నోరూరించే స్పైసీ చేప‌ల పులుసు రెపిపీ… సింపుల్‌గా ఇలా చేయండి

fish curry
చేపల పులుసు

చేప‌ల పులుసులో ఉన్న మ‌జా వేరే లెవెల్. చేప‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలామంది చేప‌ల‌ను ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేస్తారు. అలాగే ఆంధ్రా వంట‌కాల్లో చేప‌ల పులుసు ప్ర‌థమంగా ఉంటుంది. చేప‌లతో వివిధ ర‌కాలైన వంట‌కాల‌ను చేసుకుంటూ ఉంటాం. కొంద‌రు పులుసుల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డితే మ‌రికొంద‌రు చేప‌ల ఇగురు, చేప‌ల ఫ్రై‌తోనే భోజ‌నాన్ని లాగించేస్తుంటారు. చేప‌ల వంట‌కాల‌ను సాధార‌ణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధ‌మైన ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తుంటారు. ఆంధ్రాలో చేప‌ల‌కు మాత్రం ప్ర‌త్యేక స్థానం ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు. చేప‌ల్లో ప‌లు ర‌కాలు ఉన్నాయి. అంతేక‌దండోయ్.. ప్ర‌ధానంగా గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల‌కు అమితమైన ప్రేమ. అన్ని ర‌కాలైన చేప‌ల‌ను వండ‌డంలో గోదావ‌రి వాసుల‌ది పైచేయి. మ‌రి ఘుమ‌ఘులాడే చేప‌ల పులుసును ఎలా త‌యారో చేయాలో చూసేయండి.

చేపల పులుసు త‌యారీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు:

  1. చేప ముక్క‌లు – కిలో
  2. ఉల్లిపాయ‌లు – నాలుగు (పెద్ద సైజువి)
  3. ప‌చ్చిమిర్చి –  నాలుగు
  4. వెల్లుల్లి – ఐదు రెబ్బ‌లు
  5. అల్లం – చిన్న ముక్క
  6. జీల‌క‌ర్ర – రెండు టీ స్పూన్లు
  7. కారం –  మూడు టేబుల్ స్పూన్లు
  8. ప‌సుపు – ఒక టీ స్పూన్
  9. ఉప్పు – రుచికి త‌గినంత
  10. నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
  11. కొత్తిమీర – కొద్దిగా
  12. చింత‌పండు

చేపల పులుసు త‌యారీ విధానం :

  1. ముందుగా చేప ముక్క‌ల‌ను శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్క‌లు, వెల్లుల్లి రెబ్బ‌లు, జీల‌క‌ర్ర‌ వేసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.
  3. స్ట‌వ్ మీద వెడ‌ల్పాటి బాణ‌లి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల వ‌ర‌కూ నూనెను వేసుకొని నూనె కాగాక ముందుగా సిద్దం చేసుకుని పెట్టుక‌ున్న ఉల్లిపాయ మ‌సాలా పేస్ట్‌ను వేపుకోవాలి.
  4. ఇలా వేగిన పేస్ట్‌లో ప‌చ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేపుకోవాలి.
  5. త‌ర్వాత అందులో కొంచెం ప‌సుపు వేయాలి. బాగా క‌ల‌పాలి.
  6. మ‌సాలా ప‌చ్చివాస‌న పోయేంత‌వ‌ర‌కూ బాగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న మ‌సాలలో చేప ముక్క‌లు వేపుకుని నెమ్మదిగా క‌లియ‌తిప్పాలి. గరిట‌తో క‌లిపితే చేప‌ల ముక్క‌లు విరిగిపోయే ప్ర‌మాదం ఉంటుంది.
  7. ఇలా క‌ద్దిగా క‌లుపుకున్న త‌ర్వాత కారం, త‌గినంత ఉప్పు వేసుకుని చేప ముక్క‌ల‌ను మ‌గ్గ‌నివ్వాలి.
  8. మ‌గ్గిన చేప‌ల‌లో చింత‌పండు పులుపును యాడ్ చేసుకోవాలి. త‌ర్వాత ఆ  పులుపును బాగా ముక్క‌ల‌కు ప‌ట్టేట‌ట్లు క‌లియ‌బెట్టాలి. 20 నిమిషాల వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఆపై కొద్డిగా కొత్తీమీరను వేసుకోవాలి.

అంతే ఎంతో రుచిక‌ర‌మైన ఘుమ‌ఘుమ‌లాడే చేప‌ల పులుసు సిద్ధం అయిపోయిందంతే… కొందరు చేపల పులుసులో అల్లం పేస్ట్ కూడా వేస్తారు. మీరు అల్లం లేకుండా ఒకసారి, అల్లంతో ఒకసారి ట్రై చేయండి. ఏది నచ్చితే అది కంటిన్యూ అయిపోండి. 

పిల్లలు, పెద్దలు టీవీలకే అతుక్కుపోతున్న ఈరోజుల్లో వారి కంటి చూపు మెరుగుదల కోసం మాంసాహారులు చేపలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవడం మంచిది. శాఖాహారులైతే ఆకు కూరలు, క్యారట్‌ను తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleOTT Releases This week: ఓటీటీల్లో ఈ వారం వ‌చ్చేసిన సినిమాలివే..
Next articleరోజూ సూర్య‌న‌మ‌స్కారాలు చేయ‌డం వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలా?