Apple iPhone 15 Launch: భారత్​లో యాపిల్ ఐఫోన్ 15 గ్రాండ్​ లాంచ్.. ధర, వివరాలివే..

Apple iPhone 15
యాపిల్ ఐఫోన్ 15 ఫీచర్లు
Apple iPhone 15 : అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 మార్కెట్లోకి మూడు వేరియంట్లలో వచ్చేసింది. తాజాగా విడుదలైన ఈఫోన్ టెక్, ఐఫోన్​ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాని విశేషాలు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పటివరకు ఇండియాలో ఉన్న అన్ని ఐఫోన్ మోడల్స్​ రికార్డులను బద్దలుకొడుతూ.. యాపిల్ ఐఫోన్ 15 వచ్చేసింది. తాజాగా భారత్​లో ఈ మోడల్​ను విడుదల చేశారు. రూ.79,900 వేల ప్రారంభ ధరతో మార్కెట్లో లభ్యమవుతుంది. ఆకట్టుకునే ఫీచర్లు, డిజైన్లతో ఐఫోన్ లవర్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీని ఫీచర్లు, కెమెరా, ధరలు, రంగు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిజైన్

యాపిల్ ఐఫోన్ 15 చూసేందుకు యాపిల్ ఐఫోన్ 14 మాదిరిగానే ఉంది. కానీ దానితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. యాపిల్ ఐఫోన్ 15 ఎడ్జ్స్ ముందు వాటిలాగా ఫ్లాట్​గా లేవు. ఈ అంచులు కాస్త వంగి డిఫరెంట్​గా ఉన్నాయి. కాబట్టి దీనిని పట్టుకోవడం, క్యారీ చేయడం చాలా సులభం. అంత సులువుగా జారిపోయే ప్రమాదముండదు.
డిజైన్ కూడా తేలికైన అనుభూతిని అందిస్తుంది. డైనామిక్ ఐలాండ్​తో స్లిమ్ బెజెల్స్, నాచ్​లెస్ డిజైన్​ దీని సొంతం. వెనుకభాగంలో ఫోన్ ఫ్రాస్టెడ్ గ్లాస్, పెద్ద కెమెరా లెన్స్ కలిగి ఉంది. దీనిలో దిగువన ఉన్న USB-C పోర్ట్ మరో ప్రత్యేకత.

కెమెరా 

యాపిల్ ఐఫోన్ 15లో న్యూ ఏజ్ కెమెరా మరో ఆకట్టుకునే ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఐఫోన్ 14 ప్రో వంటి 48MP ప్రైమరీ సెన్సార్​ను కలిగి ఉంది. 48MP కెమెరా 12MP సెకండరీ సెన్సార్​తో సపోర్ట్ చేస్తుంది.

డిస్ప్లే, ప్రాసెసర్

యాపిల్ ఐఫోన్  15 A16 బయోనిక్ చిప్​తో 6GB RAMతో  వచ్చింది. దీనిలో ఉపయోగించిన A1​6 బయోనిక్ చిప్​ను యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్​తో గతంలో పరిచయం చేశారు. దీని వల్ల మెరుగైన బ్యాటరీ లైఫ్ పొందవచ్చు. ఫోన్​ ముందు భాగంలో 60Hz రిఫ్రెష్​ రేట్​తో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్​ప్లేతో వచ్చింది. కొత్త ఫీచర్​లతో, iOS 17తో ఆకట్టుకుంటుంది.

ధర, రంగు

యాపిల్ ఐఫోన్ 15 మూడు స్టోరేజ్ ఆప్షన్​లలో లభిస్తుంది. 128GB, 256GB, 512GB ఆప్షన్​లతో వచ్చింది. వీటి ధర వరుసగా రూ.79, 900, రూ. 89, 900, రూ.1,09,000. బ్లాక్, గ్రీన్, బ్లూ, ఎల్లో, పింక్​ కలర్​ ఆప్షన్​లలో మీరు వీటిని కొనగోలు చేయవచ్చు.

విక్రయం..

సెప్టెంబర్ 22 నుంచి దీని విక్రయాలు ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 15వతేదీనుంచి దీనిని బుక్ చేసుకోవచ్చు.
Previous articleSexual Health : ఆ కోరికలు తగ్గిపోయాయా? అయితే ఈ ఫుడ్స్ తినండి..
Next articleAfternoon Slump :లంచ్​ తర్వాత నిద్ర వచ్చేస్తుందా? ఇలా దూరం చేసుకోండి..