Freekance jobs: ఫ్రీలాన్స్ జాబ్, రిమోట్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కు ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది. ఆఫర్లు కూడా పెరిగాయి. చాలా మంది ఇంట్లోనే కూర్చొని ఈ ఫ్రీలాన్స్ జాబ్ ద్వారానే లక్షలు సంపాదించేస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఈ ఫ్రీలాన్స్ జాబ్స్‌కు క్రేజ్ పెరిగిపోయింది. హాయిగా ఇంట్లో ఉంటూ నచ్చిన సమయంలో పని చేస్తూ రెండు చేతులా సంపాదించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు.
పైగా ఫ్రీలాన్స్ చేయాలని, రిమోట్ జాబ్ చేయాలని అనుకునేవాళ్లకు అలాంటి జాబ్స్ వెతికి పెట్టడానికి కావాల్సినన్ని వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ జాబ్స్ కోసం ట్రై చేసినట్లే ఈ వెబ్‌సైట్స్ ద్వారా ఫ్రీలాన్స్ జాబ్ ఆఫర్ చేస్తున్న కంపెనీలనూ వెతికి పట్టుకోవచ్చు.
ఎందుకీ ఫ్రీలాన్స్ జాబ్స్ (freelance jobs)?
పేరులోనే ఉన్నట్లు స్వేచ్ఛగా ఎక్కడి నుంచైనా చేసుకునే అవకాశం ఉన్న జాబ్స్ ఇవి. రోజూ ఆఫీసుకెళ్లి పని చేయడం ఎందుకు అని అనుకునే వాళ్లకైనా లేక అదనపు ఆదాయం కోసం చూస్తున్న వాళ్లకైనా ఈ ఫ్రీలాన్స్ జాబ్స్ పనికొస్తాయి. ఇండియాలో ఒకప్పుడు వీటిని పెద్దగా పట్టించుకునే వాళ్లే లేరు. కానీ ఇప్పుడు ఈ ఫ్రీలాన్సింగ్ కూడా మిగతా వాటికి దీటుగా ఎదుగుతున్న ఇండస్ట్రీగా మారిపోయింది. ఫ్రీలాన్సింగ్‌లోనూ ఫుల్‌టైమ్ లేదా పార్ట్‌టైమ్ జాబ్స్ ఉంటాయి. మీ వీలును బట్టి చేసుకోవచ్చు.
ప్రతి నలుగురిలో ఒకరిది రిమోట్ జాబ్ (remote jobs)
మన దేశంలో ఫ్రీలాన్స్ జాబ్స్ freelance jobs కు ఎంతలా క్రేజ్ పెరిగిపోయిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఫ్రీలాన్సర్లలో ఒకరు ఇండియాకు చెందినవాళ్లేనని లేటెస్ట్ సర్వేలో తేలింది. వీళ్ల సంపాదన కూడా మామూలుగా ఏమీ లేదు. సగటున ఏడాదికి ఒక్కో ఫ్రీలాన్సర్ రూ. 19 లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్లలో ఏడాదికి రూ. 45 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్లూ ఉన్నారు.
రెగ్యులర్ 9 టూ 5 జాబ్స్‌లో ఇంత సంపాదిస్తున్న వాళ్లు ఎంత మంది ఉంటారు? దీనినిబట్టే ఫ్రీలాన్స్ జాబ్స్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రస్తుతం దేశంలో 50 కోట్ల మందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. అర్బన్ ఏరియాల్లో 62 శాతం, రూరల్ ఏరియాల్లో 50 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఫ్రీలాన్స్ జాబ్స్‌కు డిమాండ్ పెరగడానికి ఇదే ప్రధాన కారణం.
ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఆన్‌లైన్‌లో సంపాదించాలి అనుకునేవాళ్లకు కూడా ఈ ఫ్రీలాన్సింగ్ బెస్ట్ ఆప్షన్. మీకూ ఫ్రీలాన్స్ చేయాలని ఉంటే ఇప్పుడు డియర్ అర్బన్.కామ్ చెప్పబోయే ఈ బెస్ట్ ఫ్రీలాన్స్ జాబ్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి మీకు నచ్చిన జాబ్ వెతుక్కోండి.
