Dragon fruit benefits: అందానికి, ఆరోగ్యానికి.. డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్

dragon fruit
డ్రాగన్ ఫ్రూట్స్ ఉపయోగాలు PC: pexels
Dragon fruit benefits: డ్రాగన్ ఫ్రూట్. పేరుకు తగ్గట్లుగానే ఈ పండు కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో విరివిగానే దొరుకుతుంది. అయితే తెలుపు, పింక్ కలర్స్ లో ఆకట్టుకునే ఈ ఫ్రూట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుని మీ డైట్లో కలిపి తీసుకోండి. 
డ్రాగన్స్ ఫ్రూట్స్ ఓ సూపర్ ఫుడ్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని మీ రోటీన్లో తీసుకోవాలంటున్నారు. పేరు కాస్త భయపెడుతుంది కానీ.. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అంతేకాకుండా దానిలోని పోషకాలు మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి.. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్‌తో ఇబ్బంది పడేవారు దీనిని కచ్చితంగా తినాలంటున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో గ్లూకోజ్ తగ్గిస్తుంది. మరి దీనిలోని పోషక విలువలు ఏంటో.. అవి ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రాగన్ ఫ్రూట్లోని పోషక విలువలు..

100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్లో 60 కిలో కేలరీలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు 9 గ్రాములు, ఫైబర్ 1.5 గ్రాములు, షుగర్ 8 గ్రాములు, ప్రోటీన్ 1 గ్రాము, కొవ్వు 0.4 గ్రాములు, విటమిన్ సి 9 మి.గ్రా, కాల్షియం 9 మి.గ్రాములు, ఐరన్ 0.9 మి.గ్రా ఉంటాయి. అయితే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మొత్తం ఆరోగ్యానికై..

డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల మీ శరీరంలోని కణాలకు కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 
జీర్ణ ఆరోగ్యం డ్రాగన్ ఫ్రూట్లోని అధిక ఫైబర్ కంటెంట్ మెరుగైన ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. తద్వార మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యరమైన గట్ అందిస్తుంది. 

గుండె ఆరోగ్యానికై..

డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్, ప్రయోజనకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపిస్తాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి.. మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. 

రోగనిరోధక శక్తికై..

డ్రాగన్ ఫ్రూట్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ మీ శరీరాన్ని అంటువ్యాధులు, అనారోగ్యాలనుంచి కాపాడుతుంది. సీజన్లు మారిన మీరు అనారోగ్యానికి గురికారు. 

హైడ్రేట్గా ఉండేందుకు..

డ్రాగన్ ఫ్రూట్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది పొటాషియం వంటి అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను అందిస్తుంది. ఇది మీరు హైడ్రేట్గా ఉంచుతుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గేందుకు డైట్ ఫాలో అవుతున్నారా? అయితే మీకు డ్రాగన్ ఫ్రూట్ మంచి ఎంపిక. ఎందుకంటే దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా ఇది మీరు ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వార మీరు అతిగా తినరు. ఇదొక హెల్తీ స్నాక్ కాబట్టి మీరు అనారోగ్యకరమైన చిరుతిండికి దూరంగా ఉండవచ్చు. 

మెరిసే చర్మానికై

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వార ముడతలు తగ్గుతాయి. ఆరోగ్యానికి మంచిది కదా అని దేనినైనా ఎక్కువగా తీసుకోకూడదు. హెల్తీగా ఉండాలంటే పరిమితంగానే దానిని తీసుకోవాలి.
Previous articleTooth Ache Home Remedies: పంటినొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే..
Next articleTips for First Kiss : మీ మొదటి ముద్దు మెమరబుల్​గా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి..