Natu Kodi Pulao Recipe: నాటుకోడి పులావ్.. సింపుల్ రెసిపీ, స్పైసీ రుచి

natu kodi pulao recipe
నాటుకోడి పులావ్ రెసిపీ ఇలా సులువైన పద్ధతిలో చేయొచ్చు

Natu Kodi Pulao Recipe:  నాటుకోడి పులావ్ రుచి వేరే లెవెల్. నాటుకోడి కూర‌గా ఎంత రుచిగా ఉంటుందో పులావ్‌తో కూడా అంత‌కంటే రుచిని ఇస్తుంది. చాలామంది ఈ పులావ్ వండ‌డం అంటే ఎక్కువ శ్ర‌మ క‌లిగిన‌దిగా భావిస్తారు. నిజానికి దీనిని త‌యారు చేయ‌డం చాలా సులువు. కొద్ది స‌మ‌యంలోనే ఈజీగా చేసేయెచ్చు. ఎలా త‌యారు చేయాలో ఇక్క‌డ తెలుసుకోండి.

నాటుకోడి పులావ్ త‌యారీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు

  1. నాటుకోడి మాంసం – అర కిలో 
  2. బాస్మ‌తి బియ్యం – రెండు క‌ప్పులు 
  3. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
  4. ఉల్లిపాయ‌లు – పెద్ద‌వి రెండు 
  5. ప‌చ్చిమిర్చి – నాలుగు
  6. ట‌మాటో – రెండు 
  7. కారం – రెండు టేబుల్ స్పూన్లు
  8. ఉప్పు – తగినంత 
  9. ప‌సుపు – ఒక టీ స్పూన్
  10. దనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
  11. జీల‌క‌ర్ర పొడి – ఒక టేబుల్ స్పూన్ 
  12. గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్సూన్ 
  13. బిర్యానీ మ‌సాలా – ఒక టేబుల్ స్సూన్
  14. పెరుగు – పావు క‌ప్పు 
  15. కొత్తిమీర, పుదీనా – కొద్దిగా 
  16. నూనె – రెండు స్సూన్లు , నెయ్యి – రెండు స్పూన్లు
  17. బిర్యానీ మ‌సాలాలు: బిర్యానీ ఆకులు రెండు, యాల‌కులు – రెండు , నిమ్మ‌ర‌సం – త‌గినంత‌.

నాటు కోడి పులావ్ త‌యారీ విధానం

  1. ముందుగా బాస్మ‌తీ బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి అరగంట పాటు నాన‌బెట్టుకోవాలి. 
  2. ఆ త‌ర్వాత చికెన్‌ను శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. 
  3. ఇప్పుడ స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల నూనె, రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కాగనివ్వాలి.
  4. అందులో చికెన్ బిర్యానీ మ‌సాలాలు వేసి వేయించుకోవాలి. 
  5. ఇలా వేయించుకున్న దానిలో ఉల్లిపాయ‌ల‌ను స‌న్న‌గా పొడువుగా తురుముకుని వేసుకోవాలి. అలాగే ప‌చ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 
  6. అవి కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయేంత వ‌ర‌కూ వేగ‌నివ్వాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి.
  7. త‌ర్వాత ట‌మాటో ముక్క‌ల‌ను వేసుకోవాలి. అవి కొద్దిగా మ‌గ్గిన త‌ర్వాత స‌రిప‌డా ఉప్పు, కారం, ప‌సుపు వేసుకుని క‌లుపుకోవాలి. త‌ర్వాత పెరుగును కూడా వేసుకుని క‌లుపుకోవాలి.
  8. ఆపై చికెన్‌ను వేసుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని 20 నిమిషాలు పాటు మ‌గ్గ‌నివ్వాలి. ఇలా మ‌గ్గిన త‌ర్వాత దానిలో ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, బిర్యానీ మ‌సాలా వేసుకుని బాగా క‌లుపుకోవాలి. 
  9. ఇలా క‌లుపుకున్న త‌ర్వాత అందులో రెండు క‌ప్పుల బిర్యానీకి మూడు గ్లాసుల నీటిని పోయాలి. 
  10. ఆ నీరు బాగా మరిగిన త‌ర్వాత అందులో నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం వేసుకోవాలి. ఆపై మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. అంతే నాటుకోడి పులావ్ రెడీ. య‌మ్మీ య‌మ్మీగా స్పైసీగా తినేయ‌చ్చు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleManila Tamarind: సీమ‌చింత‌కాయతో ఈ వేస‌వి కాలంలో ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు
Next articlePrawns Curry Recipe: రొయ్య‌ల కూర ఇలా చేస్తే ఇష్టంగా తింటారు..