అప్‌వర్క్ ఫ్రీలాన్స్ జాబ్స్ (upwork freelance jobs
ఇంట్లో నుంచే పని చేయాలని అనుకుంటే ఈ వెబ్‌సైట్ మీకు మంచి చాయిస్. ఇండియాలో ఫ్రీలాన్సర్స్‌కు మంచి మంచి పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లు ఇస్తున్న వెబ్‌సైట్ ఇది. ఇది అమెరికాకు చెందిన జాబ్ వెబ్‌సైట్. ప్రపంచ నలుమూలల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ వెబ్‌సైట్ కావడంతో పేమెంట్స్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లే ఉంటాయి.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, రైటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, ఇంజినీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లాంటి రంగాల్లో ఫ్రీలాన్స్ జాబ్స్‌ను వెతుక్కోవచ్చు. ఇందులో ఫ్రీగా మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఫ్రీలాన్స్ వర్క్ మీరు చేస్తే ఆ మొత్తంలో కొంత శాతం అప్‌వర్క్ తీసుకొని మిగతా డబ్బు మీకు ఇస్తుంది. దీంతో ఇందులో ఎలాంటి మోసం ఉండే అవకాశం లేదు. ఫ్రీలాన్స్ జాబ్ కావాలని అనుకుంటే.. అప్ వర్క్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఫ్రీలాన్సర్.కామ్ Freelancer.com freelance jobs
కొత్తగా ఫ్రీలాన్స్ జాబ్ మొదలుపెట్టాలని అనుకుంటున్న వాళ్లు ఈ ఫ్రీలాన్సర్.కామ్‌లో సైనప్ కావచ్చు. మీ ఈమెయిల్ లేదా ఫేస్‌బుక్ ఐడీతో ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగానే మీకు ఆసక్తి, నైపుణ్యం ఉన్న వివిధ రంగాలను ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రీలాన్సర్ కల్పిస్తోంది. ఏ రంగంలో ఎన్ని జాబ్స్ ఉన్నాయన్నది కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది.
గరిష్ఠంగా 20 ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. సైనప్ అయిన తర్వాత మీరు ఎంపిక చేసుకున్న ఆప్షన్లలో ఎవరెవరు ఏయే జాబ్ ఆఫర్లు ఇస్తున్నారు. వాటికి సంబంధించిన పేమెంట్స్ గురించి వివరంగా చూసుకోవచ్చు. తొలిసారి ఓ జాబ్ రావడం కాస్త కష్టంగానే ఉంటుంది. తర్వాత మీ ప్రొఫైల్ బలం పెరిగిన కొద్దీ చాలా ఆఫర్లు వస్తుంటాయి.
ఇందులో ప్లస్ మెంబర్‌షిప్ కూడా ఉంటుంది. తొలి 30 రోజులు ఉచితంగా దీనిని వాడుకోవచ్చు. తర్వాత నెలకు రూ. 729 చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా మీ ఫ్రొఫైల్‌ను ఫ్రీలాన్సర్ వీలైనన్ని ఎక్కువ టాప్ కంపెనీలకు చేరవేస్తుంది. దీంతో మీకు వచ్చే ఆఫర్లు కూడా మెరుగ్గా ఉంటాయి. ఫీలాన్సర్ వెబ్‌సైట్ లో
ట్రూలాన్సర్ Truelancer freelance jobs
ఇండియన్స్‌కు ఇది బెస్ట్ ఫ్రీలాన్స్ జాబ్ freelance jobs వెబ్‌సైట్. కేవలం మన దేశంలో ఉన్న ఫ్రీలాన్స్ మార్కెట్‌పైనే దృష్టి సారిస్తున్న సైట్ ఇది. మన నైపుణ్యాలు కావాల్సిన అవసరమైన విదేశీ కంపెనీలలోనూ ఫ్రీలాన్స్ జాబ్స్ కోసం వెతుక్కునే అవకాశం ఉంటుంది. మీరున్న లొకేషన్‌ను బట్టి కూడా అక్కడ అందుబాటులో ఉన్న ఫ్రీలాన్స్ జాబ్స్ చూసుకోవచ్చు.
ఇక ఈ సైట్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. వాళ్లతో రిజిస్టర్ చేసుకున్న ఫ్రీలాన్సర్లకు ఎప్పటికప్పుడు కొన్ని పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. వీటిలో మంచి ప్రదర్శన చేయడం ద్వారా మీ సత్తా ఏంటో కంపెనీలకు తెలియజేసే వీలుంటుంది. దీంతో మీ మార్కెట్ వాల్యూ పెరిగి ఉద్యోగం పొందే అవకాశాలు మరింత మెరుగవుతాయి. లోగో డిజైన్, మొబైల్ యాప్ డిజైన్, జువెలరీ డిజైన్, వెబ్‌సైట్ మాకప్‌లాంటి కంటెస్ట్‌లను నిర్వహిస్తారు.
