Avoid water after eating these fruits: ఈ ఫ్రూట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదట ఎందుకో తెలుసా?

fruits
కొన్ని రకాల పండ్లు తిన్న తరువాత వెంటనే నీళ్లు తాగకూడదు (Pixabay)

Avoid water after eating these fruits: కొన్ని రకాల పండ్లు తిన్న వెంటనే నీటిని తాగితే మీరు పలు జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. అలాగే పండ్లు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే కొన్ని పండ్లు తిన్న తరువాత మాత్రం నీరు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు.

మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతారు. అది చిన్న నాటి అలవాటు. అయితే చాలామంది వాటర్ కంటెంట్ ఉన్న పండ్లు తిన్న తర్వాత కూడా నీటిని తాగుతారు. ఇది శరీరానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు అంటున్నారు. ఈ ప్రక్రియ మీ శరీరంలో pH స్థాయిలను దెబ్బతీస్తుంది. తద్వారా మీ జీర్ణ క్రియ మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు అస్సలు నీటిని తీసుకోవద్దంటున్నారు. ఇంతకీ ఏ పండ్లు తిన్నప్పుడు నీరు తాగకూడదో.. ఎందుకు నీటిని తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

పుచ్చకాయలు తిన్నాక..

పుచ్చకాయలు, మస్క్ మెలాన్ వంటివి తిన్న తర్వాత నీటిని తాగితే మీ జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది వివిధ రకాల జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తుంది. ఈ పండ్లలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇవి తిన్న తర్వాత నీటిని తాగితే కడుపు ఉబ్బరంగా, భారంగా ఉంటుంది. అందుకే వీటిని తిన్న తర్వాత నీటిని తాగడం మానేయాలి అంటున్నారు.

జామ కాయ తిన్న వెంటనే..

జామపండు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల అసిడిటీ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ మీ జీర్ణవ్యవస్థలోని pH స్థాయిలను ఇబ్బంది పెడుతుంది. దీనితో జీర్ణ క్రియ కాస్త మందగిస్తుంది. ఇది మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం కాదు. అందుకే జామపండు తిన్న తర్వాత కనీసం 30 నుంచి 45 నిమిషాలు తర్వాత నీరు తాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అరటిపండ్లు తిన్న తర్వాత..

చాలామంది ఆరోగ్య నిపుణులు అరటిపండ్లు తిన్న తర్వాత నీరు తాగకూడదంటున్నారు. ముఖ్యంగా ఐస్ వాటర్ తాగకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మీ శరీరంలో జీర్ణ సమస్యలకు దారి తీస్తుందట. ఎందుకంటే నీరు అరటిపండు జీర్ణమయ్యే ప్రక్రియను మందగించేలా చేస్తుంది. తద్వారా గ్యాస్, ఉబ్బరం కలుగుతుంది. కాబట్టి మీరు అరటిపండు తిన్న తర్వాత కనీసం 15 నుంచి 20 నిముషాలు గ్యాప్ తీసుకోవాలి అంటున్నారు.

బొప్పాయి..

మీ జీర్ణక్రియను మెరుగుపరిచే అత్యంత అద్భుతమైన పండ్లలో బొప్పాయి ఒకటి. అయితే దీనిని తిన్న వెంటనే నీటిని తీసుకుంటే అది విరేచనాలకు దారితీస్తుంది. అంతేకాకుండా వికారంతో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పికి కూడా దారి తీస్తుంది అంటున్నారు.

Previous articleIdependence day 2023: స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
Next articleRaw milk benefits for skin: పచ్చిపాల యవ్వనాన్ని పొందాలనుకుంటే దీనిని ట్రై చేయండి