని వివరాల కోసం 9703678141 నంబర్‌కు కాల్ లేదా
[email protected] ఐడీకి మెయిల్ చేయొచ్చు. కొంపల్లి సినీ ప్లానెట్ అపోజిట్‌లో ఉన్న జీబీఆర్ కల్చరల్ క్లబ్లో ఈ అకాడమీ ఉంది.
3. ఎన్వీకే టెన్నిస్ అకాడమీ
బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఇక్కడ కూడా అందరికీ కోచింగ్ ఇస్తారు. ఐదేళ్లు పైబడిన స్టూడెంట్స్‌ను తీసుకుంటారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 వరకు శిక్షణ ఇస్తారు. సోమవారం తప్ప మిగతా అన్ని రోజులూ అకాడమీ అందుబాటులో ఉంటుంది. వయసు, స్పెషలైజేషన్‌ను బట్టి ఫీజు ఉంటుంది.
ఇక్కడ మొత్తం 8 టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. అందులో నాలుగు సింథిటిక్ కోర్టులు. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు ఉచితంగా టెన్నిస్ కోచింగ్ ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. మాదాపూర్ హైటెక్స్‌కు దగ్గర్లోని ఇజ్జత్‌నగర్‌లో ఈ అకాడమీ ఉంది.
4. ద స్కూల్ ఆఫ్ పవర్ టెన్నిస్
కేవలం బిగినర్స్ కోసమే అయితే ఈ అకాడమీ బెస్ట్. 8 ఏళ్లలోపు పిల్లలను ఇందులో చేర్చుకుంటారు. సికింద్రాబాద్‌లోని రైల్ రిక్రియేషన్ క్లబ్లో ఈ అకాడమీ ఉంది. ఉదయం 4.30 నుంచి 5.30 వరకు, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు కోచింగ్ ఇస్తారు. ప్రతి రోజూ శిక్షణ ఉంటుంది.
స్టూడెంట్ ఏజ్‌ను బట్టి ఫీజు ఉంటుంది. ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన విష్ణు వర్దన్ ఇక్కడ 17 ఏళ్లుగా శిక్షణ పొందుతున్నాడు. మరిన్ని వివరాల కోసం 9391386918 నంబర్ కాల్ చేయండి లేదా info@theschoolofpowertennis.
ఫుట్‌బాల్ కోచింగ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి?
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన స్పోర్ట్ ఫుట్‌బాల్. ఇండియాలోనూ కేరళ, వెస్ట్ బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గేమ్‌ను క్రికెట్ కంటే ఎక్కువగా ఆదరిస్తారు. క్రమంగా మన దగ్గర కూడా ఫుట్‌బాల్‌కు క్రేజ్ పెరుగుతోంది. అర్బన్ ఏరియాల్లోని స్కూల్స్‌లో ప్రత్యేకంగా ఫుట్‌బాల్ మైదానాలు కూడా ఉంటున్నాయి. స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లు ఫుట్ బాల్ శిక్షణ కూడా అందిస్తున్నాయి.
సాకర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో అత్యాధునిక వసతులతో హైదరాబాద్‌లోనూ పలు కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అందులో బెస్ట్ ఏవో ఇప్పుడు చూద్దాం.
1. హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ
హైదరాబాద్‌లో మొట్టమొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ అకాడమీ ఇది. అన్ని ఏజ్ గ్రూప్‌ల వారికి ఇక్కడ కోచింగ్ ఇస్తారు. ఫుట్‌బాల్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్ టీమ్‌కు పార్ట్నర్గా ఉంది. 2014లో ప్రారంభమైన ఈ అకాడమీ హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో ఏడు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 300కుపైగా విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకున్నారు.
కేరళ బ్లాస్టర్స్ టీమ్‌కు కోచింగ్ ఇచ్చే అధికారిక స్టాఫ్ కూడా ఈ అకాడమీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటారు. మరిన్ని వివరాల కోసం 9000707514, 9951965000 నంబర్లకు కాల్ చేయండి లేదా.. hyderabadfootballacademy@
జూబ్లీహిల్స్, మాదాపూర్, గండిపేట్, టోలీచౌకీ, కొంపల్లిలాంటి ప్రాంతాల్లో వీళ్ల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి.
