అమేజ్‌ఫిట్ బిప్ యూ ప్రొ స్మార్ట్ వాచ్ .. అలెక్సా ఇన్ బిల్ట్, ఆక్సిజన్ లెవల్స్ సహా..

amazfit bip pro
Image: Amazfit

అమేజ్‌ఫిట్ బిప్ యూ ప్రొ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో ఈ ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు ఫిట్‌నెస్ బాండ్‌లలో వినూత్న ఆవిష్కరణలకు ప్రాణం పోసే అమేజ్‌ఫిట్ వెల్లడించింది.

ఈ బ్రాండ్ తాజాగా బిప్ సిరీస్‌లో తాజా ఆవిష్కరణ అయిన అమేజ్‌ఫిట్ బిప్ యూ ప్రొ స్మార్ట్ వాచ్ అలెక్సా ఇన్‌బిల్ట్‌ ‌తో వస్తోంది. అంటే వాయిస్ కమాండ్స్‌తో కొన్ని ఫంక్షన్లను నిర్వహించవచ్చు.

బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవల్స్ (ఎస్‌పీవో 2) కూడా తెలుసుకోవడం దీని మరో ప్రత్యేకత. కోవిడ్ కాలంలో ప్రతి ఇంటా ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ తెలుసుకునే యంత్రాన్ని విడిగా తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా.. దీనిలోనే తెలుసుకోవచ్చు.

గత ఏడాది ఆవిష్కరించిన అమేజ్‌ఫిట్ బిప్ యూ స్మార్ట్ వాచ్‌లాగే దీనిలో కూడా 50 వాచ్ ఫేసెస్‌ను మార్చుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఇష్టమైన బ్యాక్ గ్రౌండ్‌ను అప్ లోడ్ కూడా చేసుకోవచ్చు.

అమేజ్‌ఫిట్ బిప్ యూ ప్రొ స్మార్ట్ వాచ్ కొనుగోలు ఎలా

రెండు కలర్ వేరియంట్లలో దొరుకుతున్న అమేజ్‌ఫిట్ బిప్ యూ ప్రొ స్మార్ట్ వాచ్ ధర రూ. 4,999. అమేజాన్ ‌లోనూ, అమేజ్‌ఫిట్ వెబ్ సైట్ లోనూ లభ్యమవుతాయి.

అమేజ్‌ఫిట్ బిప్ యూ స్మార్ట్ వాచ్ ధర రూ. 3,999 గా ఉంది. ప్రి ఆర్డర్ విధానంలో ఇప్పుడు బుక్ చేస్తే ఏప్రిల్ 14 నుంచి డెలివరీ చేస్తారు.

అమేజ్‌ఫిట్ బిప్ యూ ప్రొ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు ఇవీ..

1.43 ఇంచుల హెచ్డీ టీఎఫ్టీ ఎల్సీడీ కలర్ డిస్ ప్లే (320‘302 పిక్సెల్స్), 2.5 కార్నింగ్ గొరిల్లా 3 గ్లాస్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మెజర్‌మెంట్, హెల్త్ అసెస్‌మెంట్ సిస్టమ్, స్రెస్ మానిటరింగ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

31 గ్రాముల లైట్ వెయిట్ డిజైన్, హై ప్రెసిషన్ జీపీఎస్‌తో కూడిన 60 ప్లస్ స్పోర్ట్ మోడ్, 5 ఏటీఎం (50 మీటర్ల) వాటర్ రెసిస్టెన్స్, 9 రోజుల బ్యాటరీ లైఫ్, యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఇలా అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి.

వాయిస్ కంట్రోల్‌తో మ్యూజిక్ ఇంకా చాలా..

ఇన్ బిల్ట్ మోడ్ లో అలెక్సా రావడంతో వాయిస్ కంట్రోల్ ఆప్షన్‌తో మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. అలారం సెట్ చేసుకోవచ్చు. వాతావరణ అంచనాలు తెలుసుకోవచ్చు. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అంటే ట్రాఫిక్ అప్ డేట్స్, స్పోర్ట్స్ అప్ డేట్స్ .. ఇలా చాలా తెలుసుకోవచ్చు.

హై ప్రెసిషన్ జీపీఎస్ సహాయంతో వేగం, దూరం కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. పీపీజీ బయో ట్రాకింగ్ ఆప్టికల్ సెన్సర్ల సాయంతో హార్ట్ రేట్ మార్పులు తెలుసుకోవచ్చు, కాలరీల ఖర్చు, ఫిట్ నెస్ కు సంబంధించి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.

60 స్పోర్ట్ మోడ్స్ లో మనకు ఫిట్ నెస్ వివరాలు అందిస్తుంది. అంటే రన్నింగ్, వాకింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, స్కేటింగ్, సైక్లింగ్, యోగా, స్కేటింగ్, డాన్సింగ్, ఇలా రకరకాల స్పోర్ట్స్ లో మన ఫిట్ నెస్ వివరాలు తెలుసుకోవచ్చు.

పీరియడ్స్ సైకిల్ ట్రాకర్ కూడా అమేజ్‌ఫిట్ బిప్ యూ ప్రో స్మార్ట్ వాచ్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి: 

ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ .. ఎలా వాడాలి? బెస్ట్‌ ట్రాకర్స్‌ ఏవి?

Previous articleఆ కిల్లర్ పిల్లాడు ఎక్కడున్నాడు?
Next articleThe Coalition Years 1996-2012 : ప్రణబ్ ముఖర్జీ అక్షరీకరణ