మీ కలల వేటలో ఫెయిల్యూర్ వెంటాడుతోందా?

dream
Image by Free-Photos from Pixabay

మీ కల ఎలా సాధించుకోవాలని తపన పడుతున్నారా? మీ కల ఏంటో మీకు మాత్రమే తెలుసు. మీ కల కోసం మీరు ఎంతో తపిస్తున్నా ఫెయిల్యూర్ ఎదురవుతుండొచ్చు. కానీ మీ మెదడులో చక్కర్లు కొడుతున్న ఆ కల నిజమవడం అసాధ్యం మాత్రం కాదు.

మీ డ్రీమ్ నెరవేరడం కష్టమే అయి ఉండొచ్చు. అంత సులువైందని మీకు తెలుసు. ఒక్కోసారి దానిని నెరవేర్చడంలో మీ శ్రమకు తగ్గ ఫలితం రాక నిస్సత్తువ ఆవిరిస్తుంది. అనేక వైఫల్యాలు ఎదురవ్వొచ్చు.

కానీ అది మీలో అనుమానం రేకెత్తించకూడదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు మదన పడొద్దు. మీ ప్రయత్నం మాత్రం మానొద్దు.

వైఫల్యాలు, నిరాశలు మబ్బల్లాంటివి. అవి అలాగే నిలిచి ఉండవు. కష్టాలు, కన్నీళ్లు ఎల్లకాలం ఉండవు.

విజయాలు బాగా డబ్బున్న వాళ్లవి కానేకావు. విజయం సాధించిన వారంతా అంతకుముందు అనేకసార్లు వారి ప్రయత్నాల్లో ఫెయిలైన వాళ్లే.

నిన్ను నువ్వు విశ్వసించడం కావాలి. నువ్వు చేయగలవన్న నమ్మకం ఉండాలి. ఫెయిలైన ప్రతిసారి అందులో గమ్మత్తును అనుభవించాలి.

ఓ కుటుంబం ఉండాలి. పిల్లలను పెంచాలి. వారిని పెద్ద చేయాలి. సుఖంగా చనిపోవాలి. జీవితం అంటే ఇంతే అనుకుంటారు చాలా మంది. ఏం చేస్తాం.. మన రాత ఇంతే అని బతికేస్తారు. కొత్తగా పని చేసేందుకు ఇష్టపడరు. ఫెయిలవుతామని దానిని మొదలుపెట్టడమే మానేస్తారు.

విజయం ఎవరిది?

నా పరిస్థితి ఏమీ బాగోలేదని చెబుతూ ఉంటారు. కానీ ఆ పరిస్థితి మార్చుకోవడానికి ప్రయత్నించరు. వారి కలలను సాధించడానికి ప్రయత్నించరు. వైఫల్యం ఎదురవుతుందన్న భయమే ఇందుకు కారణం.

ఇతరుల గురించి చాలా చెబుతాం. వాళ్లు అలా.. వీళ్లు ఇలా అని మాట్లాడుతుంటాం. కానీ మన గురించి మనం తెలుసుకోం. మనమీద మనకు విశ్వాసం ఉండదు. ఇతరులను అనుసరిస్తూ ఉంటే మనలో ఉన్న బలాలను మనం గుర్తించలేం.

మన బలాన్ని గుర్తించి ఆ ప్రయత్నం మొదలుపెట్టాలి. చాలా మంది మీ మాటల్ని లెక్క చేయకపోవచ్చు. మీ కలను ఎగతాళి చేయొచ్చు. కానీ మీ కల మీద మీకు పూర్తిగా నమ్మకం ఉండాలి. దానిలోని ప్రతి అడుగునూ ఎంజాయ్ చేయాలి.

మీ కల జరిగి తీరుతుందని విశ్వసిస్తూనే ఉండాలి. ఆ కల నెరవేర్చేందుకు ఉన్న అన్నింటినీ నేర్చుకోవాలి. మీ కల చేరుకునేందుకు ప్రతి రోజూ సమయం వెచ్చిస్తూ ఉండండి.

రోజుకొక అంగుళమైనా సరే.. ఒక అడుగైనా సరే.. ఒక గజమైనా సరే.. ముందుకు వెళుతూనే ఉండాలి.

లేవండి.. ఇంకా మీ కలల గురించి కల కంటూనే ఉంటే ఇక లేచి తొలి అడుగు వేసే సమయం ఇదే. మీ కల  సాకారమైతే అది లక్షలాది మందికి ఉపయోగపడొచ్చు.

ఎన్నిసార్లు పడిపోయినా.. ఎన్నిసార్లు తిరస్కారానికి గురైనా సరే.. డోంట్ గివప్..

ఎవరేమనుకున్నా సరే.. నువ్వు గెలించేంతవరకు.. శ్రమించడం ఆపకు.

జేకే రౌలింగ్ హారీ పోటర్ నవల ప్రచురించడానికి ముందు 12సార్లు తిరస్కారానికి గురైంది. ఫేస్ బుక్ లాంచ్ చేయడానికి ముందు మార్క్ జుకర్ బర్గ్ చాలా ఆవిష్కరణలు చేశారు.

చాట్ సిస్టమ్, గేమ్స్, స్టడీ టూల్స్ వంటవెన్నో ఆవిష్కరించారు. కానీ సక్సెస్ కాలేదు. గొప్ప విజయం ఏంటంటే ఫెయిలయ్యేందుకు స్వేచ్ఛ కలిగి ఉండడమే అని మార్క్ జుకర్ బర్గ్ చెబుతుంటారు.

ఫెయిలవుతామని భయపడకండి.

ఫెయిలయ్యేందుకు భయపడకండి.

ఫెయిలయ్యామని భయపడకండి.

ఇవీ చదవండి..

  1. హాబీతో ఆదాయ మార్గాలు
  2. జాబ్ పోతే డోంట్ వర్రీ.. నీకంటే తోపెవ్వడు లేడిక్కడ
  3. స్టార్టప్ ఐడియాలు ఇవిగో
  4. కోవర్కింగ్ స్పేసెస్ ఎంతలో దొరుకుతుంది
  5. ఫ్రీలాన్స్ జాబ్స్ మీ కోసమే
  6. బెస్ట్ జాబ్ వెబ్ సైట్స్ ఇవిగో
Previous articleజూన్ 1 నుంచి నడిచే ట్రైన్స్ లిస్టు ఇదే
Next articleతెలుగు సినిమా రంగం కొత్త పంథాలో