బెస్ట్ సీబీఎస్ఈ స్కూల్స్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయి?

Best CBSE Schools

బెస్ట్ సీబీఎస్ఈ స్కూల్స్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయని మీరు వెతుకుతుంటే ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది. నవంబరు మాసం వచ్చిందంటే చాలు.. చిన్నారుల తల్లిదండ్రులకు స్కూల్స్ వేట మొదలవుతుంది. సీబీఎస్ఈ విధానంలో ప్రాక్టికల్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు అందుకే సీబీఎస్ఈని ఎంచుకుంటారు.

అందుకే సీబీఎస్‌ఈ స్కూల్స్‌ లో బెస్ట్‌ ఏవో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుని అందిస్తున్న స్టోరీ ఇది. హైదరాబాద్‌లాంటి నగరంలో వేల సంఖ్యలో ఈ స్కూల్స్‌ ఉన్నాయి. కానీ వీటిలో ఏది మంచిదో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. పిల్లల చదువుల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని ఇప్పటి పేరెంట్స్‌ భావిస్తున్నారు. అందుకే లక్షల్లో ఫీజులు ఉన్నా ఏమాత్రం వెనుకాడటం లేదు.

అయితే ఒక్కోసారి ఇంతింత ఫీజులు కట్టినా.. ఆ స్కూల్స్‌ ఆ స్టాండర్డ్‌ని అందుకోలేవు. అందుకే పిల్లల్ని చేర్పించే ముందే అందుబాటులో ఉన్న బెస్ట్‌ సీబీఎస్‌ఈ స్కూల్స్‌ హైదరాబాద్ లో ఏవో తెలుసుకుంటే మంచిది. డియర్‌ అర్బన్‌.కామ్‌ ఆ ప్రయత్నమే చేసింది. నగరంలో బెస్ట్‌ సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో, వాటిలో ఉన్న ఫీజు, ఇతర సౌకర్యాల వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.

కేంద్రీయ విద్యాలయ 1, ఉప్పల్‌ (kv1uppal)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు చదువుకునేందుకు ఏర్పాటు చేసినవే ఈ కేంద్రీయ విద్యాలయాలు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఈ స్కూల్స్‌ ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 42 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 18 ఉండటం విశేషం. వీటన్నింటిలోనూ సీబీఎస్‌ఈ సిలబస్‌ ఉంటుంది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ చదువుకోవచ్చు.

హైదరాబాద్‌ విషయానికి వస్తే ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయ నెం. 1 స్కూల్‌కు మంచి పేరుంది. చదువుతోపాటు ఆర్ట్స్‌, స్పోర్ట్స్‌కు కూడా ఇక్కడ సమ ప్రాధాన్యత ఇస్తారు. పెద్ద ప్లేగ్రౌండ్‌ కూడా ఇక్కడ ఉంది. అన్ని రకాల స్పోర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడానికి ప్రొఫెషనల్‌ ట్రైనర్స్‌ ఉంటారు. అత్యాధునిక ల్యాబ్స్‌, లైబ్రరీ సదుపాయాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ స్కూల్స్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు నేరుగా అడ్మిషన్‌ ఉంటుంది. సాధారణ పౌరులు కూడా తమ పిల్లల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, అలాగే రిజర్వేషన్ కలిగిన విద్యార్థులకు, సింగిల్ గర్ల్ చైల్డ్ కోటా, ఇలా అన్ని రిజర్వేషన్లు పూర్తయ్యాక మిగిలితే సాధారణ విద్యార్థులకూ సీటు కేటాయిస్తారు.

ఇక ఎంపీ కోటా కూడా ఉంటుంది. ప్రతి ఎంపీ 10 మంది విద్యార్థులకు మాత్రమే కేవీ స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించగలరు. లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు, తమ జిల్లా పరిధిలోని కేవీలో మాత్రమే సీటు ఇప్పించగలరు. అలాగే రాజ్యసభ సభ్యుడు అయితే రాష్ట్రంలో ఎక్కడైనా సీటు ఇప్పించగలరు. కానీ ఎవరికైనా 10 సీట్లకు మించి అవకాశం లేదు. సాధారణంగా ఎంపీల వద్దకు వందకు పైగా అభ్యర్థనలు వస్తాయి. అందువల్ల ఈ కోటాలో దొరకడం కూడా కష్టమైన పనే.

కేవీ నెం 1 ఉప్పల్ వెబ్సైట్ లోకి వెళ్తే ఈ స్కూల్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఉప్పల్‌లోని ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో ఈ స్కూల్‌ ఉంది. బెస్ట్ సీబీఎస్ఈ స్కూల్స్ హైదరాబాద్ జాబితాలో ఇంకా పలు కేంద్రీయ విద్యాలయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో గోల్కొండ 2 కేవీ, పికెట్  కేవీ కూడా అత్యుత్తమ కేవీ పాఠశాలల జాబితాలో ఉన్నాయి.