మిగతా ఫ్రీలాన్స్ జాబ్ వెబ్‌సైట్స్‌తో పోలిస్తే ఈ ఫీచర్ ట్రూలాన్సర్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇందులో మీ ఫేస్‌బుక్, గూగుల్ లేదా లింక్డిన్ అకౌంట్‌తో లాగిన్ కావచ్చు. ట్రూలాన్సర్ వెబ్సైట్లో
వర్క్‌ఎన్‌హైర్ Worknhire freelance jobs
ఫ్రీలాన్స్ జాబ్ freelance jobs వెబ్‌సైట్లలో ఈజీగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండే వెబ్‌సైట్స్‌లో ఈ వర్క్‌ఎన్‌హైర్ ముందు వరసలో ఉంటుంది. ఎలాంటి గజిబిజి లేకుండా ఎవరైనా సింపుల్‌గా వాడుకోవచ్చు. ట్రూలాన్సర్‌లాగే ఇండియన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ వెబ్‌సైట్ ఇది.
మీ నైపుణ్యం, మీకు కావాల్సిన జీతం, పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్, సదరు సంస్థ ఆ ప్రాజెక్ట్ కోసం ఎప్పుడు ప్రకటన ఇచ్చిందన్న అంశాల ఆధారంగా ఫ్రీలాన్స్ జాబ్‌ను వెతుక్కునే అవకాశం ఈ వర్క్‌ఎన్‌హైర్‌లో ఉంటుంది. ఫ్రీలాన్స్ జాబ్స్‌లోనూ మీకు ఎలాంటి ఉద్యోగం కావాలో కూడా ఎంపిక చేసుకోవచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆన్‌లైన్ జాబ్స్, పార్ట్‌టైమ్ జాబ్స్‌లాంటి కేటగిరీలు ఇందులో ఉంటాయి.
ఐటీ అండ్ ప్రోగ్రామింగ్, గ్రాఫిక్ డిజైన్, కాంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ, మార్కెటింగ్‌లాంటి రంగాల్లో ఫ్రీలాన్స్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. వర్క్ ఎన్ హైర్ లోకి వెళ్లి ఫ్రీలాన్సర్‌గా రిజిస్టర్ చేసుకోండి.
ఫైవర్ Fiverr freelance jobs
రెగ్యులర్ ఫ్రీలాన్స్ జాబ్స్‌తోపాటు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన జాబ్స్ ఈ వెబ్‌సైట్ ప్రత్యేకత. అంటే మీ వ్యక్తిగత నైపుణ్యాలను కూడా మీరు సొమ్ము చేసుకోవచ్చు.
ఉదాహరణకు ట్రావెలింగ్ ఎక్స్‌పర్ట్, ఆర్ట్స్, హెల్త్, ఆస్ట్రాలజీ, ఆన్‌లైన్ లెసన్స్‌లాంటివి. వీటితోపాటు గ్రాఫిక్స్ అండ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, రైటింగ్, ట్రాన్స్‌లేషన్, ప్రోగ్రామింగ్, బిజినెస్ సెక్టార్లలో కూడా ఫ్రీలాన్స్ జాబ్స్ వెతుక్కోవచ్చు. మీకు ఫ్రీలాన్స్ ఉద్యోగం కావాలన్నా లేక మీరు ఓ ఫ్రీలాన్సర్ కోసం వెతుకుతున్నా ఇది బెస్ట్ వెబ్‌సైట్ అన్నది చాలా మంది ప్రొఫెషనల్స్ అభిప్రాయం.
పైగా మీ ఫ్రెండ్స్‌కు ఈ వెబ్‌సైట్‌ను రిఫర్ చేసి కూడా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఫివర్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి.
పీపుల్‌పర్‌హవర్ PeoplePerHour freelance jobs
ఇండియాలో ఉన్న బెస్ట్ ఫ్రీలాన్స్ జాబ్ వెబ్‌సైట్స్‌లో ఈ పీపుల్ పర్ హవర్ కూడా ఒకటి. పేరులోనే ఉన్నట్లు ఇందులో గంటల చొప్పున పనికి వేతనం పొందే వీలుంటుంది. ఇక డబ్బు విషయంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఈ వెబ్‌సైట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పని కావాలనుకుంటున్న సంస్థ నుంచి ఆ పనికి సంబంధించి కొంత మొత్తం ముందుగానే డిపాజిట్ చేయించుకుంటుంది. పని పూర్తయిన తర్వాత పూర్తిగా పరిశీలించి ఆ డబ్బును రిలీజ్ చేస్తుంది. ఇటు ఫ్రీలాన్సర్లు చేసిన పని కూడా సంస్థ అవసరాలకు తగినట్లు ఉందా లేదా అన్నది కూడా ఈ వెబ్‌సైటే చూస్తుంది.