2. జీఆర్ ఫుట్‌బాల్ అకాడమీ
ఒకప్పుడు ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌గా ఉన్న బైచుంగ్ భూటియాతో కలిసి ఆడారు ఈ అకాడమీని ఏర్పాటు చేసిన పీటర్ సిద్ధిఖీ. ఇక్కడ ఈయనే ప్రధాన కోచ్. మోహన్ బగాన్, మహీంద్రా యునైటెడ్లాంటి టీమ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
కొండాపూర్‌లోని పోలీస్ కాలనీలో చిరెక్ స్కూల్ వెనుక ఈ అకాడమీ ఉంది. మరిన్ని వివరాల కోసం 9581194287 నంబర్‌కు కాల్ చేయండి లేదా [email protected] ఐడీకి మెయిల్ చేయండి. ఈ అకాడమీ అధికారిక వెబ్సైట్ http://grfootballacademy.com/
3. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్
ఇదొక స్పోర్ట్స్ ఎన్జీవో. ఇక్కడ ఆరు నుంచి 16 ఏళ్ల వయసున్న స్టూడెంట్స్‌కు ఫుట్‌బాల్ కోచింగ్ ఇస్తారు. థియరీ, ప్రాక్టికల్ క్లాస్‌లు ఉంటాయి. వయసు, అనుభవం ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించి శిక్షణ ఇస్తారు. అర్హత ఉన్న ప్రొఫెషనల్ కోచ్‌లు ఇక్కడ కోచింగ్ ఇస్తారు.
మాజీ రంజీ క్రికెటర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డీ సాయిబాబా ఈ అకాడమీని ప్రారంభించారు. మాసబ్‌ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్క్ ఎదురుగా ఈ అకాడమీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 9396559440 నంబర్‌కు కాల్ చేయండి. [email protected], [email protected] ఐడీలకు మెయిల్ కూడా చేయొచ్చు. ఈ అకాడమీ అధికారిక వెబ్సైట్ https://www.scfindia.org/.
4. హాట్ఫుట్ (Hotfut) హైదరాబాద్
అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటైన ఫుట్‌బాల్ అకాడమీ ఇది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ కోచ్‌లు, శిక్షకులు ఈ అకాడమీలో ఉన్నారు. హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణెల్లో ఈ హాట్ఫుట్ అకాడమీలు ఉన్నాయి.
అండర్ 6, అండర్ 8, అండర్ 10, అండర్ 12, అండర్ 14 కేటగిరీ పిల్లలకు వేరు వేరుగా కోచింగ్ ఇస్తారు. బేగంపేట్‌లోని వైట్‌హౌజ్ బిల్డింగ్‌లో ఈ అకాడమీ ఉంది. మరిన్ని వివరాల కోసం 91777 66005 నంబర్‌కు కాల్ చేయండి లేదా [email protected] ఐడీకి మెయిల్ చేయండి.
ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ అకాడమీ తెరిచే ఉంటుంది. ఈ అకాడమీ అధికారిక వెబ్సైట్ http://hotfut.in/.
5. టర్ఫ్సైడ్
నగరంలో అత్యుత్తమ టర్ఫ్ ఫీల్డ్ ఉన్న అకాడమీ ఇది. అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడి టర్ఫ్ ఈ సెంటర్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ తరఫున ఇక్కడ కోచింగ్ ఇస్తారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న స్పైసీ వెన్యూ ఎదురుగా ఈ అకాడమీ ఉంది. మరిన్ని వివరాల కోసం 9949774430 నంబర్‌కు ఫోన్ లేదా [email protected] ఐడీకి మెయిల్ చేయొచ్చు. ఈ అకాడమీ అధికారిక వెబ్సైట్ http://turfside.in/.
బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్ బాల్ వంటి ఆటలకు స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో చూశారు కదా.. ఇవి కాకుండా మీ ఛాయిస్ ఏవైనా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. వాటిని కూడా ఈ కథనానికి జోడిస్తాం.
ఇవి కూడా చదవండి