ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల అయింది. పూణే అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో డిప్యూటీ టెర్మినల్ మేనేజర్, డిప్యూటీ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్, మరెన్నో పోస్టులను ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్వూ ద్వారా మాత్రమే ఎంపిక చేయనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ, ఇంటర్వూ షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు.
నిరుద్యోగ అభ్యర్ధులు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవడానికి దాని అధికార వెబ్సైట్ అయిన http://aiasl.in/ ని చెక్ చేయండి. దీనికి సంబంధించి పోస్టుల వివరాలన్నింటి సమాచారం ఇక్కడ చూడండి.
పోస్టుల అర్హత, వయసు, జీతం వివరాలు:
డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ (ప్యాసింజర్):
గ్రాడ్యుయేషన్ లేదా MBA విద్యార్హత కలిగి ఉండాలి. వయసు 15 నుండి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు 55, జీతం రూ. 60 వేలు ప్లస్ భత్యాలు
డిప్యూటీ ఆఫీసర్ (ప్యాసింజర్):
గ్రాడ్యుయేషన్‌తో పాటు 12 సంవత్సరాలు అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 50 సంవత్సరాలు, జీతం రూ. 32200 ప్లస్ భత్యాలు
జూనియర్ ఆఫీసర్ (ప్యాసింజర్):
35 సంవత్సరాల వయసు దాటకూడదు. 9 సంవత్సరాల అనుభవంతో పాటు గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగి ఉండాలి. జీతం రూ.29,760 ప్లస్ భత్యాలు
జూనియర్ ఆఫీసర్ (టెక్నికల్):
ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ యొక్క లైసెన్స్ ఉండాలి. వయో పరిమితి 28 సంవత్సరాలు. జీతం రూ. 29760 ప్లస్ భత్యాలు
కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టు:
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్ధులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 28 సంవత్సరాలు. జీతం రూ. 27450 ప్లస్ భత్యాలు
ర్యాంప్ సర్వీస్ ఎగ్జీక్యూటివ్ పోస్టు:
ఈ పోస్టులకు తప్పనిసరిగా మెకానికల్/ఎలక్ట్రికల్/ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా చేసి ఉండాలి. గరిష్ట వయసు 28 సంవత్సరాలు. జీతం రూ. 27450 ప్లస్ భత్యాలు
యుటిలిటీ ఏజెంట్ ర్యాంప్ డ్రైవర్:
10వ తరగతి ఉత్తీర్ణలైన వారు ఈ పోస్టుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి 28 సంవత్సరాల వయసు ఉండాలి. జీతం రూ. 24,960
హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్ :
ఈ పోస్టుకు కూడా 10 పాసైన వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 28.జీతం రూ. 22,530
ఇంటర్వూ తేదీలు:
డ్యూటీ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ (ప్యాసింజర్), జూనియర్ ఆఫీసర్ – టెక్నికల్ , కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వూ తేదీ ఏప్రిల్ 15-16, 2024
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండీమ్యాన్ పోస్టులకు ఇంటర్వూ తేదీ ఏప్రిల్ 17-18, 2024
హ్యాండీమ్యాన్, హ్యాండీఉమెన్ పోస్టుల కోసం ఇంటర్వూ తేదీ ఏప్రిల్ 19-20
నోటిఫికేషన్ కింది పీడీఎఫ్‌లో చూడగలరు.