ఫ్రీలాన్స్ ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ల కంటే ఫ్రీలాన్సర్ల కోసం వెతుకుతున్న సంస్థలకు ఈ వెబ్‌సైట్ బాగా ఉపయోగపడుతుంది. పీపుల్ పర్ హవర్
యూత్4వర్క్ youth4work freelance jobs
ఇది కూడా ట్రూలాన్సర్‌లాంటి ఫ్రీలాన్స్ జాబ్ వెబ్‌సైటే. ఇక్కడ కూడా ముందుగానే మీ స్కిల్స్ ఆధారంగా కొన్ని టెస్ట్‌లు నిర్వహిస్తారు. మీరు ఆ టెస్ట్‌లో ఎంత స్కోరు చేశారో మీ ప్రొఫైల్‌లో ఉంచుతారు. దీంతో మిమ్మల్ని హైర్ చేసుకోవాలనుకునే ఎంప్లాయర్ ఆ స్కోరును బట్టి మీ టాలెంట్ అర్థం చేసుకోగలరు. దీనివల్ల ఇటు ఫ్రీలాన్సర్‌కు అవకాశాలు పెరగడంతోపాటు అటు ఎంప్లాయర్‌కు సరైన ఉద్యోగి దొరికే వీలుంటుంది.
మీరు సైట్‌లోకి వెళ్లగానే టెస్ట్ యువర్‌సెల్ఫ్ అనే కేటగిరీ మీకు కనిపిస్తుంది. టాలెంట్ టెస్ట్, ప్రిపరేషన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, టైపింగ్ టెస్ట్‌లాంటివి కనిపిస్తాయి. టాలెంట్ టెస్ట్‌లో మీ నైపుణ్యాన్ని బట్టి అంటే ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్‌లాంటి టెస్టులు నిర్వహిస్తారు.
ఈ టెస్ట్ స్కోరు మీ ప్రొఫైల్‌కు మరింత బలాన్ని తెస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ 4 వర్క్ లో
రిమోట్ జాబ్స్ remote jobs అందించే సైట్లు మరెన్నో..
వీ వర్క్ రిమోట్లీ, ఏంజెల్, రిమోటివ్, టూరింగ్, ఫ్రీలాన్స్‌ఇండియా (freelance India), ఆన్‌కాంట్రాక్ట్ (on contract), డిజైన్‌హిల్ (design hill)లాంటి ఫ్రీలాన్స్ జాబ్ వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికితోడు రెగ్యులర్ జాబ్ వెబ్‌సైట్స్ అయిన షైన్, లింక్డిన్, ఇండీడ్‌లాంటి వాటిలోనూ ఫ్రీలాన్స్ జాబ్స్ వెతుక్కోవచ్చు.
హాబీ ద్వారా కూడా మనం ఫ్రీలాన్స్ రూపంలో డబ్బులు సంపాదించొచ్చంటే ఆశ్చర్యపోకండి. ఉదాహరణకు మీకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం అనుకోండి.. మీరు తీసే ఫొటోలను కొన్ని వెబ్ సైట్లలో అమ్మేయొచ్చు. దీనిపై డియర్ అర్బన్ మీకు ప్రత్యేక కథనం కూడా అందిస్తోంది. హాబీలతో ఆదాయ మార్గాలు ఇవే అన్న కథనంలో సమగ్ర వివరాలు ఉన్నాయి.
ఇక పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సేవారంగంలో కొత్త తరహా వెబ్ సైట్లు అందుబాటులోకి వస్తున్నాయి. డోర్ స్టెప్ సర్వీసులు అందిస్తున్నాయి. అర్బన్ క్లాప్ డాట్ కామ్, తదితర వెబ్ సైట్లు కూడా సర్వీసులు అందిస్తూనే ప్రొఫెషనల్స్ కు జాబ్ ఆపర్చునిటీస్ అందిస్తున్నాయి. ఫ్రీలాన్స్ జాబ్ ఈ తరహా వెబ్ సైట్లలో కూడా దొరుకుతాయి.
గూగుల్ సెర్చ్ లో వీ ఆర్ హైరింగ్, కెరీర్ వంటి కీ వర్డ్స్ టైప్ చేస్తే ఏయే కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ వెబ్‌సైట్స్‌లో రిజిస్టర్ చేసుకోండి.. మీ టాలెంట్‌కు తగిన ఫ్రీలాన్స్ జాబ్ తో ఇంట్లో కూర్చొనే సంపాదించండి.
ఇవి కూడా చదవండి
♦ యువత మెచ్చే యాప్ తయారీతో ఆదాయం సంపాదించండి