Egg Fry Recipe: త‌క్కువ టైంలో ఈజీగా ఎగ్ ఫ్రై రెసిపీ ఇలా చేయండి

egg fry recipe
ఎగ్ ఫ్రై రెసిపీ"Egg fry - Kerala Style" by Rameshng is licensed under CC BY-SA 2.0

ఎగ్ ఫ్రై రెసిపీ: కోడిగుడ్డుతో చాలా ర‌కాలుగా వంట‌కాలు చేసుకుంటారు. చాలా ఈజీగా, టేస్టీగా ఉండే వాటిలో కోడిగుడ్డుతో చేసిన వంట‌లు మొద‌టిగా చెప్పుకోవ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి కూడా ఇవి అద్భుత‌మే. కోడిగుడ్డుతో ఎప్పుడూ గ్రేవీ కూర‌లే కాకుండా కొంచెం డిఫెరెంట్‌గా ఫ్రై రెసిపీల‌ను కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఒక‌టే ఈ ఎగ్ ఫ్రై రెసిపీ. 

దీని త‌యారీ చాలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు.అంతేకాదు ఇది అన్నంలో మాత్ర‌మేనా.. చ‌పాతీ , రోటీల‌కు కూడా ఈజీగా సెట్ అయ్యే వంట‌కం. పిల్ల‌లు, పెద్ద‌ల‌తో స‌హా అంద‌రూ ఇష్ట‌ప‌డే ఈ ఎగ్ ఫ్రై రెసిపీని ఎలా చేయాలో చూసేయండి.

ఎగ్ ఫ్రై రెసిపీకి కావ‌ల‌సిన ప‌దార్థాలు: 

  1. గుడ్లు – నాలుగు 
  2. ఉల్లిపాయ‌లు – రెండు 
  3. కారం – రెండు టీ స్పూన్లు 
  4. ఉప్పు – ఒక టీస్పూన్
  5. ప‌సుపు – పావు టీ స్పూన్ 
  6. వెల్లుల్లి – మూడు రెబ్బ‌లు 
  7. ల‌వంగాలు – రెండు 
  8. దాల్చిన చెక్క – రెండు 
  9. నూనె – రెండు టేబుల్ స్పూన్లు 
  10. కొత్తిమీర త‌రుగు – కొద్దిగా 
  11. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్ 
  12. క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు

ఎగ్ ఫ్రై రెసిపీ త‌యారీ విధానం:

  1. ముందుగా చిన్న రోలులో కారం, ప‌సుపు , ఉప్పు, వెల్లుల్లి రెబ్బ‌లు, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, వేసుకుని దంచుకోవాలి. ఇలా దంచిన మ‌సాలాని ప‌క్క‌న పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు స్టౌ‌పై పాన్ పెట్టుకుని త‌గినంత నూనె పోసుకుని నూనె వేడ‌య్యాక అందులో కోడిగుడ్ల‌ను ఒక్కోక్క‌టిగా ప‌గ‌ల‌ కొట్టుకుని వేసుకోవాలి. 
  3. కొంచెం వేడయ్యాక కొద్దిగా క‌రివేపాకు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన త‌ర్వాత అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, ముందుగా దంచుకున్న మ‌సాలాను వేసుకుని మ‌రి కొంచెం ఫ్రై చేసుకోవాలి.
  4. ఆ త‌ర్వాత కొద్దిగా కొత్తిమీర‌ను వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే 5 నిమిషాల్లోనే ఎగ్ ఫ్రై మ‌సాలా రెసిపీ సిద్దం. 

వేడివేడిగా తింటే అదిరిపోతుంది. ఇది ర‌సం, సాంబార్, ప‌ప్పు లాంటివి చేసుకున్న‌ప్పుడు సైడ్ డిష్‌గా బావుంటుంది. పిల్ల‌లు బాగా ఇష్టంగా తింటారు. 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Previous articleపుట్ట‌గొడుగుల్లో లాభాలు పుష్క‌లం.. వారానికోసారి తినాల్సిందే
Next articleఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ ఓటీటీ న్యూ రిలీజెస్‌ ఇవే.. ఎంజాయ్