mushroom curry: మష్రూమ్‌ మసాలా కర్రీ.. పోషకాల పుట్ట

mushroom masala

mushroom curry in telugu: మష్రూమ్‌ మసాలా కర్రీ.. అదేనండి పుట్టగొడుగుల మసాలా కర్రీ.. ఇది రుచికరమైన రెసిపీ మాత్రమే కాకుండా పోషకాలతో కూడుకున్నది. ఇది వెజ్‌ బిర్యానీ, అన్నం, పూరి, చపాతీ.. ఇలా దేనితోనైనా కలిపి లాగించొచ్చు. రోజూ టమాట వంకాయ బెండకాయేనా అంటూ ఇంట్లో పిల్లలు విసుక్కుంటుంటే అప్పుడప్పుడు ఇది ట్రై చేసి వండిపెట్టండి. వాళ్ల రెస్పాన్స్‌ బాగుంటే మళ్లీ మళ్లీ వండేయండి.

బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను విరివిగా వాడుతారు. కొలెస్ట్రాల్‌ లేని ఆహారం ఇది. పొటాషియం, ఫైబర్, ప్రొటీన్, విటమిన్‌ బీ6, మెగ్నీషియం వంటి పోషకాలు మష్రూమ్‌లలో ఉంటాయి. అందుకే మష్రూమ్‌ మసాల కర్రీ ఎలా చేయాలో డియర్‌ అర్బన్‌ మీకు ప్రత్యేక కథనం అందిస్తోంది.

mushroom curry ingredients: మష్రూమ్‌ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు

  పావు కిలో మష్రూమ్‌

mushrooms

  2 టీస్పూన్ల నూనె
  అర టీస్పూన్‌ జీలక్ర
  రెండు బిర్యానీ ఆకులు
  దాల్చిని చెక్క
  మూడు యాలకులు, మూడు లవంగాలు
  ఒక ఉల్లిగడ్డ పేస్ట్‌
  అరకప్పు టమాటా పేస్ట్‌
  ఒక టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌
  రెండు టీ స్పూన్ల కారప్పొడి
  తగినంత ఉప్పు
  కొద్దిగా పసుపు
  ఒక టీ స్పూన్‌ ధనియాల పొడి
  జీడిపప్పు పేస్ట్‌
  కొత్తిమీర
  గరం మసాలా
  కసూరీ మేథి

mushroom curry recipe: మష్రూమ్ కర్రీ తయారీ విధానం

1. ముందుగా మష్రూమ్‌ (పుట్టగొడుగులు) పైపొట్టు తొలగించాలి. నైఫ్‌ ఉపయోగించి తీస్తే సులువుగా వస్తుంది. బొడిపెలాగా ఉండే కాండం కూడా తొలగించాలి. ఒకసారి నీటిలో వేసి శుభ్రపరిచి తీసేయండి. వాటిని మరీ చిన్నగా కాకుండా.. మరీ పెద్దగా కాకుండా ముక్కలుగా కట్‌ చేయండి.

2. స్టవ్‌ వెలిగించి పాన్‌ పెట్టి రెండు టీస్పూన్ల వంట నూనెను పోయండి. ముందుగా కట్‌ చేసి పెట్టుకున్న మష్రూమ్‌ (పుట్టగొడుగులు) ముక్కలను ఈ నూనెలో వేసి ఫ్రై చేయాలి. మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేస్తే మష్రూమ్‌లు పచ్చి పచ్చిగా ఉండకుండా టేస్టీగా మారుతాయి. ఫ్రై అయ్యాక వాటిని ఒక బౌల్‌లో పక్కన పెట్టుకోవాలి.

3. తిరిగి అదే పాన్‌లో మరో రెండు మూడు టీస్పూన్ల ఆయిల్‌ వేయాలి. అర టీ స్పూన్‌ జీలకర్ర, ఒకటి రెండు చిన్న బిర్యానీ ఆకులు, ఒక దాల్చిని చెక్క, రెండు మూడు యాలకులు, రెండు మూడు లవంగాలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి.

4. ఒక ఉల్లిగడ్డను గ్రైండ్‌ చేసుకుని పేస్ట్‌లా చేసి ఈ మిశ్రమంలో వేసి కలపాలి. ఉల్లిగడ్డ కాస్త బంగారు రంగులోకి మారుతుండగానే ఒక టీస్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి కలపాలి.

5. తరువాత ఒక అరకప్పు, అంతకంటే తక్కువగా టమాటా పేస్ట్‌ను కూడా వేసి కలపాలి.
ఫ్రై అయ్యే వరకు ఆగి ఆ తరువాత రెండు టీస్పూన్ల కారప్పొడి, కొద్దిగా పసుపు, ఒక టీస్పూన్‌ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. సిమ్‌లో పెట్టి రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి.

mushroom curry

6. ఆ తరువాత మష్రూమ్‌ వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు ఉడికిన తరువాత గ్రేవీ వచ్చేలా కొన్ని నీళ్లు పోసి కలపాలి. మష్రూమ్‌ ఉడుకుతున్న కొద్దీ ఈ నీళ్లు ఇంకిపోతాయి. ఇలా ఒక 8 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.

