రెడ్‌ మి నోట్‌ 10 ప్రో మాక్స్‌ సహా 3 కొత్త మొబైల్స్‌ విడుదల

red mi note 10 pro max

రెడ్‌ మి నోట్‌ 10 ప్రో మాక్స్, రెడ్‌ మి నోట్‌ 10 ప్రో, రెడ్‌ మి నోట్‌ 10 ఫోన్లను షియామీ మొబైల్స్‌ ఇండియాలో లాంచ్‌ చేసింది. మిడ్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో అత్యున్నత ఫీచర్లు అందిస్తూ విశేష ఆధరణ పొందిన రెడ్‌ మి నోట్‌ సిరీస్‌లో తాజా ఆవిష్కరణ కూడా కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఎంఐ.కామ్‌/ఇన్, అమెజాన్‌.ఇన్‌ వెబ్‌సైట్లలో వీటి అమ్మకాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంఐ సైట్‌లో ఐసీఐసీఐ కార్డ్‌పై రూ 500 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఉంటుంది.

రెడ్‌ మి నోట్‌ 10 ప్రో మాక్స్‌

రెడ్‌ మి నోట్‌ 10 సిరీస్‌లో రెడ్‌ మి నోట్‌ 10 ప్రో మాక్స్‌ టాప్‌ మోడల్‌. దీనిలో అద్భుతమైన 108 మెగాపిక్సెల్‌ క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఇది థర్డ్‌ జనరేషన్‌ హెచ్‌ఎం2 108 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ అల్ట్రా–వైడ్‌ యాంగిల్‌ లెన్స్, 118 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూ, 5 ఎంపీ సూపర్‌ టెలి–మాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌లను కలిగి ఉంది.

red mi 10 note pro max

16.9 సెంటిమీటర్ల (6.67 ఇంచులు) డిస్‌ప్లే కలిగి ఉంది. ఎఫ్‌హెచ్‌డీ + సూపర్‌ అమోలెడ్‌ అల్ట్రా బ్రైట్‌ డిస్‌ ప్లే కలిగి ఉంది.

క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732 జి ప్రాసెసర్‌ ఈ స్టార్ట్‌ఫోన్‌ పనితీరు, సామర్థ్యం యొక్క సంపూర్ణ సమతుల్యతను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ ఎలైట్‌ గేమింగ్‌ ఫీచర్లతో వచ్చే అడ్రినో 618 జీపీయూ గేమింగ్‌ అనుభవం అద్భుతంగా ఉంటుందని షియామీ సంస్థ తెలిపింది.

భారీ 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 11.5 గంటలు నాన్‌స్టాప్‌ గేమ్‌ ఆడొచ్చని వివరించింది. ఈ స్టార్ట్‌ ఫోన్‌ 33 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జర్‌తో వస్తుంది. భారీ సామర్థ్యం గల బ్యాటరీకి తగినట్టుగా వేగంగా ఛార్జింగ్‌ చేస్తుంది.

ఆల్‌–న్యూ ఎవాల్‌ డిజైన్‌.. డిజైన్‌లో సమూల మార్పును తెచ్చినట్టు షియామీ తెలిపింది. ఈ కొత్త డిజైన్‌తో పాటు వింటేజ్‌ బ్రాంజ్, గ్లేసియల్‌ బ్లూ, డార్క్‌ నైట్‌ వంటి అద్భుతమైన కొత్త రంగులను సృష్టించింది.

రెడ్‌ మి నోట్‌ 10 ప్రో మాక్స్‌ 8.1 మిమీ మందం కలిగి 192 గ్రాముల బరువుతో ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 తో వస్తుంది. ఇది స్మడ్జ్‌ ప్రూఫ్‌ 3డీ కర్వ్‌డ్‌ ఫ్రాస్టెడ్‌ గ్లాస్‌ బ్యాక్‌ దీనికి అధునాతన రూపాన్ని ఇస్తుంది.

హై–రెస్‌ సర్టిఫైడ్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లలో ధ్వని అద్భుతంగా ఉంటుందని సంస్థ వివరించింది.
note pro max
డబుల్‌–ట్యాప్‌ హావభావాలతో కూడిన ఫ్లష్‌ డిజైన్‌ సైడ్‌–మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ మరియు హెచ్‌– హాప్టిక్‌ మోటారు వివిధ నోటిఫికేషన్ల కోసం 150 రకాల వైబ్రేషన్లను ఇస్తుంది.

8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ గల రెడ్‌ మి నోట్‌ 10 ప్రో మాక్స్‌ ధర రూ. 21,999
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ గల రెడ్‌ మి నోట్‌ 10 ప్రో మాక్స్‌ ధర రూ. 19,999
6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ గల రెడ్‌ మి నోట్‌ 10 ప్రో మాక్స్‌ ధర రూ. 18,999

రెడ్‌ మీ నోట్‌ 10 ప్రో మోడల్‌

రెడ్‌ మీ నోట్‌ 10 ప్రో మొబైల్స్‌ ఈనెల 17 నుంచి అమ్మకానికి రానున్నాయి. దీనిలో 64 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ గల రెడ్‌ మి నోట్‌ 10 ప్రో ధర రూ. 18,999
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ గల రెడ్‌ మి నోట్‌ 10 ప్రో ధర రూ. 16,999
6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ గల రెడ్‌ మి నోట్‌ 10 ప్రో ధర రూ. 15,999

రెడ్‌ మీ నోట్‌ 10 మోడల్‌

రెడ్‌ మీ నోట్‌ 10 ప్రో మొబైల్స్‌ ఈనెల 16 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనిలో 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 678 జీ ప్రాసెసర్‌ ఉంటుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ గల రెడ్‌ మి నోట్‌ 10 ధర రూ. 13,999
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ గల రెడ్‌ మి నోట్‌ 10 ధర రూ. 11,999

Previous articleస్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?
Next articleఎలన్ మస్క్ …  ఓటమే అతడి మొదటి మెట్టు