ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ .. ఇదిగో లిస్ట్

crime thrillers in ott

ఎక్కువ మందికి నచ్చే జోనర్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీస్ ఎప్పుడంటే అప్పుడు చూసేందుకు ఓటీటీలు అందుబాటులో ఉండనే ఉన్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఆసక్తిగా కూర్చుని చూసేవి సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే. అందుకేనేమో తెలుగులో ఈ మధ్యన ఎక్కువగా ఈ సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. వివిధ ఓటీటీలలో ప్రేక్షకులను అలరిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమాల జాబితా మీ కోసం.. ఎంచుకుని ఎంజాయ్ చేయండి..

1. నాంది (ఆహా ఓటీటీ)

కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత అల్లరి నరేష్ చేసిన సినిమా ఇది. మొన్నటి వరకు కామెడీకే పరిమితమైన నరేష్ ఈ సినిమాలో సీరియస్ గా కనిపించాడు. సూర్యప్రకాష్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. సెక్షన్ 211 గురించే చెప్పే ఈ సినిమాలో తన మీద పడ్డ హత్యానేరం నుంచి, లాయర్ సాయంతో ఎలా బయటపడ్డాడన్నదే కథ. 

2. అనగనగా ఓ అతిధి (ఆహా ఓటీటీ)

పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ గా నటించిన సినిమా ఇది. కాకపోతే ఆ బోల్డ్ నెస్ అంతా మాటల్లోనే చూపించింది. ఒక అపరిచిత వ్యక్తి ఇంటికి వస్తే, ఆ వ్యక్తి దగ్గర బోలెడంత డబ్బు ఉంటే… ఆ పేదకుటుంబం ప్రవర్తన ఎలా మారుతుందన్నది కథ. ఈ సినిమాలో చివర్లో ట్విస్టు ఉంటుంది. అది ప్రేక్షకులకు షాక్కు గురిచేయడం ఖాయం. 

3. రన్ (ఆహా ఓటీటీ)

నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ రన్. లక్ష్మీ కాంత్ చెన్నా దర్శత్వం వహించారు. కొత్తగా పెళ్లయిన యువకుడి జీవితం ఆనందంగా సాగుతున్న వేళ… హఠాత్తుగా అతని భార్య ఆత్మహత్య చేసుకుంటే.. అనే కథనంతో సాగే కథ ఇది. అయితే అది ఆత్మహత్యా లేక హత్యా అన్న అనుమానంతో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. మధ్యలో వచ్చే ట్విస్టు కూడా అదిరిపోతుంది. గంటన్నర పాటూ ప్రేక్షకుడికి సస్పెన్స్ క్రియేట్ చేసి కదలకుండా కూర్చొపెట్టే సినిమా. 

4. హిట్ (అమెజాన్ ప్రైమ్)

హైదరాబాదీ కుర్రాడు విశ్వక్ సేన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించే మూవీ ‘హిట్’. మర్డర్ కేసును పరిశోధన చేసే పోలీస్ ఆఫీసర్ గా, మానసిక సమస్యతో బాధపడే వ్యక్తిగా… విశ్వక్ బాగా నటించాడు. ప్రీతి అనే అమ్మాయి మర్డర్ కేసును చేధించడం అనే కథనంతో సినిమా సాగుతుంది. హత్య చేసింది ఎవరో ప్రేక్షకుడు ఊహించలేడు. అంత పకడ్బందీ కథనంతో సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది హిట్. 

5. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (అమెజాన్ ప్రైమ్)

ఇదొక ఫన్ క్రైమ్ డ్రామా. నవీన్ పొలిశెట్టి నటన అదనపు ఆకర్షణ. ప్రైవేటు డిటెక్టివ్గా రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న శవాల పై ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. అందులో తీగ లాగితే డొంక కదిలినట్టు పెద్ద వ్యవహారమే బయట పెడతాడు ఆత్రేయ. ఓ పక్క ఇన్వెస్టిగేషన్ మరో పక్క కామెడీ కూడా పండించడంతో సక్సెస్ అయ్యాడు నవీన్. 