పీ ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌, జూబ్లీహిల్స్‌

హైదరాబాద్‌లోని సీబీఎస్‌ఈ స్కూల్స్‌ లో ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ కూడా ఉత్తమమైన వాటిలో ఒకటి. 1989లో ప్రారంభమైన ఈ స్కూల్‌ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకూ ఈ స్కూల్‌లో చదవొచ్చు. పైగా పేద విద్యార్థులకు ఫీజులో రాయితీ, ఉచితంగా యూనిఫార్మ్‌, ట్రాన్స్‌ఫోర్ట్‌లాంటి సదుపాయాలు కల్పిస్తుండటం విశేషం.

జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ 25లో ఐదున్నర ఎకరాల ఏరియాలో ఈ స్కూల్‌ విస్తరించి ఉంది. చదువుతోపాటు ఆటపాటలకు కూడా ఈ స్కూల్‌ ప్రాధాన్యత ఇస్తుంది. క్రికెట్‌తోపాటు టెన్నిస్‌, హాకీ, బాస్కెట్‌బాల్‌లాంటి ఆటలు ఆడేందుకు వీలుగా ఇక్కడ అత్యాధునిక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్ కూడా ఉంది.

అంతేకాకుండా ఈ స్కూల్ లో ఎన్.సి.సి., స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండడం కూడా విశేషం. amsporps డాట్ org లోకి వెళ్తే ఈ స్కూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

భారతీయ విద్యా భవన్‌, ఫిల్మ్‌ నగర్‌

నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక స్కూల్‌ ఇది. 1979లో అప్పటి రామకృష్ణ మఠ్‌ ప్రెసిడెంట్‌ రంగనాథనందాజీ ఈ స్కూల్‌ను ప్రారంభించారు. చదువుకు ఆధ్యాత్మికతను జోడించి చెప్పడం ఈ స్కూల్‌ ప్రత్యేకత. అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్స్‌, లైబ్రరీ ఇక్కడ ఉన్నాయి. చదువుతోపాటు స్పోర్ట్స్‌, స్టడీ టూర్స్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

మిగతా కార్పొరేట్‌ స్కూల్స్‌తో పోలిస్తే ఇక్కడ ఫీజు తక్కువే. అడ్మిషన్‌ ఫీజు పది వేల వరకు ఉంటుంది. ప్రీస్కూల్, ప్రైమరీ వరకు ప్రస్తుతం గరిష్టంగా టెర్మ్ ఫీజు (నాలుగు నెలలకోసారి) రూ. 10 వేల వరకు ఉంది. అంటే వార్షిక బోధన రుసుం రూ. 30 వేలకు అటు ఇటుగా ఉంటుంది. 

bvbpsjh డాట్ com లోకి వెళ్తే స్కూలుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట్‌

ఈ స్కూల్‌ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. హైదరాబాద్‌కు చెందిన ఎందరో ప్రముఖ వ్యక్తులు ఇందులో చదువుకున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్యనాదెళ్లతోపాటు ఇప్పటి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే, విప్రో సీఈవో టీకే కురియన్‌, టాలీవుడ్‌ హీరోలు నాగార్జున, రామ్‌చరణ్‌లాంటి వాళ్లు ఈ హెచ్‌పీఎస్‌లో చదువుకున్న వాళ్లే.

1972లో ప్రారంభమైనప్పటి నుంచీ హైదరాబాద్‌లోని బెస్ట్‌ స్కూల్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. చదువుతోపాటు ఇతర యాక్టివిటీస్‌కు కూడా ఇక్కడ ఇంపార్టెన్స్‌ ఇస్తారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో అతన్ని సదుపాయాలు ఈ స్కూల్‌లో ఉన్నాయి. కాకపోతే ఫీజు కాస్త ఎక్కువే. క్లాస్‌ను బట్టి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకూ ఉంటుంది. www.hpsbegumpet.org.in లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌, జూబ్లీ హిల్స్‌

1986లో ఓ సాధారణ స్కూల్‌గా ప్రారంభమై.. ఇప్పుడు టాప్‌ సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో ఒకటిగా నిలుస్తోందీ జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌. ఇక్కడ అడ్మిషన్‌కు విపరీతమైన పోటీ ఉంటుంది. ప్రస్తుతం ఇందులో రెండు వేల మందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు.

3డీ ల్యాబ్‌తోపాటు ప్రతి సబ్జెక్ట్‌కు ప్రత్యేకంగా ఓ ల్యాబ్, అత్యాధునిక లైబ్రరీ, ఆడియో విజువల్‌ స్టూడియో, మెడికల్‌ రూమ్‌, ఆడిటోరియంలాంటివి ఈ స్కూల్‌లో ఉన్నాయి. ప్రీప్రైమరీకి రూ. 82 వేల నుంచి మొదలు పెడితే.. పదో తరగతికి గరిష్ఠంగా రూ. 1,08,000 వరకూ ఫీజులు వసూలు చేస్తోందీ స్కూల్‌. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 71లో ఉందీ స్కూల్‌. jhpublicschool.com లోకి వెళ్తే స్కూలుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ

దేశవ్యాప్తంగా విద్యారంగంలో మంచి పేరు సంపాదించిందీ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌. హైదరాబాద్‌లోనూ 2001లో తన క్యాంపస్‌ను ప్రారంభించింది. ప్రీ ప్రైమరీ నుంచి పన్నెండో తరగతి వరకూ ఈ స్కూల్‌లో చదువుకోవచ్చు. సీబీఎస్‌ఈ సిలబస్‌ ఫాలో అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ పొందిన టీచర్లనే ఎంపిక చేసుకుంటారు. కెరీర్‌ గైడెన్స్‌, కౌన్సెలింగ్‌లాంటివి కూడా ఉంటాయి.

