mental health: మానసికంగా ధృఢంగా ఉండాలంటే, మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మన జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలను పత్యం అని, తీసుకోకూడని ఆహార పదార్థాలను అపత్యం అని చెబుతోంది.
mental health in ayurveda: ఆయుర్వేదం ఏం చెబుతోంది..
మంచి జీవితం, సంతోషకరమైన జీవితం ఉండాలంటే ఆరోగ్యకరమైన డైట్, ఒత్తిడి లేని జీవన శైలి అలవరుచుకోవాలి. అనారోగ్యకరమై డైట్, వాతావరణ మార్పులతో సైకియాట్రిక్ డిసీజెస్ పెరుగుతున్నాయి. దీనిపై ఆయుర్వేదం స్పష్టమైన ఆరోగ్య సూత్రాలను పూర్వకాలంలోనే చెప్పింది.
దినచర్య, రుతుచర్య, ఆచార రసాయన, సద్వృత్త వంటి ఆరోగ్య సూత్రాలను పాటించాలని సూచించింది. తద్వారా శరీరం, మనసు ఆరోగ్యకరంగా ఉంటాయని చెప్పింది. మానసిక వ్యాధులు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార, విహారాలను ఆయుర్వేదం వివరంగా చెప్పింది.
దీర్ఘకాలిక మానసిక వ్యాధులు శరీరంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల మానసిక రుగ్మతలు రాకుండా, వస్తే నివారణకు ఈ పత్యం, అపత్యం పాటించాలి.
Diet for mental health: తీసుకోవాల్సినవి (పత్యం):
1. ఎరుపు రకం బియ్యం
2. పెసలు
3. ఫ్రెష్ మిల్క్
4. నెయ్యి
5. గోధుమలు
6. బట్టర్ (వెన్న)
7. బూడిద గుమ్మడి కాయ
8. శుభ్రమైన ఆహారం
9. రోజు తాజా, సీజనల్ పండ్లు, కూరగాయలు(ఫైబర్, సూక్ష్మపోషకాల లభ్యత కోసం)
10. బ్రాహ్మి
11. మందుకపర్ణి (సెంటెల్లా ఏసియాటికా)
12. ద్రాక్ష
13. పండిన మామిడి పండ్లు
14. దానిమ్మ
15. ఉసిరి
16. తాజాగా వండిన ఆహారం
17. హోల్ గ్రెయిన్ ఫుడ్
18. క్రమం తప్పని, సమతుల్యత కలిగిన భోజనం
19. చేపలు (ఒమెగా 3 గల సారై్డన్, మాకరెల్ వంటి రకాలు)
20. ఆర్గానిక్ ఎగ్స్
Activities for mental health: మానసిక వ్యాధులు రాకుండా ఉండేందుకు చేయవలిసిన యాక్టివిటీస్
1. యోగా నిపుణుల సమక్షంలో యోగా చేయడం
2. ఏడెనిమిది గంటల పాటు నిద్ర(డీప్ స్లీప్)
3. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం( 4.30 నుంచి 5.30 మధ్య లేవడం)
4. నిత్యం వ్యాయామం చేయడం (జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, డాన్సింగ్ వంటి ఏరోబ్రిక్ ఎక్సర్‌సైజ్‌లతో మూడ్ పాజిటివ్‌గా ఉంటుంది.)
5. తోటి వారితో కరుణతో వ్యవహరించడం, పెద్దలు, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండడం
6. పంచకర్మ ప్రాక్టీస్ చేయడం
7. దినచర్య, రుతుచర్య పాటించడం(ఆయుర్వేద జీవనశైలి)
8. దయతో వ్యవహరించడం
9. హె ల్పింగ్ యాటిట్యూడ్ కలిగి ఉండడం
10. ఆధ్యాత్మిక భావాలు ఉంటే వారి మతాన్ని అనుసరించి మంత్రాలు ఉచ్చరించడం
11. పవిత్ర గ్రంథాలు పటించడం
12. కుటుంబంతో ఉల్లాసంగా గడపడం
13. రీడింగ్, సింగింగ్, గార్డెనింగ్, పేయింటింగ్, మ్యూజిక్ వినడం వంటి అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవడం
14. అనవసర జోక్యాలు లేకుండా మైండ్ ను నియంత్రించడం
mental health Do’s and Don’ts: తీసుకోకూడనివి, చేయకూడనివి (అపత్యం)
1. కలుషిత ఆహారం తినడం(రోడ్డు వెంట రక్షణ లేని, అన్ హైజెనిక్ ఆహారం తినడం)
2. రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్
3. ఆల్కహాల్
4. బ్రెయిన్‌కు ఎనర్జీ ఇవ్వని సింపుల్ కార్బొహైడ్రేట్స్ గల ఫుడ్ తీసుకోకూడదు
5. కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటే న్యూరోట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుంది.