6. 16 (అమెజాన్ ప్రైమ్)

ఇదొక అద్బుత మైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్ తో కథ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆసక్తిగానే ఉంటుంది. ఇదొక తమిళ డబ్బింగ్ మూవీ. తెలుగు నటులు ఇందులో పెద్గగా కనిపించకపోయినా కథ మిమ్మల్ని అలరిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే వాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. 

7. కిల్లర్ (జీ5)

అర్జున్ సర్జా, విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఇందులో అర్జున్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడు. విజయ్ ఆంటోనీ పాత్ర సస్పెన్స్ తో కొనసాగుతోంది. సెకండాఫ్ వచ్చాకే అతనెవరో తెలుస్తుంది. అతను ఎందుకు మర్డర్లు చేస్తున్నాడో కూడా సెకండాఫ్ లోనే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఇది తమిళ డబ్బింగ్ మూవీ. 

8. రాక్షసుడు (ఎమ్ఎక్స్ ప్లేయర్)

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో సాగే సినిమా రాక్షసుడు. పోలీస్ కానిస్టేబుల్గా ఉండి ఆడపిల్లల మర్డర్ కేసును తేల్చేందుకు ప్రయత్నిస్తాడు. స్కూలు పిల్లలను చంపుతున్నదెవరో కనిపెడతాడు. విలన్ ఎవరో ప్రేక్షకుడు ఊహించలేడు. ట్విస్టులతో కూడిన సినిమా ఇది. తప్పకుండా అలరిస్తుంది. 

9. క్షణం (ఎమ్ ఎక్స్ ప్లేయర్)

హఠాత్తుగా కనిపించకుండా పోయిన ఒక పాపని వెతకడం అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. అమెరికాలో ఉన్న అడివి శేష్ ను అతని మాజీ ప్రేయసి అదా శర్మ తన పాప కనిపించడం లేదంటూ పిలుస్తుంది. ఇండియా వచ్చిన హీరో పాప ఏమైంది? కూతురు కనిపించకపోతే అదా శర్మ తననే ఎందుకు పిలిచింది? అనే అంశాలను కనిపెడతాడు. ఈ క్రమంలో ప్రేక్షకుడిని బోలెడన్నీ ట్విస్టులు కూడా అలరిస్తాయి. చూస్తున్నంత సేపు సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.

10. 118 (హాట్ స్టార్)

కళ్యాణ్ రామ్, నివేదా థామస్ నటించిన సినిమా ఇది. కలల్లో వచ్చే సంఘటనల ఆధారంగా హత్య కేసును చేధిస్తాడు హీరో. సినిమా కథనం ఆసక్తిగా సాగుతుంది. ప్రతి క్లూ హీరోకు కలల్లోనే కనిపిస్తుంది. చివరికి మర్డర్ కేసు ద్వారా పెద్ద స్కామ్ ను బయటపెడతాడు. కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలలో ఈ మూవీ ఆకట్టుకునేదనే చెప్పాలి.

ఇంతేకాదు గతం (అమెజాన్ ప్రైమ్), శమంతక మణి (ఎమ్ ఎక్స్ ప్లేయర్), పవర్ ప్లే (అమెజాన్ ప్రైమ్), దృశ్యం (ఎమ్ ఎక్స్ ప్లేయర్), గరుడు వేగ (ఎమ్ ఎక్స్ ప్లేయర్), వి (అమెజాన్ ప్రైమ్), నిశ్శబ్ధం (అమెజాన్ ప్రైమ్), యూటర్న్ (అమెజాన్ ప్రైమ్)… ఈ సినిమాలన్నీ ప్రేక్షకులకు సస్పెన్స్ థ్రిల్లింగ్ ను అందిస్తాయి.

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleశామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M32 విడుదల
Next articleక్లబ్‌హౌజ్‌ : సోషల్‌ మీడియా యాప్‌.. వినండి.. మాట్లాడండి