Emotional Distance: శారీరకంగా దగ్గరుంటూ.. మానసికంగా దూరమైపోతున్నారా?

couple
భావోద్వేగాల దూరం మంచిది కాదు (Pexels)
Emotional Distance: మీ రిలేషన్లో మీరు ఎంతవరకు ఎమోషనల్‌గా ఎటాచ్‌గా ఉంటున్నారు? ఏ సంబంధానికైనా.. ఎమోషనల్ ఎటాచ్మెంట్ అనేది అవసరమని మీకు తెలుసా? అసలు దీనిగురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఉప్పులేని వంట ఎంత చప్పగా ఉంటుందో.. ఎమోషన్ లేని సంబంధం అంతే చప్పగా ఉంటుంది. అయితే మీ సంబంధాన్ని ఎమోషనల్గా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటే మీరు దీనిని చదివేయండి.
 
మీరు మీ భాగస్వామికి శారీరకంగా అందుబాటులో ఉంటున్నారు కరెక్టే. కానీ మానసికంగా దగ్గరగా ఉంటున్నారా? ఈ బిజీ లైఫ్లో అందరూ కలిసే ఉంటున్నా.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటుంన్నారు. మనుషులు దగ్గరగానే ఉంటున్న ఎవరి ఫోన్లో, ఎవరి ల్యాప్ట్యాప్లో వారు బిజీగా ఉంటున్నారు. ఇల్లు ఒకటే అయినా.. గదులు వేరే. పక్కరూమ్లో ఒకరు బాధపడుతున్నా.. అదే ఇంట్లో ఉన్న మరొకరికి వారి బాధ గురించి తెలియదు. 
 
ఇలాంటి మెకానికల్ జీవితంలో మీరు ఉంటే.. కచ్చితంగా మీ బంధాలలో కాస్త ఎమోషనల్ ఎటాచ్మెంట్ను యాడ్ చేయాల్సిన టైమ్ ఇది. లేదంటే మీరు చచ్చినా మీతో ఉన్నవాళ్లు జస్ట్ ఫార్మల్గా ఫీల్ అవుతారు అంతే. చదవడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం. మీ బాధను మీ భాగస్వామి అర్థం చేసుకోవట్లేదనేది ఎంత నిజమో.. మీ భాగస్వామి బాధను మీరు ఎంత అర్థం చేసుకుంటున్నారో ఓసారి క్రాస్ చెక్ చేసుకోండి. అసలు మీ భాగస్వామికి మానసికంగా ఎలా అందుబాటులో ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

వినండి..

హా వినండి. వినేస్తున్నామనే భ్రమలో చాలా మంది గడిపేస్తూ ఉంటారు. కానీ మీరు నిజంగా వినాలని అనుకుంటే చుట్టూ ఎలాంటి టీవీలు, ల్యాప్టాప్లు, ముఖ్యంగా ఫోన్ చూస్తూ మరొకరి ఫీలింగ్ వినకండి. మీ ఇంట్లోవారు మీతో మాట్లాడాలనుకుంటే ఫోన్లో మాట్లాడటం కాకుండా వారికి ఎదురుగా కూర్చొని వారు ఏమి చెప్తున్నారో ముందు వినండి. ముందే మీ ఫీలింగ్స్ చెప్పేయకుండా వాళ్లు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది పూర్తిగా వినండి. ఇది ఎదుటివారికి సగం రిలాక్స్ ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు మీ భాగస్వామికి మానసికంగా దగ్గరగా ఉంటారు.

స్నేహితులుగా ఉండండి..

మన స్నేహితులు మనల్ని ఎప్పుడూ జడ్జ్ చేయరు. మనం వారితో ఉంటే హ్యాపీగా ఉంటామని మీకు అనిపించే ఉంటుంది కదా. మీ పార్టనర్కి కూడా మీరు ఆ ఫీల్ కల్పించండి. సంబంధం అంటే శారీరకంగానే కాదు మానసికంగానే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మీరు మీ భాగస్వామిని రిస్ట్రిక్ట్ చేసే టైప్ అయితే మీరు ఎప్పటికీ ఏ రిలేషన్లోనూ హ్యాపీగా ఉండరు. కాబట్టి మీ రిలేషన్లో అవసరానికి తగ్గట్టు ఫ్రెండ్లీగా ఉండండి. మీరు ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు వారితో ఫ్రెండ్లీగా ఉండడం నేర్చుకోండి. 

ఓపెన్ మైండెడ్

మీరు మీ రిలేషన్లో ఓపెన్ మైండెడ్గా ఉండండి. మీరు ఎంత మెచ్యూర్గా ఉంటే.. అవతలి వ్యక్తి కూడా మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో తమ బాధ, లేదా ప్రేమ, ఘర్షణను మీ ముందుకు తెస్తారు. మీ భాగస్వామిని మీరే అర్థం చేసుకోవట్లేదు అంటే వారు మీ దగ్గర చాలా విషయాలు వారికి తెలియకుండానే దాచేస్తారు. ఓ బంధమైనా.. ఎన్నాళ్లు కొనసాగినా.. మీరు కలిసి ఉండాలన్నా.. విడిపోవాలన్నా ఓపెన్ మైండెడ్గా ఉంటేనే జరుగుతుంది. ఒకరు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతామన్నా మీరు దానిని అర్థం చేసుకోకుండా ఆపితే ఏమి లాభం చెప్పండి. 

నాణ్యమైన సమయం

మీరు ప్రేమించేవారికి మీ సమయాన్ని ఇవ్వడమే పెద్ద బహుమతి. ఇద్దరూ బిజీగా ఉండేవారైతే.. కనీసం వారంలో మీకంటూ ఓ రోజు పెట్టుకోండి. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా సరే కలిసి భోజనం చేయండి. లేదంటే ఓ టైమ్ పెట్టుకుని గేమ్స్ ఆడండి. వాకింగ్ కి వెళ్లండి. ఇది మీ మధ్య సగం సమస్యలు తగ్గిస్తుంది. మీరు భిన్నాభిప్రాయాలున్న వారైనా.. ఈ సమయం మీ మధ్య ఆ గ్యాప్ రానీయకుండా చేస్తుంది.
Previous articleWorkouts for Hair Growth: జుట్టు పెరిగేందుకు, బరువు తగ్గేందుకు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Next articleFoods to Avoid for Children Under 5: ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ఫుడ్స్ అస్సలు పెట్టకండి.. ఎందుకంటే..