6. కెఫెయిన్ ఉన్న డ్రింక్స్ తీసుకోకూడదు. తాత్కాలికంగా మూడ్‌ను స్టిమ్యులేట్ చేస్తాయి. కానీ దీర్ఘకాలంలో హానీ చేస్తాయి.
7. స్మోకింగ్
8. గుట్కా
9. దీర్ఘకాలం ఫాస్టింగ్ ఉండడం (బ్రెయిన్, సంబంధిత ఇతర స్ట్రక్చర్లు నిరంతరాయ ఎనర్జీపై ఆధారపడి ఉంటాయి. నిరంతరం ఫాస్టింగ్ ఉండడం వీటిపై ప్రభావం చూపుతుంది..)
10. డ్రైఫుడ్ తినడం
11. ఫాస్ట్ ఫుడ్ రెగ్యులర్‌గా తీసుకోవడం(ట్రాన్స్‌ఫ్యాట్స్, హై కొలెస్ట్రాల్ ఉంటాయి)
12. అధికంగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం(పికిల్స్, చిల్లీ, పెప్పర్ అధికంగా ఉన్న ఫుడ్)
13. రిఫ్రిజిరేటెడ్, కోల్డ్ ఫుడ్
14. అధికంగా పుల్లగా ఉండే పదార్థాలు (పులియబెట్టినవి, వెనిగర్ లాంటివి)
15. అతి కష్టం మీద డైజెస్ట్ అయ్యే ఫుడ్ (మైదా, వనస్పతి లాంటివి)
16. బూజు పట్టిన, పాడైన, కుళ్లిన ఆహారం తీసుకోవడం
17. అధికంగా తినడం
18. ఇంతకుముందు తీసుకున్న ఆహారం డైజెస్ట్ కాకముందే మళ్లీ తినడం
19. రాజసిక, తామసిక ఆహారం (కాఫీ, టీ, మసాలా, మటన్, హెవీ ఫుడ్, చాక్లెట్స్ వంటివి)
20. కొన్ని ఆహారాలు కలిపి తీసుకోకూడదు (పాలు–గుడ్డు లేదా చేపలు, వేడి–చల్లని పదార్థాలు కలిపి తీసుకోవడం, పండ్లు–పాలు కలిపి తీసుకోవడం వంటివి చేయకూడదు)
21. ఆలస్యంగా నిద్ర పోవడం, ఆలస్యంగా లేవడం, నిద్ర పోకుండా ఉండడం
22. పగటి వేళ నిద్ర పోవడం
23. శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా సెడెంటరీ లైఫ్ స్టయిల్ కలిగి ఉండడం
24. అధికంగా ఒత్తిడి కలిగి ఉండడం
25. కామం, క్రోధం, లోభం వంటివాటిపై నియంత్రణ లేకపోవడం
26. సామాజిక నిబంధనలు, నైతిక విలువలు, అసహజ ప్రవర్తన కలిగి ఉండడం
27. అతిగా ఆలోచించడం, పర్యవసనాలపై నిరంతరం బాధపడుతుండడం, యాంగై్జటీ కలిగి ఉండడం
28. నిరంతరం టీవీ, మొబైల్ వీక్షించడం వల్ల సెన్స్ ఆర్గాన్స్పై ఒత్తిడి
29. కోపం, భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం
30. అతిగా భయం, కామం వంటి వాటికి లోనయ్యే చర్యలకు పాల్పడడం
31. సిన్ఫుల్ యాక్టివిటీస్