7. తరువాత మూతతీసి జీడిపప్పు పేస్ట్‌ వేసుకోవాలి. జీడిపప్పు పొడి ఉన్నా వాడుకోవచ్చు. అర టీస్పూన్‌ కసూరీ మేథి కూడా వేస్తే మష్రూమ్‌ మసాలా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మంచి ఫ్లేవర్‌ వస్తుంది. మరో మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి.

8. తదుపరి కొద్దిగా గరం మసాలా, తగినంత కొత్తిమీర వేసి కలపాలి. రెండు నిమిషాలు ఆగి మష్రూమ్ కర్రీ దించేయాలి.

mushroom masala curry

అంతేనండి. ఇక మష్రూమ్‌ మసాలా కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం. ఈ ఆదివారం ట్రై చేయండి.

mushroom Health benefits: మష్రూమ్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

మష్రూమ్ కొందరు చూడగానే పెదవి విరుస్తారు. కానీ పుట్టగొడుగుల్లో ఉండే పోషకాలు తెలిస్తే వారు తప్పకుండా మనసు మార్చుకుంటారు.

  1. అల్ట్రావయొలెట్ లైట్‌ వెలుతురులో పెంచే మష్రూమ్స్‌తో విటమిన్ డీ కూడా లభిస్తుంది. 
  2. మష్రూమ్ ఆరోగ్య ప్రయోజనాల్లో ముఖ్యమైనవి లో బ్లడ్ ప్రెషర్‌ను నయం చేయడం. వీటిలో ఉండే అధిక పొటాషియం నిల్వలు మన శరీరంపై సోడియం చూపే ప్రభావం చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది. రక్త నాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది.
  3. మష్రూమ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండి మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  4. అధిక బరువు ఉన్న వాళ్లు, బరువు తగ్గాలనుకునేవారు తరచుగా తమ డైట్‌లో మష్రూమ్స్‌ను చేర్చుకోవాలి.
  5. మష్రూమ్స్‌ (పుట్టగొడుగులు) లో సెలీనియం, కాపర్, థయామిన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు, లవణాలు ఉంటాయి.

– రచయిత: కిరణ్మయి, హైదరాబాద్

Here is a simple recipe for mushroom curry:

Ingredients:

  • 1 lb mushrooms, sliced
  • 1 onion, chopped
  • 2 cloves of garlic, minced
  • 1 tbsp ginger, grated
  • 1 tomato, chopped
  • 1 tsp cumin powder
  • 1 tsp coriander powder
  • 1 tsp turmeric powder
  • 1 tsp garam masala
  • 1 tsp salt
  • 1/2 tsp chili powder (optional)
  • 1 cup water
  • 1 tbsp oil
  • Fresh cilantro for garnish

Instructions:

  1. In a pan, heat the oil over medium heat.
  2. Add the chopped onions, minced garlic, and grated ginger. Cook until the onions are translucent, about 5 minutes.
  3. Add the chopped tomato and cook until it is soft and mushy, about 5 minutes.
  4. Add the cumin powder, coriander powder, turmeric powder, garam masala, salt, and chili powder (if using). Cook for another minute.
  5. Add the sliced mushrooms to the pan and mix well with the spice mixture. Cook for 5 minutes, stirring occasionally.
  6. Add the water to the pan and bring to a boil. Reduce the heat to low and let the curry simmer for 10-15 minutes, until the mushrooms are tender.
  7. Serve the mushroom curry hot, garnished with fresh cilantro. Enjoy with rice or flatbread!

Mushrooms health benefits

Mushrooms are a nutritious food that offer a variety of health benefits. Some of the health benefits of mushrooms include:

  1. Low in calories: Mushrooms are low in calories, making them a great food option for people watching their weight.

  2. Rich in nutrients: Mushrooms are rich in several essential vitamins and minerals, including potassium, selenium, and vitamin D.

  3. Boost immunity: Some types of mushrooms, such as shiitake and maitake, have been shown to boost the immune system and help fight off infections.

  4. Antioxidant properties: Mushrooms contain antioxidants, which help protect the body from damage caused by free radicals.

  5. Promote heart health: Mushrooms contain compounds that can help lower cholesterol levels and improve overall heart health.

  6. May help regulate blood sugar: Some studies suggest that mushrooms may help regulate blood sugar levels, making them a good food choice for people with diabetes.

  7. Anti-inflammatory properties: Mushrooms contain anti-inflammatory compounds, which can help reduce inflammation in the body and protect against various diseases.

It’s important to note that not all mushrooms are created equal, and some types may have different health benefits. It’s best to consult with a healthcare provider before making any changes to your diet.

మీకు బాగా నచ్చిన రెసిపీ ఏదైనా ఉంటే మాకు రాసి రెండు ఫోటోలతో పాటు పంపండి. మీ పేరు, ఫోటోతో సహా ప్రచురిస్తాం. మెయిల్ ఐడీ [email protected] 

ఇవి కూడా చదవండి

  1. టస్కాన్ పాస్తా ఎలా తయారు చేయాలి
  2. మఠర్ పన్నీర్ సబ్జీ తయారీ విధానం ఏంటి
  3. షీర్ ఖుర్మా సిద్ధం చేద్దాం ఇలా
  4. గూగుల్ ఫ్యామిలీ లింక్ ఖాతాలో పిల్లల బ్రౌజింగ్ సేఫ్

Previous articleహెలికాప్టర్ లో మేడారం జాతరకు వెళ్దామా
Next articleఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ క్రెడిట్ కార్డుతో ఉచితంగా ఇలా