కరోనా కవచం.. స్టీల్‌బర్డ్‌ నుంచి హెల్మెట్ ఫేస్ షీల్డ్

Steelbird Face Shield

హెల్మెట్ తరహా లో ఫేస్ షీల్డ్ మార్కెట్లోకి వచ్చాయి. ఆసియాలో అతిపెద్ద హెల్మెట్‌ తయారీదారు స్టీల్‌బర్డ్‌ హైటెక్‌ ఇండియా లిమిటెడ్‌ వైద్య పరికరాల విభాగంలో ప్రవేశించింది. కోవిడ్‌ 19 కి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా స్టీల్‌బర్డ్‌ 5 రకాల ముఖ కవచాలను ఆవిష్కరించింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టీల్‌ బర్డ్‌ ఫేస్‌ షీల్డ్ తయారు చేసినట్టు సంస్థ తెలిపింది.

విభిన్న రకాలైన డిజైన్‌లు, ఫీచర్లు, పరిమాణాల్లో ఇవి లభిస్తున్నాయి. యూజ్‌ అండ్‌ త్రో, స్టాటిక్‌ ఫేస్‌ షీల్డ్స్, ఫేస్‌ షీల్డ్స్‌ విత్‌ సోఫిస్టికేటెడ్‌ ఫ్లిప్‌–అప్‌ ఫంక్షన్‌ వంటివి ఉన్నాయి.

వైద్య నిపుణులు, పోలీసులు, పారా మెడికల్‌ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, సాధారణ ప్రజలూ వినియోగించవచ్చు. ఈ ఫేస్‌ షీల్డ్ ధర పరిధి రూ .299 నుండి రూ . 699 మధ్య ఉంటుంది.

 

శుభ్రం చేసుకోవచ్చు..

స్టీల్‌ బర్డ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కపూర్‌ దీని గురించి చెబుతూ ‘నాణ్యమైన ఉత్పత్తులను రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయడం స్టీల్‌బర్డ్‌ గ్రూప్‌ డీఎన్‌ఏలో ఉంది. స్టీల్‌బర్డ్‌ ఫేస్‌ షీల్డ్స్‌ అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కవచం గడ్డం క్రింద వరకు, చెవుల వెనక వరకు విస్తరించి ఉంటుంది. ఎలాంటి గ్యాప్‌ లేకుండా కరోనా నుంచి కాపాడుతుంది. సబ్బు నీటితో లేదా సాధారణ గృహ క్రిమిసంహారక మందులతో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు..’ అని వివరించారు.

‘అత్యాధునిక నాణ్యత, ఫీచర్‌ రిచ్‌ ప్రొడక్ట్‌ కారణంగా, స్టీల్‌బర్డ్‌ ఫేస్‌ షీల్డ్‌కు అధిక ఆధరణ లభిస్తోంది. ఇప్పుడు కంపెనీ వచ్చే 2 నెలల్లో రోజుకు 40,000 ఫేస్‌ షీల్డ్స్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది..’ అని వివరించారు.

Steelbird Face Shields

ఈ ఫేస్‌ షీల్డ్‌ ఫీచర్లు

1. మార్కెట్లో లభించే పొడవైన ముఖ కవచాలలో ఇవి ఒకటి, ఇది ఒక వ్యక్తి యొక్క పూర్తి ముఖాన్ని కవర్‌ చేస్తుంది.
2. కవచాన్ని పైకి క్రిందికి తరలించడానికి అనుమతించే ఫ్లిప్‌ అప్‌ ఫంక్షన్‌ ఉంది.
3. యాంటీ స్క్రాచ్‌ కోటెడ్‌
4. యాంటీ ఫాగ్‌ తో కూడా లభిస్తుంది.
5. విడదీయలేని పాలికార్బోనేట్‌ షీల్డ్‌
6. నుదిటిపై కంఫర్ట్‌ కోసం సాఫ్ట్‌ ఫ్యాబ్రిక్‌తో కప్పబడిన పియు ఫోమ్‌.
7. వేర్వేరు తల పరిమాణాలకు సర్దుబాటు పరిమాణం.
8. ఆప్టికల్‌ ట్రూ
9. పీక్‌ టోపీతో షీల్డ్‌
10. యువి ప్రింటెడ్‌ ఫేస్‌ షీల్డ్

పిల్లల కోసం ఫేస్‌ షీల్డ్

‘స్టీల్‌బర్డ్‌ హెల్మెట్‌ పిల్లల కోసం ఫేస్‌ షీల్డ్ ను విభిన్న మరియు ఆకర్షణీయమైన డిజైన్లలో ఒక వారం వ్యవధిలో ప్రారంభించాలని యోచిస్తోంది‘ అని కపూర్‌ తెలిపారు. పిల్లలు తరచుగా మాస్కులు ధరించడానికి వెనుకాడటం వల్ల ఫేస్‌ షీల్డ్‌ పెద్ద సాధనంగా పని చేస్తుందని, అలాగే ముఖ కవచాలను రోజువారీ వినియోగ ఉత్పత్తిగా స్వీకరించేలా మహిళలకు ప్రత్యేక డిజైనర్‌ ఫేస్‌ షీల్డ్ అభివృద్ధి చేస్తున్నామని కపూర్‌ వివరించారు.

ఫేస్‌ షీల్డ్, పిపిఇ కిట్లు, మాస్కులు, శానిటైజర్ వంటివి ప్రాణాలను రక్షించే పరికరాలని, వీటికి జీఎస్టీ రద్దు చేయాలని కపూర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

హెల్మెట్ తరహాలో స్టీల్ బర్డ్ ఫేస్ షీల్డ్
Previous articledemat account meaning in telugu: డీమాట్‌ అకౌంట్‌ ఎందుకు అవసరం? ఎలా తెరవాలి?
Next articleమూవీ రివ్యూ : దిల్‌ బేచారా : సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ తో భావోద్వేగ ప్రయాణం