Side Effects of Excessive Egg : గుడ్లు ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త

WhatsApp Image 2023-05-06 at 5.33.18 PM (2)
గుడ్లు ఎక్కువగా తీసుకుంటే కలిగే అనర్థాలు

Side Effects of Excessive Egg : గుడ్లు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. పైగా దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. కానీ వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్కలంగా పోషకాలు..

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అందరూ గుడ్లు తీసుకుంటారు. ఎందుకంటే ఇవి పూర్తిగా ఆరోగ్యప్రయోజనాలు అందించే పోషకాలతో నిండి ఉంటాయి. అంతేకాకుండా ఇవి చాలా రుచికరమైనవి. అందుకే వీటిని ఉడికించి, ఆమ్లెట్లు, బుర్జీ, కూరల రూపంలో తీసుకుంటూ ఉంటారు. పైగా వీటిని వండుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా జిమ్​కి వెళ్లే వారు తగిన పోషకాల కోసం ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటారు.

ఎనర్జీ కోసం

గుడ్లలో శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, అవసరమైన ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి రోజంతా మీరు తగినంత శక్తితో, ఎనర్జీగా ఉండేందుకు సహాయం చేస్తాయి. ఆరోగ్యానికి మంచిదే కదా అని చాలామంది వీటిని ఎక్కువగా తీసేసుకుంటారు. మంచిదే కదా అని మెడిసిన్ అయినా ఎక్కువగా తీసుకుంటే అస్సలు మంచిది కాదు. అలాగే గుడ్లు కూడా ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఎక్కువైతే అనర్థమే

శరీరానికి కార్బోహైడ్రేట్లు, కేలరీలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. వాటిని కరిగించడం కూడా అంతేముఖ్యం. కేవలం ఇన్​ టేక్ ఉండి.. బయటకు పంపకుంటే అనర్థాలు తప్పవు అంటున్నారు నిపుణులు. అందుకే పరిమిత మొత్తంలో వీటిని తీసుకోవాలి.

అధిక కొలెస్ట్రాల్

గుడ్లను తమ బ్రేక్​ఫాస్ట్​లో తీసుకోవాలనుకునేవారికి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. ఎక్కువగా తీసుకునే వారికి కొలెస్ట్రాల్ పెరిగినట్లు పలు అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్​తో ఇబ్బందిపడేవారు వైద్యుడిని సంప్రదించి గుడ్లు బ్రేక్​ఫాస్ట్​గా​ తీసుకోవచ్చు అంటున్నారు.

గుండె ప్రమాదం

ఎక్కువ మోతాదులో గుడ్లు తీసుకుంటే.. అవి గుండె ప్రమాదాలు పెంచుతాయని JAMA జర్నల్‌ ప్రచురించింది. అధ్యయనం ప్రకారం రోజుకు సగం గుడ్డు అదనంగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతాయని తెలిపింది. కాబట్టి వాటిని సరైన మోతాదులో తీసుకోవాలి అంటున్నారు. ఒక్కోక్కరికి ఇది భిన్నంగా ఉంటుంది కాబట్టి.. మీరు నిపుణులను సంప్రదించి వాటిని తీసుకోవచ్చు.

బరువు పెరిగే అవకాశం

గుడ్లు సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఎక్కువగా తీసుకుంటే మీరు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పచ్చిసొన ఎక్కువగా తీసుకుంటే మీరు బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. పచ్చసొనలో కొవ్వు ఉంటుందని.. ఇది ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు చెడు కొవ్వుగా పేరుకుపోయి బరువు పెరిగేలా చేస్తుందంటున్నారు.

జీర్ణ సమస్యలు

గుడ్లు ఎక్కువగా తీసుకుంటే అది మీ జీర్ణక్రియలో సమస్యలకు దారి తీస్తుంది. గుడ్లలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అయితే వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. తద్వార మీరు ఉబ్బరం, వికారం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరికి ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది.

రోజుకు ఎన్ని తీసుకోవచ్చు

ఆరోగ్యకరమైన భోజనంలో భాగంగా రోజుకు ఒక గుడ్డు, వారానికి మూడు నుంచి నాలుగుసార్లు తీసుకుంటే పెద్దవారికి మంచిది. పిల్లలు అయితే రోజూ ఒకటి సులభంగా తీసుకోవచ్చు. గుండె సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వారానికి మూడు గుడ్లు తీసుకోవచ్చు.

Previous articleVaginal Infections : యోని ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతున్నాయా? ఇవి ట్రై చేయండి..
Next articleCustard Apple Health Benefits: సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు