హెలికాప్టర్ లో మేడారం జాతరకు వెళ్దామా

sammakka sarakka jatara

మేడారం జాతరకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వెళ్లొచ్చని తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ సంస్థ డైరెక్టర్ భరత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.’ఆసియా లో అతిపెద్ద జాతర మేడారం జాతర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏవియేషన్ సంస్థ నుండి హెలికాప్టర్ సర్వీస్ లు ఇవ్వాళ ప్రారంభం అయ్యాయి.

ఇప్పటికే బుకింగ్ స్టార్ట్ అయింది. రోజుకు 3 నుండి 5 ట్రిప్ లు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి మేడారం కు హెలికాప్టర్ సర్వీస్ లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో ట్రిప్ లో 6 మంది ప్రయాణం చేయవచ్చు. దీనికి రూ. 1 లక్ష 80 వేలు ఉంటుంది. మేడారం లో కూడా జాయ్ రైడ్ చేయవచ్చు. ఒక్కరికి రూ. 2999 ధర ఉంది. హెలికాప్టర్ సర్వీస్ లను ఆన్లైన్ లో helitaxii వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 9400399999 నెంబెర్ కు కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు.

గత జాతరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హెలికాప్టర్ సర్వీస్ స్టార్ట్ చేస్తే అనూహ్య స్పందన వచ్చింది. ఈసారి కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు మేడారం జాతరకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ సర్వీస్ స్టార్ట్ చేశాం.

ఇప్పటికే బుకింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు హెలికాప్టర్ సర్వీస్ లు మేడారం కు అందుబాటులో ఉంటాయి. ఇది సాధారణ భక్తులకు మంచి అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ..” అని భరత్ రెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి

Previous articleఓ పిట్టకథ .. ఇట్స్‌ ఏ లాంగ్‌ స్టోరీ
Next articlemushroom curry: మష్రూమ్‌ మసాలా కర్రీ.. పోషకాల పుట్ట