ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో డాక్యు సిరీస్: హత్య కేసు కథతో ఓటీటీలోకి క్రైమ్ స్టోరీ

the indrani mukerjea docu series
ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్ నెట్ ఫ్లిక్స్ పోస్టర్

ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా ఇది తెరకెక్కింది. ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవనుంది? ఎప్పుడు విడుదల కానుంది తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

2012లో షీనా బోరా హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియా ఈ కేసులో 2015లో అరెస్టయింది. కూతురిని చంపేసిందన్న అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. ఈ కథాంశంతో ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ పేరిట డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫిబ్రవరి 23న విడుదల కానుంది.

ఇంద్రాణి ముఖర్జియాకు ఇద్దరు సంతానం. కూతురు షీనా బోరా, కొడుకు మైకేల్. మొదటి పెళ్లి పెటాకులు అవడంతో వీరిద్దరూ అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగారు. మొదటి భర్త సిద్ధార్థతో విడాకులయ్యాక సంజీవ్ ఖన్నాతో ఇంద్రాణి ముఖర్జియా రెండో పెళ్లి చేేసుకుంది. ఈ పెళ్లి కూడా పెటాకులు కావడంతో పీటర్ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. ఇదే సమయంలో కూతురు షీనా బోరా తల్లి దగ్గరికి వచ్చింది.

ఆస్తి సంబంధిత వివాదాలు, కుటుంబ తగాదాల కారణంగా ఇంద్రాణి ముఖర్జియా తన కూతురు షీనా బోరాను గొంతు నులిమి చంపేసిందన్న అభియోగాలు నమోదయ్యాయి. రెండో భర్త సంజీవ్ ప్రమేయం కూడా ఇందులో ఉందని విచారణలో పోలీసులు గుర్తించారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో అనేక ఆర్థిక లావాదేవీలు ఈ వ్యవహారంలో నిమగ్నమై ఉండడం ఆసక్తి రేపింది.

ఇంద్రాణి ముఖర్జీ హత్యకేసులో ఆరేళ్ల పాటు జైల్లో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ సమయంలో ఇంద్రాణి ముఖర్జీయా అన్‌బ్రోకెన్ అన్ టోల్డ్ స్టోరీ పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో తదితర ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ కనిపిస్తోంది. ఈ ది ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్ వెబ్ సిరీస్‌పై కూడా ఇదే రీతిలో ఆసక్తి నెలకొంది.

Previous articleCastor Oil Benefits: ఆముదం నూనె చేసే అద్భుతాలు తెలుసా? జుట్టు నుంచి చర్మ సమస్యల వరకు సహజ నివారణి
Next articleఆంధ్ర‌ స్టయిల్‌లో కొబ్బ‌రి పులావ్ రెసిపీ.. ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది