Workouts for Hair Growth: జుట్టు పెరిగేందుకు, బరువు తగ్గేందుకు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..

hair growth
జుట్టు పెరగాలంటే వ్యాయామాలు తప్పనిసరి Image Credit:Pexels
Workouts for Hair Growth: జుట్టు పెరగడానికి చిట్కాలు వెతుకుతున్నారా? ఆరోగ్యంతో పాటు ఒత్తైన, స్ట్రాంగ్ జుట్టును సొంతం చేసుకోవాలనుకుంటే కొన్ని వ్యాయామాలు చేయాలంటున్నారు నిపుణులు. పెరుగుతున్న ఒత్తిడి, కాలుష్యానికి ఆరోగ్యంతో పాటు జుట్టు కూడా అంతే డ్యామేజ్ అవుతుంది. తీసుకునే ఆహారం నుంచి జీవనశైలితో పాటు ప్రతి అంశం జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. 
 
ప్రతి వంద మందిలో 98 మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టును పెంచుకోవాలని ఎంత తాపత్రయ పడతారో.. పెరుగుదల అంత నెమ్మదిగా ఉంటుంది. సరైన పోషణ జుట్టుకు లేకపోవడం, ఒత్తిడి, కాలుష్యం వంటివి జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. అయితే కేవలం మాస్క్స్, ఆయిల్స్ అప్లై చేయడమే కాకుండా సరైన వ్యాయామాలు చేయాలి అంటున్నారు నిపుణులు. మరి ఎలాంటి వ్యాయామాలు చేస్తే ఒత్తైన, దృఢమైన జుట్టును పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వ్యాయామాలు మీరు ప్రయత్నించి వ్యత్యాసాలు మీరు చూసేయండి.

కార్డియో..

జాగింగ్, సైక్లింగ్, చురుకైన వాకింగ్, స్విమ్మింగ్ వంటి కార్డియో వ్యాయామాలు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడంతో పాటు.. అందమైన జుట్టును పొందడంలో సహాయం చేస్తాయి. ఇవి తలతో పాటు.. మీ శరీరం అంతటా రక్త ప్రసరణను పెంచుతుంది. తద్వారా మీ జుట్టు పెరుగుతుంది. పైగా మెరుగైన రక్తప్రవాహం జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ అందిస్తుంది. తద్వార జుట్టు మూలాలకు పోషణ అంది.. జుట్టు పెరుగుతుంది. 

హెడ్ స్టాండ్

హెడ్ స్టాండ్స్ లేదా హ్యాండ్ స్టాండ్స్ మీ జుట్టు పెరుగుదలను బాగా ప్రోత్సాహిస్తాయి. తలకిందులుగా చేసే ఈ వ్యాయామం వల్ల శరీరంతో పాటు జుట్టు ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాలు అందుతాయి. ఇవి తలలో రక్తప్రసరణను మెరుగుపరిచి.. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. స్ట్రెస్ తగ్గితే మీ శరీరంలో సగం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. 

స్ట్రెచ్

వ్యాయామాన్ని ప్రారంభించే ముందు స్ట్రెచ్స్ మీ కండరాలను మీ అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా మెడ, భుజం మీదుగా చేసే స్ట్రెచ్స్ మీ జుట్టు పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. రెగ్యూలర్గా వీటిని చేస్తే తలకు మెరుగైన రక్తప్రసరణ అందుతుంది. అవసరమైన పోషకాలు జుట్టు కుదుళ్లకు చేరి వాటిని పటిష్ఠ పరుస్తాయి. 

వెయిట్ లిఫ్టింగ్..

బరువులు ఎత్తడం, కొన్ని శక్తి నిరోధక శిక్షణ వ్యాయామాలు శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. ఇవి మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. టెస్టోస్టెరాన్ జుట్టు పెరుగుదలకు అవసరమైన హార్మోన్. ఇది జుట్టు ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే మెరుగైన ఫలితాలు పొందాలని ఎక్కువగా బరువులు ఎత్తకూడదు. ఇలా చేస్తే అది మీకు ప్రయోజనాలు అందించడానికి బదులు హానికరంగా మారుతుంది. 

యోగా

ఒత్తిడిని తగ్గించడంలో యోగా ఎప్పుడూ ముందు ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలో తల నుంచి కాలి వరకు మెరుగైన రక్తప్రసరణను అందిస్తుంది. రోజూ యోగాసనాలు వేస్తే వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్, పోషకాలు అంది జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మీరు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. 

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్

యోగాతో పాటు.. బ్రీతింగ్ వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రోత్సాహిస్తాయి. డీప్ బ్రీత్ శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి ఒత్తిడిని తగ్గించి జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా డ్యామేజ్ అయిన జుట్టును సరిచేసి.. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి. 

స్కాల్ప్ మసాజ్

స్కాల్ప్ మసాజ్ కూడా వ్యాయామంలో ఓ భాగంగానే చేయాలి. ఇది తలలో ఒత్తిడిని తగ్గించి.. మెరుగైన రక్తప్రసరణను అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కొన్ని నిమిషాల పాటు మీ తలపై సున్నితంగా మసాజ్ చేయండి. కొంచెం ఆయిల్ రాసి మీరు ఈ మసాజ్ చేయవచ్చు. లేదా పడుకునేముందు మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఒత్తిడి తగ్గినప్పుడు కచ్చితంగా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది.
జుట్టు పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా.. మరి ఈ టిప్స్ మీరూ పాటించి అందం, ఆరోగ్యం పెంచుకోండి.
Previous articleTips for First Kiss : మీ మొదటి ముద్దు మెమరబుల్​గా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి..
Next articleEmotional Distance: శారీరకంగా దగ్గరుంటూ.. మానసికంగా దూరమైపోతున్నారా?