Maruti Suzuki Fronx: మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఇటీవలే లాంఛ్ అయ్యింది. ఈ కొత్త ఎస్యూవీ ధరలు ఏయే మోడల్స్‌కు ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. మారుతీ సుజుకీ నుంచి ఇప్పటివరకు బ్రెజా, గ్రాండ్ విటార్ ఎస్‌యూవీలు మార్కెట్లో ఉన్నాయి. 2023 ఆటో ఎక్స్‌పోలో మారుతీ సుజుకీ కొత్తగా జిమ్నీతో పాటు ఫ్రాంక్స్ ఆవిష్కరించింది. నెక్సా డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఈ మారుతీసు సుజుకీ ఫ్రాంక్స్ కార్లు కొనుగోలు చేయొచ్చు.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ధర
మోడల్ | ధర రూపాయల్లో |
సిగ్మా 1.2 ఎంటీ | 7.46 లక్షలు |
డెల్టా 1.2 ఎంటీ | 8.32 లక్షలు |
డెల్టా 1.2 ఏఎంటీ | 8.87 లక్షలు |
డెల్టా 1.2 ఎంటీ | 8.72 లక్షలు |
డెల్టా 1.2 ఏఎంటీ | 9.27 లక్షలు |
డెల్టా 1.2 ఎంటీ | 9.72 లక్షలు |
జెటా 1.0 ఎంటీ | 10.55 లక్షలు |
జెటా 1.0 ఏటీ | 12.05 లక్షలు |
ఆల్ఫా 1.0 ఎంటీ | 11.47 లక్షలు |
ఆల్ఫా 1.0 ఏటీ | 12.97 లక్షలు |
ఆల్ఫా 1.0 ఎంటీ డ్యుయల్ టోన్ | 11.63 లక్షలు |
ఆల్ఫా 1.0 ఏటీ డ్యుయల్ టోన్ | 13.13 లక్షలు |
నెక్సాన్, వెన్యూ, సోనెట్‌లకు పోటీ
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఇప్పటికే మార్కెట్లో గణనీయమైన వాటా ఉన్న ఎస్‌యూవీలు టాటా మోటార్స్ నెక్సాన్, హ్యుందయ్ వెన్యూ, కియా సోనెట్ కార్లతో పోటీ పడనుంది. ఈ ఎస్‌యూవీలో ఎల్ఈడీ మల్టీ రిఫ్లెక్టర్ హెడ్ లాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆటోమేటిక్ హెడ్ లాంప్స్, ఎల్ఈడీ రేర్ కాంబినేషన్ లాంప్స్, 16 ఇంచుల అలాయ్ వీల్స్, 9 ఇంచుల హెచ్డీ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అలాగే వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆర్కమైస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్ప్లే – టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే 360 డిగ్రీ వ్యూ కెమెరా, వైర్లెస్ ఛార్జర్, 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.
ఇక మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో లభించనుంది. 1.2 లీటర్ డ్యుయల్ – జెట్ డ్యుయల్ – వీవీటీ పెట్రోల్ (89.73 పీఎస్ ఆఫ్ మ్యాగ్జిమమ్ పవర్, 112 ఎన్ఎం ఆఫ్ పీక్ టార్క్), అలాగే 1.0 లీటర్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ (100.06 పీఎస్ ఆఫ్ మాగ్జిమమ్ పవర్, 147.6 ఎన్ఎం ఆఫ్ పీక్ టార్క్) వెర్షన్లలో లభిస్తుంది. ఇక ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 1.2 లీటర్ యూనిట్ 5 స్పీడ్ ఎంటీ, 5 స్పీడ్ ఏఎంటీతో వస్తుండగా, 1.0 లీటర్ యూనిట్ 5 స్పీడ్ ఎంటీ, 6 స్పీడ్ ఏటీ ఎంపికలతో వస్తోంది.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఎంత మైలేజ్ ఇస్తుంది?
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ 1.0 ఎంటీ కార్ లీటర్‌కు 21.5 కి.మీ. మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే 1.0 ఏటీ ఇంజిన్ 20.01 కేఎంపీఎల్, 1.2 ఎంటీ ఇంజిన్ 21.79 కిలోమీటర్లు, 1.2 ఏఎంటీ వెర్షన్ 22.89 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 37 లీటర్లు.