ఓటీటీలో అడుగు పెట్ట‌బోతున్న కాజల్ హార్ర‌ర్ మూవీ.. కార్తీక (కరుంగాపియం)

karthika aha ott
ఏప్రిల్ 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కార్తీక మూవీ

తమిళ సినిమా కరుంగాపియం  తెలుగులో కార్తీకగా ఓటీటీలో ఏప్రిల్ 9న విడుదల కాబోతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్, రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌లిసి నటించిన ఈ చిత్రం డి. కార్తికేయ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌ర్ర‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కింది. వెంక‌ట సాయి ఫిల్మ్ ప‌తాకంపై ముత్యాల రామ‌దాసు  స‌మ‌ర్ప‌ణ‌లో టి. జ‌నార్థ‌న్ ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహా వేదిక‌గా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9 వ తేదీన స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.

కార్తీక సినిమా క‌థ:

సినిమా మొద‌ల‌వ‌గానే కార్తీక (రెజీనా) ఎంట్రీ ఇస్తుంది. లాక్‌డౌన్‌లో త‌న‌కు బోర్ కొడుతూ ఉన్న సంద‌ర్భంలో త‌న ఫ్రెండ్ అయిన ప్రియ ద‌గ్గ‌ర కొన్ని పుస్త‌కాలు తీసుకుంటుంది. అలా ఆ పుస్త‌కాల‌న్నీ ముందు వేసుకుని చ‌దువుతూ ఉంటుంది. అన్నీ చ‌దివేశాక ఇంక త‌న‌కు ఇంట్ర‌ెస్టింగ్ బుక్స్ కోసం అడ‌గ‌గా త‌న ఫ్రెండ్ ఒక స‌ల‌హా ఇస్తుంది. వాళ్ల అన్న‌య్య‌కు లైబ్ర‌రీ ఉంద‌నీ అక్క‌డ బుక్స్ చ‌దువుకుంటూ బాగా టైమ్ పాస్ చేయ‌వ‌చ్చ‌ని చెబుతుంది. అప్పుడు రెజీనా లైబ్ర‌రీకి వెళుతుంది. అక్క‌డ కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం నాటి పుస్త‌కం త‌న కంట ప‌డుతుంది. అదే కాటుక బొట్టు అనే పుస్తకం. 

ఇందులో ఉన్న ఇంట్ర‌స్టింగ్ ఏంటంటే ఆ పుస్త‌కంలో మొత్తం ఐదు డిఫెరెంట్ క‌థ‌లు ఉంటాయి. అలా కార్తీక (రెజీనా) ఆ పుస్త‌కంలోని క‌థ‌లు చ‌దువుతుంటే  అందులో ఉన్న పాత్ర‌లు దెయ్యాలుగా మార‌డం ప్రేక్ష‌కుల‌ను ఎంతో థ్రిల్లింగ్‌లో ప‌డేస్తుంది. అలా ఆ పాత్ర‌ల్లో ఒక‌టి త‌న ముందుకు వ‌స్తుంది. ఆదే కాజ‌ల్ పాత్ర. 

త‌న‌కు అన్యాయం చేసిన వారిపై ప‌గ తీర్చుకోడానికి కాజ‌ల్ దెయ్యంగా మారుతుంది. అదే విధంగా మ‌రో పాత్ర జ‌న‌నీ అయ్యర్ కూడా ప్రేక్ష‌కుల‌ను థ్రిల్‌కు గురిచేసే విధంగా ఉంటుంది. అలా అందులో ఉన్న పాత్ర‌ల‌న్నీ దెయ్యాల రూపంలో ఎలా ప‌గ తీర్చుకుంటాయి అనేదే ఈ సినిమా స్టోరీ.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleఈ వారం ఓటీటీలోకి టాప్ 5 సినిమాలు.. అస్స‌లు మిస్ అవ్వొద్దు
Next articleమొబైల్ వాడ‌కంలో త‌ప్ప‌క పాటించ‌వ‌ల‌సిన నియమాలు ఇవే.. లేదంటే మీ ఫోన్ పేలిపోవడం పక్కా