Foods to Avoid for Children Under 5: ఐదేళ్ల లోపు పిల్లలకు ఎలాంటి ఆహారం తినిపించకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
పిల్లలకు తినిపించే ఆహారంపై తల్లిదండ్రులు చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఏది తినిపించాలో.. ఏది తినిపించకూడదో అని సతమతవుతారు. కొన్నిసార్లు ఏమరపాటుతో పెద్దలు తినేదే పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. అవి పిల్లలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.
పిల్లలకు తినిపించే ఆహారంపై తల్లిదండ్రులు చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఏది తినిపించాలో.. ఏది తినిపించకూడదో అని సతమతవుతారు. కొన్నిసార్లు ఏమరపాటుతో పెద్దలు తినేదే పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. అవి పిల్లలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. ఆ సమయంలో వారికిచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే పిల్లలకు, వారి ఆరోగ్యాభివృద్ధికి తగిన పోషకాహారం అవసరం. పిల్లలకు నచ్చుతున్నాయి కదా అని వారు అడిగిన ఫుడ్ ఇచ్చేయకండి. ఒకవేళ వాళ్లు మారం చేస్తే వాటిని మితంగా ఇవ్వండి. లేదంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్ననాటి నుంచే పిల్లలను వేధిస్తాయి. ఇవి ఎదుగదలపై చాలా దుష్ప్రభావం చూపిస్తాయి.
తీపి పదార్థాలు
పిల్లులు తీపి పదార్థాలు చాలా ఇష్టంగా తింటారు. చాక్లెట్లు, క్యాండీలు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయి. అయినప్పటికీ చక్కర పిల్లలకు అంతమంచివి కావు. అవి సాచరైన్, నియోటామ్, ఎసిసల్ఫేమ్-కె, సుక్రలోజ్ వంటి కృత్రిమ స్వీటెనర్లతో నిండి ఉంటాయి. ఇవి మంచికంటే ఎక్కువ హాని కలిగిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ చక్కెర కలిగిన చాక్లెట్లు, క్యాండీలు పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తాయి. ఇది వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి వారికి ఇష్టమైనా చాక్లెట్లను కాస్త లిమిటెడ్‌గా ఇవ్వండి.
రిఫైన్డ్ ఆయిల్
రిఫైన్డ్ ఆయిల్‌ను అధిక టెంపరేచర్ వద్ద కెమికల్ ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. దాని ఫలితంగా దానిలో పోషకాలు పూర్తిగా తగ్గిపోతాయి. పైగా ఇది పూర్తిగా అధిక స్థాయి ట్రాన్స్ ఫ్యాట్లను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కడుపులో గ్యాస్ పెంచవచ్చు. కాబట్టి ఐదేళ్ల లోపు పిల్లలకు మెరుగైన ఆరోగ్యం కోసం మంచి వంట నూనెలను ఎంచుకోవడం మంచిది. రిఫైన్డ్ ఆయిల్స్‌తో చేసే ఆహారానికి దూరంగా ఉండాలి.
కెఫిన్
కెఫిన్ మీ పిల్లల నాడీ వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు దానిని సేవించినప్పుడు అది వారి నిద్రకు భంగం కలిగిస్తుంది. అంతేకాకుండా పిల్లల్లో ఏకాగ్రతను దెబ్బతీసేలా చేస్తుంది. అంతేకాకుండా పిల్లలకు ఇదో వ్యసనమయ్యే ప్రమాదముంది.
కెఫిన్ పిల్లల్లో ఆందోళన వంటి దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలకు కెఫిన్ ఆధారిత ఉత్పత్తులు ఇవ్వకుండా ఉండడమే మంచిది.
కూల్ డ్రింక్స్
కూల్ డ్రింక్, సోడా వంటి పానీయాలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే అవి వారి ఆరోగ్యంపై నెగిటివ్‌గా ప్రభావం చూపిస్తాయి. పైగా వీటిలో అధిక స్థాయి చక్కెరలు ఉంటాయి. కాబట్టి ఇవి దంత సమస్యలు, ఎముక సమస్యలు, అలెర్జీలు, ఊబకాయం, తలనొప్పి వంటి మొదలైన వాటికి కారణమవుతాయి. అంతేకాకుండా ఈ పానీయాలు పిల్లలను డీహైడ్రేట్ చేస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
పిల్లలకు ఎల్లప్పుడూ కొత్త ఆహారాలను పరిచయం చేయవచ్చు కానీ.. వాటిని పరిమితంగా పెట్టవచ్చు. క్రమంగా వారికి పరిమితి మొత్తంలో ఫుడ్స్ తినిపించండి. ఏదైనా రియాక్షన్స్ గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.