Tips for First Kiss : మీ మొదటి ముద్దు మెమరబుల్​గా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి..

kiss
మొదటి ముద్దు ఎలా ఉండాలంటే PC: pexels
Tips for First Kiss : ముద్దు అనేది ఎక్స్ ప్రెషన్ ఆఫ్ లవ్ అని చెప్పవచ్చు. భాగస్వామికి ప్రేమ, ఆప్యాయత చూపించాలనుకునే సమయంలో చాలామంది బహుమతులకు బదులుగా వారికి ఓ ముద్దు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తారు. అయితే మొదటిసారిగా ముద్దు పెట్టుకోవడంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని విషయాలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్దు అనేది మీకు కానీ మీ భాగస్వామికి కానీ మరపురాని అనుభవం ఇవ్వాలి. అంతేకానీ దానిని ఏదో ఉద్యమంలా చేయకూడదు. మీరు ఇచ్చే ముద్దే మీ ప్రేమను వ్యక్తం చేయాలి. మీరు పెట్టుకునే విధానమే మీకు మరపురాని అనుభవాన్ని ఇస్తుంది. అందుకే మొదటిసారి మీ భాగస్వామిని ముద్దుపెట్టుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి.
ముద్దు కేవలం శారీరక అవసరం మాత్రమే కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య భావోద్వేగ బంధాన్ని మెరుగుపరిచే ఓ వారధి. అందుకే ముద్దు చేసుకునే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మీరు పెట్టుకునే ముద్దు మీ ప్రేమకథకు గేమ్ ఛేంజర్ కావచ్చు. మెరుగైన అనుభవం కోసం ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోండి.

సినిమా ఫాంటసీ

సినిమాల్లో చూపించినట్లు ఫాంటసీగా ముద్దు సీన్లు రీక్రియేట్ చేయవచ్చు. కానీ దానికి  ఎదుటివారి సమ్మతి చాలా ముఖ్యం. ఈ మూమెంట్ ఎంత సహజంగా ఉంటే అంత మంచిది. అయితే మీరు డేట్ కి వెళ్లినప్పుడు ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేయవచ్చు. కానీ మీరు ప్రైవసీగా ఉన్నప్పుడే ముద్దు పెట్టుకుంటే మంచిది. నలుగురిలో మీ భాగస్వామి కంఫర్ట్ లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే నలుగురిలో ఉన్నా.. ప్రైవేట్ గా ఉన్నా వారి పరిమితి తీసుకోవాల్సిందేనని గుర్తించుకోండి. ఈ పర్మిషన్ తీసుకునే విధానం కూడా ఎదుటివారిని ఆకర్షిస్తుంది.
త్రీ ఇడియట్స్ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ హీరోకి ముద్దు పెట్టుకుంటే ముద్దు అడ్డు వస్తుందనే భ్రమలో ఉంటుంది. అయితే మీకు కూడా అలాంటి డౌట్ ఉంటే తలను కాస్త వాల్చి ముద్దు పెట్టుకోవచ్చు. కాబట్టి ఎలాంటి తడబాటు లేకుండా మీ ముద్దు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగాలంటే మీరు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి.

ఐ టూ ఐ కాంటాక్ట్

కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు అని బాధతో కాకుండా.. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ ఎదుటి వ్యక్తి కిస్ చేయండి. అది మరింత రొమాన్స్ ని మీ మధ్య తీసుకువస్తుంది. తద్వార మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇవేకాకుండా ముద్దు పెట్టుకోవడంలో మీ బాడీ లాగ్వేంజ్ చాలా కీలకం. ఇది సహజంగా మీ భాగస్వామికి మీపైన ఆసక్తిని మరింత పెంచుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి.
ఈ సందర్భంలో మీరు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాస్త సున్నితంగా ముద్దు పెట్టుకోండి. ఫోర్స్ చేస్తూ.. ఇబ్బంది పెడుతూ కాకుండా మీ భాగస్వామిని కాస్త సున్నితంగా దగ్గరకు తీసుకోండి. ఇది మీ ఇద్దరికీ రిలాక్స్ ఇస్తుంది. ముద్దు అనేది ఇద్దరు వ్యక్తులకు  సంబంధించినది. కాబట్టి ఎత్తు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఒకరు ఎత్తుగా ఉండి.. మరొకరు షార్ట్ గా ఉంటే మీరు స్టూల్, స్టెప్స్ వంటి వాటిని వాడుకోవచ్చు.

చేతులతో..

చేతులను వినియోగించడం కూడా ముద్దులో ఓ భాగమే. మీ చేతులు సున్నితంగా ఎదుటివారి జుట్టును, మెడను, నడుమును తాకుతూ చుంభించవచ్చు. అది మీకు యాంత్రికమైన ఫీల్ తీసుకురాదు. ముద్దు విషయంలో మీరు కచ్చితంగా పాటించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే అది నోటి పరిశుభ్రతే. మీరు శుభ్రంగా ఉండడం ఎంత ముఖ్యమో.. మీ నోటి శుభ్రం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీరు ప్రేమించే వారిని ముద్దు పెట్టుకునే ముందు ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకోండి.
Previous articleDragon fruit benefits: అందానికి, ఆరోగ్యానికి.. డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్
Next articleWorkouts for Hair Growth: జుట్టు పెరిగేందుకు, బరువు తగ్గేందుకు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..