Liver Health foods: కాలేయం ఆరోగ్యానికి 7 ఆహార పదార్థాలు

human liver
ఆల్కహాల్ వల్ల లివర్‌కు ముప్పు (Bing AI)

Liver Health foods: కాలేయం శరీరంలోని ప్రధాన భాగాల్లో ఒకటి. దీనిని వ్యాధుల బారి నుంచి రక్షించుకుంటూ, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తగిన ఫుడ్ మీ డైట్‌లో చేర్చుకోవడం అవసరం. ఇతర అవయవాలతో పోలిస్తే కాలేయం చాలా ప్రత్యేకమైనది. ఇది గాయాల నిరోధకతను ఎక్కువగా కలిగి ఉంటుంది. దీనిలో 90 శాతం తీసేసినా కూడా తిరిగి సాధారణ పరిమాణానికి పెరగడం దీని ప్రత్యేకత. మీ కాలేయానికి హాని కలిగించే ఆహారాలను దూరం పెట్టి, దాని ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు తినడం చాలా ముఖ్యం. మనం తీసుకునే ప్రతి ఆహారాన్ని కాలేయం క్షుణ్ణంగా స్కాన్ చేస్తుంది. ఆహారం తిన్నా, మందులు తీసుకున్నా అవి పొట్టా,పేగులను రక్తాన్ని చేరడానికి ముందే కాలేయం ఫిల్టర్ చేస్తుంది. బ్యాక్టీరియాను బయటికి పంపించే ఏర్పాటు చేసేది కూడా కాలేయమే. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

కాఫీ తాగుతారా?

కాఫీ ప్రియులకు ఇది శుభవార్త. రోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కాఫీలో ఉన్న ఇతర సహజ సమ్మేళనాలు కాలేయానికి ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా అడ్డుపడతాయని పరిశోధనలు తెలిపాయి. అయితే కాఫీ మితంగానే తీసుకోవాలి. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడంలో కూడా కాఫీ కీలకంగా పని చేస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా కాలేయంలో కొవ్వు పేరుకు పోకుండా కాపాడుతుంది. కాలేయ సిర్రోసిస్ వ్యాధి బారిన పడకుండా రక్షిస్తుంది.

నట్స్‌తో ఫ్యాటీ లివర్‌కు చెక్

నట్స్ అంటే బాదం, పిస్తా, వాల్నట్స్, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్… ఇలా చాలా పెద్ద జాబితానే ఉంది. వీటిలో మంచి కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్ E అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికీ, కాలేయానికి ఎంతో అత్యవసరమైనవి. ఇవన్నీ కూడా మొక్కల ఆధారత సమ్మేళనాలు. ఇవి కాలేయానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. గుండెను రక్షిస్తాయి.

ఆలివ్ ఆయిల్‌తో కాలేయానికి రక్షణ

ఆలివ్ ఆయిల్ కాస్త ఖరీదైనదే కానీ రోజుకో స్పూన్ ఆలివ్ ఆయిల్ ను తాగడం వల్ల కాలేయాన్ని రక్షించుకోవచ్చు. కాలేయానికి ఆక్సికరణ నష్టం కలగకుండా పచ్చి ఆలివ్ నూనె కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ.

పుట్టగొడుగులతో కాలేయానికి రోగ నిరోధక శక్తి

పుట్టగొడుగుల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. వీటిని తినడం వల్ల యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. లివర్ సమస్యలు రాకుండా పుట్టగొడుగుల్లోని పోషకాలు కాపాడతాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.

కాలేయాన్ని శుభ్రపరిచే వెల్లుల్లి

తెలుగింటి కూరల్లో వెల్లుల్లి వాడకం ఎక్కువే. ఇది మన కాలేయాన్ని కాపాడుతుంది. వెల్లుల్లిలో సెలీనియం అని పిలిచే ఖనిజం ఉంటుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.కాలేయ స్రావాలు స్రవించేందుకు ప్రేరేపిస్తుంది. శరీరం నుండి విష వ్యర్ధాలను బయటికి పంపించేలా చేస్తుంది.

గ్రీన్ టీతో కాలేయం పదిలం

సాధారణ టీ కన్నా గ్రీన్ టీ తాగడం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యకరమైన పానీయం. కాలేయం పనితీరును మెరుగుపరచడంలో ముందుంటుంది. రోజుకి రెండుసార్లు గ్రీన్ టీ తాగే వారిలో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

క్యారెట్లు కాలేయానికి బూస్ట్

క్యారెట్లు అనగానే కంటి చూపుకు మాత్రమే అనుకుంటారు, కానీ కాలేయాన్ని కాపాడడంలో కూడా ఈ దుంప ముందుంటుంది. క్యారెట్లలో విటమిన్ A అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా కెరటిన్, మొక్కల సంబంధిత సమ్మేళనాలు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి

వాల్ నట్స్‌తో లివర్ క్లీన్

వీటిని ఆక్రోట్లు అని కూడా పిలుస్తారు. వీటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు అమ్మోనియా ద్వారా కాలేయాన్ని సహజంగా శుభ్రపరిచేలా చేస్తాయి.అమైనో ఆమ్లాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.

Previous articleBetel Leaves uses: తమలపాకు ఉపయోగాలు తెలుసా? క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుంది
Next articleHeat Stroke preventive foods: వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఈ ఆహారాలు తినడం మానేయండి