అన్ని అత్యాధునిక వసతులు డీపీఎస్‌ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్నాయి. స్కేటింగ్‌ రింక్‌‌, గోల్ఫ్‌ కోర్స్‌, స్విమ్మింగ్‌ పూల్‌లాంటివి కూడా ఉండటం ఈ స్కూల్‌ ప్రత్యేకతలు. డీపీఎస్‌ మెయిన్‌ క్యాంపస్‌ గోల్కొండ దగ్గర్లోని ఖాజాగూడలో ఉండగా.. సికింద్రాబాద్‌, మియాపూర్‌లలోనూ ఈ స్కూల్‌ బ్రాంచ్‌లు ఉన్నాయి.

క్లాస్‌ను బట్టి కనీసం రూ. 70 వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజులు ఉన్నాయి. www.dpshyderabad.com లోకి వెళ్లి స్కూలుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.

చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, జూబ్లీహిల్స్‌

సీబీఎస్‌ఈతోపాటు ఐబీ, కేంబ్రిడ్జ్‌ కరికులమ్‌ ఫాలో అవుతున్న ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఇది. ఐదో తరగతి వరకు పిల్లలకు పరీక్షలు ఉండకపోవడం ఈ స్కూల్‌ ప్రత్యేకత. 1989లో ప్రారంభమైన చిరెక్‌.. దేశంలోనే బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో ఒకటిగా పేరుగాంచింది. క్లాస్‌రూమ్స్‌, ఆడిటోరియమ్స్‌, ల్యాబ్స్‌ అన్నీ అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేశారు.

కాకపోతే ఫీజు కూడా అదే స్థాయిలో ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌కు ఏడాదికి రూ. 2 లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు వసూలు చేస్తారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 48లో ఈ స్కూల్‌ ఉంది. chirec.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్తే చిరెక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

సిల్వర్‌ ఓక్స్‌, బాచుపల్లి

ఫీజు కాస్త ఎక్కువైనా ఓకే అనుకుంటే.. ఈ సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌ను కూడా ట్రై  చేయొచ్చు. అత్యాధునిక వసతులతో ఇప్పటి అవసరాలకు తగిన టీచింగ్‌ ఈ స్కూల్‌ ప్రత్యేకత. చదువుతోపాటు స్విమ్మింగ్‌, స్కేటింగ్, క్రికెట్‌లాంటి స్పోర్ట్స్‌లోనూ శిక్షణ ఇస్తారు.

ఇక్కడ చదవాలంటే ఏడాదికి రూ. 1,50,000 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, విశాఖపట్నంలలోనూ ఈ సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్స్‌ ఉన్నాయి. hyderabad.silveroaks.co.in లోకి వెళ్తే మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

సంఘమిత్ర స్కూల్‌, నిజాంపేట్‌

హైదరాబాద్‌లోని బెస్ట్‌ సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో ఇదీ ఒకటి. 30 ఏళ్ల కిందట కేవలం 150 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ స్కూల్‌లో ప్రస్తుతం 2 వేల మందికిపైగా చదువుతున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఇక్కడ చదువుకోవచ్చు.

ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఫన్‌ రూమ్‌, సిక్‌ రూమ్‌లతోపాటు ప్రతి సబ్జెక్ట్‌కూ ప్రత్యేకంగా ఓ ల్యాబ్, ఆడియో విజువల్‌ స్టూడియో, ఆడిటోరియంలాంటి సదుపాయాలు సంఘమిత్ర స్కూల్‌లో ఉన్నాయి.

పేరెంట్స్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పిల్లల హోమ్‌ వర్క్‌ గురించి కూడా తెలుసుకునే వీలుంటుంది. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో ఈ స్కూల్‌ ఉంది.

ఇవే కాకుండా బెస్ట్ సీబీఎస్ఈ స్కూల్స్ హైదరాబాద్ జాబితాలో మిథానీ దగ్గర్లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌, బంజారాహిల్స్‌లోని మెరెడియన్‌ స్కూల్‌, జూబ్లీహిల్స్‌లోని శ్లోకా స్కూల్‌ వంటివి కూడా ఉన్నాయి.

ఈ జాబితాలో ఇంకా ఏవైనా బెస్ట్ స్కూల్స్ గురించి చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తే మాకు రాయండి. [email protected] కి మెయిల్ చేయండి. థ్యాంక్యూ.

ఇవీ చదవండి

Previous articleMaldives Package From Hyderabad: మాల్దీవ్స్‌ టూర్ .. ఎలా వెళ్లాలి? బెస్ట్‌ ప్యాకేజ్‌ ఏది?
Next articleకిడ్స్ లంచ్ బాక్స్‌ .. ఇలా ప్రిపేర్‌ చేయండి