పిల్లలు అడల్ట్ కంటెంట్ చూడకుండా సేఫ్‌ సెర్చ్‌ నొక్కండి

safe search filter
Photo by Caio from Pexels

పిల్లలు అడల్ట్ కంటెంట్ బారిన పడకుండా ఉండాలంటే సేఫ్‌ సెర్చ్‌ ఫిల్టర్‌ వాడాలి. ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసమో, హోం వర్క్‌ కోసమో పిల్లలు నిత్యం మొబైల్‌ చూడడం తప్పనిసరైంది. ఇలాంటప్పుడు వారు పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా అడల్ట్‌ కంటెంట్‌ చూసే ఆస్కారం ఏర్పడవచ్చు.

ఇలాంటి ఇబ్బందులు పడకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. ఇందులో భాగంగా సేఫ్‌ సెర్చ్‌ ఫిల్టర్స్‌ ఆన్‌ చేసి పెట్టాలి. అదెలాగో చూద్దాం.

ఆండ్రాయిడ్‌ మొబైల్స్, ఐఫోన్‌ అయితే ఇలా..

ముందుగా గూగుల్‌ యాప్‌లోకి వెళ్లండి. అక్కడ కింద రైట్‌ సైడ్‌ కార్నర్‌లో మోర్‌ అనే బటన్‌ ప్రెస్‌ చేయండి.

safe search settings
step 1

మోర్‌ నొక్కగానే మీ గూగుల్‌ అకౌంట్‌ చిత్రం, సెర్చ్‌ యాక్టివిటీ, రీసెంట్, రిమైండర్స్, సెట్టింగ్స్, యువర్‌ డేటా ఇన్‌ సెర్చ్‌ సెండ్‌ ఫీడ్‌బ్యాక్, హెల్ప్‌ అనే ఐకన్స్‌ కనిపిస్తాయి. ఇందులో సెట్టింగ్స్‌ నొక్కండి.

safe search 2
step 2

సెట్టింగ్స్‌ నొక్కగానే మరో పేజీలో జనరల్, నోటిఫికేషన్స్, ఇంట్రెస్ట్స, గూగుల్‌ అసిస్టెంట్, వాయిస్, లాంగ్వేజెస్‌ అండ్‌ రీజియన్, అబౌట్‌ అని వస్తుంది. ఇందులో జనరల్‌ నొక్కండి.

safe search 3
Step 3

జనరల్‌ నొక్కగానే రీసెంట్‌ పేజెస్, పర్సనల్‌ రిజల్ట్స్, డిస్కవర్, డేటా సేవర్, ఆటోకంప్లీట్‌ విత్‌ ట్రెండింగ్‌ సెర్చెస్, సేఫ్‌ సెర్చ్, అల్వేజ్‌ రిట్రై ఆఫ్‌లైన్‌ సెర్చెస్‌ అని కనిపిస్తాయి. ఇందులో సేఫ్‌ సెర్చ్‌ వద్ద కుడివైపు కల బటన్‌ను ఆన్‌ చేయండి. అంటే నాబ్‌ను కుడివైపు జరపాలి. అంతే. ఇప్పుడు మీ మొబైల్‌ సేఫ్‌ సెర్చ్‌ మోడ్‌లో ఉంది.

ఫోన్‌ బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోనూ మార్చుకోండి..

ఫోన్‌ బ్రౌజర్‌ సెట్టింగ్స్‌ కోసం.. మీ బ్రౌజర్‌లో గూగుల్‌ డాట్‌ కామ్‌ స్లాష్‌ ప్రిఫరెన్సెస్‌ పేజీ ఓపెన్‌ చేయండి. ఓపెన్‌కాగానే అందులో సేఫ్‌ సెర్చ్‌ ఫిల్టర్స్‌ అని కనిపిస్తుంది. ఇందులో రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. షో మోస్ట్‌ రెలవెంట్‌ రిజల్ట్స్‌ అని, ఫిల్టర్‌ ఎక్సిప్లిసిట్‌ రిజల్ట్స్‌ అని ఉంటుంది. రెండో ఆప్షన్‌ క్లిక్‌ చేయండి. ఇప్పుడు మీ బ్రౌజర్‌ సేఫ్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌ మాత్రమే అందిస్తుంది. మీరు వాడుతున్నది ఫోన్‌ అయినా, టాబ్లెట్‌ అయినా ఇలాగే చేయాలి.

కంప్యూటర్‌, లాప్ టాప్ అయితే…

మీరు గూగుల్‌ పేజీ ఓపెన్‌ చేయగానే.. కింద కుడివైపు కార్నర్‌లో ప్రయివసీ, టెర్మ్స్, సెట్టింగ్స్‌ అని ఉంటాయి. ఇందులో సెట్టింగ్స్‌ నొక్కండి. ఆ తరువాత అడ్వాన్స్‌డ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ నొక్కండి. ఇది నొక్కగానే ఫైండ్‌ పేజెస్‌ విత్, దెన్‌ నారో యువర్‌ రిజల్ట్స్‌ బై, సేఫ్‌ సెర్చ్, యూసేజ్‌ రైట్స్‌ అని వస్తుంది. ఇందులో సేఫ్‌ సెర్చ్‌ వద్ద షో మోస్ట్‌ రెలవెంట్‌ రిజల్ట్స్‌ అని, ఫిల్టర్‌ ఎక్సిప్లిసిట్‌ రిజల్ట్స్‌ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. ఫిల్టర్‌ ఎక్సిప్లిసిట్‌ రిజల్ట్స్‌ నొక్కండి. అంతే. సేఫ్‌ సెర్చ్‌ మోడ్‌లోకి వచ్చింది.

ఫ్యామిలీ లింక్ యాప్ గురించి ఇక్కడ ఇంకా వివరంగా చదవండి. ఇంకా సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలో చూడండి.

Previous articleప్రభాస్‌ జంటగా దీపికా పదుకొనె
Next articleఫిరాయింపులకు అడ్డుకట్ట వేయని పదో షెడ్యూలు