ఈ వారం థియేట‌ర్- ఓటీటీ లో విడుదలవుతున్న చిత్రాలు ఇవే

red cinema chair
ఈవారం విడుదలయ్యే సినిమాలు Photo by Felix Mooneeram on Unsplash

ఈ వారం థియేట‌ర్స్‌లో చిన్న చిత్రాల హంగామా మొద‌లుకానుంది. అలాగే ఓటీటీలో హిట్ చిత్రాలు రానున్నాయి. గ‌త రెండు వారాల నుంచి థియేటర్లలో పెద్ద చిత్రాల హ‌వా కొన‌సాగుతుండ‌గా ఈ వారం మాత్రం థియేట‌ర్ మ‌రియు ఓటీటీలో చిన్న సినిమాలు రాబోతున్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఫ్యామిలీస్టార్, బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు బద్ద‌లుకొట్టిన టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు గత వారంలో ప్రేక్ష‌కులకు వినోదాన్ని అందించ‌గా ఈ వారం చిన్న సిన‌మాలు ఈ వేసవిలో వినోదాన్ని అందిచ‌నున్నాయి. 

అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఎన్నో చిత్రాల‌తో రెడీ అవుతున్నాయి. మ‌రి  ఈ వారంలో ఎలాంటి సినిమాలు థియేట‌ర్, ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయో చూసేయండి.

గీతాంజలి మళ్లీ వచ్చింది

ప్ర‌ముఖ న‌టి అంజ‌లి ప్ర‌ధాన పాత్రగా న‌టించిన చిత్రం గీతాంజ‌లి. ఒక ప‌క్క భ‌యం మ‌రో ప‌క్క కామెడీతో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించే ఈ చిత్రానికి సీక్వేల్‌ గీతాంజలి మళ్లీ వచ్చిందిగా మ‌ళ్లీ ఆడియ‌న్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా అలీ, స‌త్యం రాజేశ్, సునీల్, శ్రీ‌నివాస్ రెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేట‌ర్లలో విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ సినిమా హార్ర‌ర్, కామెడీ చిత్రంగా ఉండ‌బోతుంద‌ని చిత్ర యూనిట్ వివరించింది. మొద‌టి గీతాంజ‌లి క‌థ ఎక్క‌డైతే ముగిసిందో ఇప్పుడు వ‌స్తున్న సీక్వెల్ కూడా అక్క‌డి నుంచే ప్రారంభ‌మ‌వుతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. 

మైదాన్

అజ‌య్ దేవ‌గ‌ణ్, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టిస్తున్న చిత్రం మైదాన్. ఈ సినిమాలో అజ‌య్ దేవ‌గ‌ణ్ భార‌త ఫుట్‌బాల్ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీంగా న‌టించారు. రంజాన్ సంద‌ర్భంగా ఈ మూవీ ఏప్రిల్ 10 న విడుద‌లైంది. ఫుట్‌బాల్ కోచ్ ఆట‌గాళ్లకు ఎలాంటి స్పూర్తిని నింపాలో, ఎలాంటి ఆలోచ‌న‌ల‌ను అందించాలో, నేర్పుగా ఎలా విజ‌యాన్ని సాధించాలో ఈ సినిమా ద్వారా చూపించారు. దానికి అజ‌య్ దేవ‌గ‌ణ్ మంచి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌లో కూడా స్ఫూర్తి వ‌చ్చే విధంగా న‌ట‌న‌ను క‌న‌బ‌ర్చారు. ఈ  చిత్రానికి అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా బోనీ క‌పూర్ నిర్మాత‌గా వ్య‌వ‌హరించారు.

బడేమియా ఛోటేమియా

బాలీవుడ్ న‌టులు అక్ష‌య్‌కుమార్, టైగ‌ర్ ష్రాఫ్ క‌లిసి న‌టించిన చిత్రం బ‌డేమియా ఛోటేమియా. ఈ సినిమా యాక్ష‌న్ త‌ర‌హాలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతుంది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 10 న థియేట‌ర్‌లో అడుగుపెట్టింది. అలాగే ఈ సినిమాలో జాన్వీ క‌పూర్, మానుషీ చిల్ల‌ర్, పృథ్వీరాజ్ సుకుమార‌న్ త‌దిత‌రులు న‌టించారు. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

లవ్ గురు

విజ‌య్ ఆంటోని స్వయంగా నిర్మించిన చిత్రం ల‌వ్ గురు. ఈయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కు చిరునామాగా నిలిచారు. ప్ర‌స్తుతం ఈయ‌న  రొమాంటిక్ ఏంగిల్‌లో ల‌వ్ గురు అనే చిత్రం ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాలిని ర‌వి హీరోయిన్‌గా న‌టించ‌నున్నారు. అలాగే వినాయ‌క్ వైద్య‌నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇది కూడా రంజాన్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 11న థియేట‌ర్‌లో విడుద‌ల కానుంది. 

డియర్ మూవీ

భార్య గుర‌క పెడితే భ‌ర్త ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో, దాంతో వారి జీవితంలో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలిపే కుటుంబ క‌థే ఈ డియ‌ర్ చిత్రం. ఈ సినిమాలో జీవీ ప్ర‌కాష్‌కుమార్, ఐశ్వ‌ర్య  క‌థానాయ‌కులుగా న‌టించారు. ఈ సినిమా చాలా వినోదాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు ఆనంద్ ర‌విచంద్ర‌న్ తెర‌కెక్కించారు. త‌మిళంలో ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుద‌ల అవ‌గా ఇప్పుడు తెలుగులో ఏప్రిల్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్, ఏషియ‌న్ సినిమాస్ తెలుగులో విడుద‌ల చేస్తున్నాయి.

ఓటీటీలో ఈవారం విడుద‌ల అయ్యే సినిమాలు:

స‌న్‌నెక్ట్స్:

1.లాల్ స‌లామ్ ( తిమిళం, తెలుగు )- ఏప్రిల్ 12

సోనీలివ్:

  1. అదృశ్యం ( హిందీ సిరీస్ ) – ఏప్రిల్ 11

ల‌య‌న్స్ గేట్ ప్లే:

  1. హైటౌన్ ( వెబ్‌సిరీస్ ) – ఏప్రిల్ 12

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్:

  1. బ్ల‌డ్ ఫ్రీ ( కొరియ‌న్) – ఏప్రిల్ 10
  2. ది గ్రేటెస్ట్ హిట్స్ ( హాలీవుడ్ ) – ఏప్రిల్ 12
  3. ప్రేమ‌లు ( మ‌ల‌యాళం) – ఏప్రిల్ 12

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleశ్రీ క్రోధి నామ సంవ‌త్స‌ర ఉగాది రాశి ఫలాలు: మీ జాతకం ఎలా ఉందో చూడండి
Next articleఇంట‌ర్ విద్యార్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు మొత్తం పోస్టులు 3,712